*క్షణాల్లో స్పందించి ఒక చిన్నారికి పునర్జన్మనిచ్చిన ఈ నిజమైన హీరోల సాహసానికి నా సెల్యూట్ - హైదరాబాద్ సిపి వి. సజ్జనార్ ఐపీఎస్*
బాపట్ల కృష్ణమోహన్, అక్టోబర్ 16:
కన్నతల్లే నిస్సహాయతతో హుస్సేన్సాగర్లోకి నెట్టేసి మృత్యుఒడికి చేర్చాలని చూసిన వేళ.. ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి ఆరేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, ప్రైవేట్ ఉద్యోగి బాలకృష్ణ, వ్యాపారి మహ్మద్ అఫ్సర్లను మనస్ఫూర్తిగా అభినందించి, సత్కరించిన హైదరాబాద్ సిపి వి. సజ్జనార్ ఐపీఎస్.ఆపదలో ఉన్న తోటి మనుషులను చూసి మొబైల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయే నేటి రోజుల్లో.. ఈ ముగ్గురు పౌరులు ప్రదర్శించిన తెగువ, సమయస్ఫూర్తి నిజమైన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం, సమాజానికే ఆదర్శం అని అన్నారు.క్షణాల్లో స్పందించి ఒక చిన్నారికి పునర్జన్మనిచ్చిన ఈ నిజమైన హీరోల సాహసానికి నా సెల్యూట్!.పిల్లల అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తల్లిదండ్రులకు ఎంతటి మానసిక క్షోభను కలిగించినా.. కన్నబిడ్డల ప్రాణాలు తీయడం ఎప్పటికీ పరిష్కారం కాదు. ఎంతటి కష్టమొచ్చినా అధైర్యంతో కర్కశ నిర్ణయాలు తీసుకోకండి. నైరాశ్యంలో చేతులెత్తేయకుండా సమాజ సాయం కోరండి; ఆదుకోవడానికి సమాజం ఎప్పుడూ ముందుంటుంది.లోకంలో ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు!
No comments:
Post a Comment