*ముసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి – భూసేకరణ అంశాలపై కలెక్టర్‌తో ఉప్పల్ ఎమ్మెల్యే భేటీ*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 07:
ముసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ, ల్యాండ్ పూలింగ్, భూ యజమానులకు కల్పించాల్సిన ప్రయోజనాలు తదితర అంశాలపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జి.ఓ .Ms.No.240, MA అండ్ UD (Plg.1) డిపార్ట్మెంట్ , తేదీ 19-09-2026 ద్వారా ముసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ఏరియాలో ల్యాండ్ పూలింగ్ అమలుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు.ముసీ ప్రాజెక్టు పరిధిలో పటా భూములు, బఫర్ ఏరియా, రివర్ బెడ్,FTL ప్రాంతాలు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు తదితర వివిధ రకాల భూములు ఉన్నందున, ఆయా భూ యజమానులు, రైతులు, బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పారదర్శకంగా అమలు చేయాలని ఎమ్మెల్యే కోరారు.ప్రత్యేకంగా భూ యజమానులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు/డెవలప్ చేయగల భూమి కేటాయింపు, ల్యాండ్ పూలింగ్‌లో వాటా, పరిహారం, స్టాంప్ డ్యూటీ తదితర అంశాలపై అధికారులతో సమన్వయం చేసుకుని బాధితులకు స్పష్టత కల్పించాలని కోరారు.
1400 ఇవ్వాలని కోరారు
ప్రతాప సింగారం వద్ద 1750 ఇస్తున్నారు అని తెలిపారు
60:40 ప్రకారం ఇవ్వాలని కోరడం జరిగింది.ముసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, భూ యజమానుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, న్యాయబద్ధంగా మరియు పారదర్శకంగా ముందుకు సాగాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సల్ల వీరారెడ్డి, పంగా మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment