Tuesday, October 20, 2026

మరికల్ శివాలయం దుర్గామాత భజన పోటీలు - ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు_

*మరికల్ శివాలయం దుర్గామాత భజన పోటీలు -  ప్రతిభకు బహుమతులు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 19:

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మరికల్ గ్రామం శివాలయం లో శరన్నవరాత్రి / దేవి నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకుని భక్తిభావాన్ని, గాన మాధుర్యాన్ని అమ్మవారి చరణాల చెంత సమర్పించి, ప్రతిభను అందరికీ తెలిసేలా దుర్గామాత దగ్గర భజన పోటీలు నిర్వహించి మంచి ప్రతిభ కనబరిచిన భజన మండలికి బహుమతులు నగదు రూపంలో అందజేశారు కమిటీ సభ్యులు.భక్తులలోని ఆధ్యాత్మిక భావాన్ని, గాన ప్రతిభను వెలికితీసేందుకు ఒక అద్భుతమైన అవకాశం ఇలాంటి పోటీలను ఏర్పాటు చేయడం అని అన్నారు.ఈ కార్యక్రమంలో చౌడాపూర్  మరికల్  కన్మన్ కాల్వ  కిష్టంపల్లి తంగేడిపల్లి  మందిపల్  తీగలపల్లి  దాయపంతులపల్లి కొత్తపల్లి గ్రామాల నుండి భజన భక్తులు పాల్గొన్నారు.

*(1)*: ప్రథమ బహుమతి రూ:2016 శ్రీ వీరాంజనేయ భజన మండలి చౌడపూర్.

*(2)*: ద్వితీయ బహుమతి రూ :1016 శ్రీరామ భజన మండలి మరికల్.

*(3)*: తృతీయ బహుమతి శ్రీ శివమారుతి భజన మండలి మరికల్.

*(4)*: హార్మొనీ వాయిద్యంలో మధు తంగేడిపల్లి.

*(6)*: తబలా లో మహేష్ చౌడపూర్.

*(7)*: బెస్ట్ గాత్రం లో కార్తీక్ తీగలపల్లి.

ఈ సందర్బంగా దుర్గా మాత కమిటీ సభ్యులు పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బృందాలకు/వ్యక్తులకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు మరియు జ్ఞాపికలు అందజేశారు.ఈ కార్యక్రమానికి న్యాయ నిర్నేతలుగా వడ్ల రాఘవేంద్రచారి, పాండురంగ చారి, రమేష్, వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇందిరా సత్యకుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్మోహన్ శర్మ ,పిట్ల నర్సింలు అంతయ్య వెంకటయ్య గోపాల్ శ్రీనివాస్ గౌడ్ రాములు మల్లేష్ నరేష్ యశ్వంత్ రమేష్ చారి నర్సింలు మరియు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు నాయకులు భక్తులు భవాని మాలా దారులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment