*పత్రిక ప్రకటన*
*కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు కుట్ర: రేవంత్ రెడ్డిది మరుగుజ్జు మనస్తత్వమంటూ ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు తీవ్ర ధ్వజం!*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 30:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను తీవ్రతరం చేసిందని, అందులో భాగంగానే ఆయన పాస్‌పోర్ట్‌ను జప్తు చేయాలనే కుట్రకు తెరలేపిందని *ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు* తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగ బద్ధమైన సంస్థ యాంటీ కరెప్షన్ బ్యూరో ACB కోర్టు ద్వారా ఈ కుట్ర పన్నడం అత్యంత దుర్మార్గమైన అధికార దుర్వినియోగం, సీఎం రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వానికి, ఈర్ష్యాసూయలకు అద్దం పడుతోందని ఆయన మండిపడ్డారు.ఈ మేరకు ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
**ప్రజలచే ఎంపికైన నేతపై నీచ రాజకీయాలు**
కేటీఆర్ ఒక రాజ్యాంగబద్ధమైన శాసనసభ్యుడిగా, రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తుచేశారు. దేశంలోనే గుర్తింపు పొందిన ఒక ప్రధాన రాజకీయ పార్టీకి ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నతమైన స్థానంలో కొనసాగుతున్నారని తెలిపారు. ఇటువంటి ఔన్నత్యన్ని , రాజ్యాంగ నిబద్ధత కలిగిన ఒక ప్రజానేత పాస్‌పోర్ట్‌ను జప్తు చేయాలని కోర్టుల ద్వారా ఆర్డర్లు తెప్పించడం వెనుక రేవంత్ రెడ్డి ఈర్ష్య, అసూయ, ద్వేషపూరిత మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తోందని శ్రవణ్ దాసోజు విమర్శించారు.
**ఏసీబీని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం**
రాష్ట్రంలో యాంటీ కరెప్షన్ బ్యూరో పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో, ఆయన చేతిలో తోలుబొమ్మలా పనిచేస్తోందని ఆరోపించారు. కోర్టులను తప్పుదోవ పట్టించడానికి, ప్రతిపక్షాన్ని అణచివేయడానికి, రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీని నీచంగా వాడుకుంటోందనేదానికి గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయని, ఇప్పుడు కేటీఆర్ విషయంలోనూ అదే జరుగుతుందని దుయ్యబట్టారు.
**అంతర్జాతీయ వేదికలపై కేటీఆర్ గళాన్ని ఆపలేరు**
కేటీఆర్ విదేశాలకు వెళ్లకుండా, విదేశీ విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు చేయకుండా అడ్డుకోవాలని, కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సాధించిన విజయాలను ప్రపంచానికి చాటిచెప్పకుండా కుట్ర పన్నుతున్నారని శ్రవణ్ దాసోజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లుండింర్వస్తోనే వ్యవహారం. ఇది 'గ్లోబల్ విలేజ్' అని, హైదరాబాద్‌లో కూర్చొని జూమ్, టీమ్స్, గూగుల్ మరియు ఇతర కాన్ఫరెన్స్ టెక్నాలజీల ద్వారా ప్రపంచం మొత్తంతో మాట్లాడే సాంకేతికత అందుబాటులో ఉందని ఆయన హితవు పలికారు.కనీస విజ్ఞత, విద్యాసంస్కారాలు లేకుండా ఒక మూర్ఖుడిలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని విమర్శించారు.
**అరచేత్తో సూర్యకాంతిని ఆపలేరు**
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, తెలంగాణ ఉద్యమ చరిత్రను, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి తెలపడాన్ని ఆపడం ఎవరి తరం కాదని హెచ్చరించారు.
కేటీఆర్ ప్రాబల్యాన్ని చూసి ఓర్వలేక కులు రాజకీయాలు చేస్తున్న రేవంత్ మోసాలు ఎండగడుతాం.సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని ప్రపంచానికి తెలియజేయడాన్ని అడ్డుకోవడం రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ వల్ల కాదని స్పష్టం చేశారు. కనీస విజ్ఞత లేకుండా, అధికార దురహంకారంతో ఏసీబీ పోలీసులతో తోలుబొమ్మలాట ఆడిస్తూ ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేయడం, దానిపై ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం కేవలం ఒక జోక్‌లాంటిదని ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా ఈ నీచ రాజకీయాలను, కక్షసాధింపు చర్యలను మానుకోవాలని, లేదంటే ప్రజల నుంచి తీవ్ర తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.
No comments:
Post a Comment