Tuesday, October 20, 2026

ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పారా గేమ్స్ లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ జీవాంజి దీప్తి ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు_

*ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పారా గేమ్స్ లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ జీవాంజి దీప్తి ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 20:

జపాన్‌లో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2026లో మహిళల 400 మీటర్ల T20 రేసును 56.36 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించి, స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ దీప్తి జీవాంజికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.దీప్తి సాధించిన ఈ చారిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో పారా అథ్లెట్లకు, యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదల, ఆత్మవిశ్వాసంతో శ్రమిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని దీప్తి నిరూపించారని అన్నారు. భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ పతకాలు సాధించి, తెలంగాణ, భారతదేశ కీర్తిప్రతిష్ఠలను అంతర్జాతీయ వేదికలపై చాటాలని ఆకాంక్షించారు.గతంలో కూడా ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పారాలింపిక్స్ 2024లో పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ జీవాంజి దీప్తి ని సెప్టెంబర్ 7,2024 నాడు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సత్కరించారు. విశ్వ వేదికపై సత్తా చాటిన పారా అథ్లెట్ దీప్తికి గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, 1 కోటి రూపాయల నగదు బహుమానం, వరం‌గల్‌లో 500 గజాల స్థలం, కోచ్ నాగపురి రమేష్ కు రూ. 10 లక్షలు బహుమతిగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అప్పుడు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.తమకు  అందిస్తున్న ప్రోత్సాహంపై దీప్తి జీవాంజి, కోచ్ రమేష్‌లు సీఎంగారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

No comments:

Post a Comment