*US కాన్సుల్ జనరల్ హైదరాబాద్ Ms.లారా విలియమ్స్ తెలంగాణ డీజీపీ సివి. ఆనంద్ IPS ను కలిశారు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 14:
ఈ రోజు Ms.లారా విలియమ్స్, US కాన్సుల్ జనరల్ హైదరాబాద్ మరియు రీజినల్ సెక్యూరిటీ ఆఫీసర్ సిద్దార్థ్ రామచంద్రన్, సీనియర్ ఫారిన్ సర్వీస్ నేషనల్ ఇన్వెస్టిగేటర్ (FSNI) వెంకట్ తో కలిసి తెలంగాణ డీజీపీ సివి. ఆనంద్, IPS ను మర్యాదపూర్వకంగా కలిశారు.డీజీపీ సివి.ఆనంద్ కు క్రీడల పై, ముఖ్యంగా క్రికెట్ పై ఉన్న ఆసక్తి గురించి తెలుసుకున్న లారా విలియమ్స్ గారు US కాన్సుల్ జనరల్ కార్యాలయం పేరు ముద్రించిన క్రికెట్ బంతిని డీజీపీ కు బహూకరించారు.ఇది నేను ఎప్పటికీ దాచుకుంటాను అని డీజేపీ అన్నారు.తెలంగాణలోని అమెరికా పౌరులు మరియు సంస్థల భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ విషయాల్లో సైబరాబాద్ పోలీస్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా సమన్వయంతో పనిచేస్తూ ప్రోయాక్టివ్ గా ఉంటుందని డీజీపీ వివరించారు.
No comments:
Post a Comment