Tuesday, October 20, 2026

గ్యాస్ గోడౌన్ మేనేజర్ ఆత్మహత్య కేసులో ఆరుగురిపై కేసు నమోదు_

*గ్యాస్ గోడౌన్ మేనేజర్ ఆత్మహత్య కేసులో ఆరుగురిపై కేసు నమోదు*

మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు మహిళా ఉద్యోగితో పాటు నలుగురు విలేకరులపై కేసు నమోదు చేసిన భద్రాచలం పోలీసులు

పాల్వంచ గ్యాస్ గోడౌన్‌లో మేనేజర్‌గా పనిచేస్తూ, మహిళా ఉద్యోగి అవినీతిని నిలదీసినందుకు ఆమె తనపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిందని ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడిన అనంతుల లక్ష్మీనారాయణ (57)

అయితే, తనపై చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటే రూ.కోటి ఇవ్వాలని మహిళా ఉద్యోగి రజిత, ఆమె భర్త నాయిని రాజేష్, *10టీవీ రిపోర్టర్ నాగ చందు, బిగ్ టీవీ రిపోర్టర్ వెంకన్న, టీవీ9 రిపోర్టర్ రవి, కలీం* తన తండ్రిని వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన లక్ష్మీనారాయణ కూతురు మధులిక.

మధులిక ఫిర్యాదుతో ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
*#TeluguScribe*

No comments:

Post a Comment