Tuesday, October 27, 2026

పిల్లలకు పౌష్టికాహరం అందించడం దానం కాదు, అది వారి హక్కు_

*పిల్లలకు పోషకాపరం అందుతోందా? పోషకాహార లోపం ఎందుకు కొనసాగుతుంది?*

*అనురాధ రావు - బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 26:

2006 సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆకలి, పోషకాహర లోపం పరిస్థితులను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంచనా వేస్తుంది అని అనురాధ రావు - బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్ తెలిపారు.ఈ సూచితో అంచన వేయడానికి నాలుగు అంశాలను పరిశీలిస్తారు.

*(1)*: పిల్లల్లో పోషకాహరం తగినంతగా అందని వారి శాతం.

*(2)*:  ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం.

*(3)*: ఐదు సంవత్సరాల లోపు పిలల్లో ఎత్తుకు తగిన బరువు లేక పోవడం.
*(4)*: ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు.

*తాజా గణాంకాలు:**

*(1)*: 9.8శాతం జనాభ పోషకాహర లోపంతో బాధపడుతున్నారు.

*(2)*: 29.3శాతం ఐదేళ్ళ లోపు పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తు లేరు.

*(3)*: 19% ఐదేళ్ళ లోపు పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు లేరు.

*(4)*: 2.7% ఐదేళ్ళ లోపు పిల్లలు మరణిస్తున్నారు.

2026 సం॥నికి గ్లోబర్ హంగర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం 122 దేశాల్లో భారతదేశం 100వ స్థానంలో ఉంది, 24.1 స్కోరుతో తీవ్రత వర్గంలో మన దేశం ఉంది అంటే తీవ్ర పోషకాహర లోపం ఉన్న పిల్లల వరుసలో.
ఒక వైపు అభివృద్ధి చెందింది, దూసుకెళ్తున్నాం అభివృద్ధిలో అని చెబుతున్నాం, ఎన్నో రంగాల్లో అభివృద్ది సాధించాం .
79 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఇంకా పిల్లలకు పౌష్టికాహరం అందించలేని దేశంగా గుర్తింపు మెచ్చుకున్నాం.కాని మన దేశ భవిష్యత్తు అయిన పిల్లల విషయంలో మనం వెనుక బడి ఉన్నాం అని తెలుస్తుంది.దీనికోసం ప్రభుత్వ పథకాలు లేవా అంటే ఉన్నాయి , పోషణ్ అభియాన్, Poshan 2.0 వంటి పథకాలు ఉన్నాయి. నిధులు విడుదల చేస్తున్నారు.అంగన్ వాడి సెంటర్స్ ద్వారా ఈ పథకాలు అమలు చేస్తున్నారు. కాని పిల్లలకు అవి అందుతున్నాయా?
ఈ అంగన్ వాడి సెంటర్స్ పిల్లలను గుర్తిస్తున్నారా? ఎవరికి ఆహారం అందడం లేదు, పోషకాహర లోపంతో ఉన్న పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, వారికి కావల్సిన వైద్యం, ఆహరం అందిస్తున్నారా? ఈ గణాంకాలు చూశాక పుర్తిగా పర్వవేక్షణ లోపం అని బాలల హక్కుల సంఘం భావిస్తున్నది.పిల్లల్లో పోషకాహర లోపానికి కారణం పేదరికం, ఆహర భద్రత లేక పోవడం, పారిశుధ్య సమస్యలు, వైద్యం అందక పోవడం లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. అన్ని శాఖలు సమన్యయంగా పనిచేస్తే ఖచ్చితంగా సమస్యను అధిగమించవచ్చు. 

**పిల్లలకు పౌష్టికాహరం అందించడం దానం కాదు, అది వారి హక్కు**

దేశభి వృద్ది అంటే కేవలం పెద్ద భవనాలు, రహదారులు, వందే భారత్ రైళ్ళు, మంత్రులు విదేశాల పర్యటనలు కాదు.
ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఆకలితో విద్యకు దూరం కాకుడదు. 
పోషకాహ లోపంతో భవిష్యత్తును కోల్పోకూడదు.
పిల్లల హక్కులు కేవలం కాగితాలకు పరిమితం కాదు, వారి జీవితాల్లో అమలు ఉన్నప్పుడే వారి ఎదుగుదల కనిపిస్తూంది. దేశ సంపద అయిన పిల్లలకు పోషకాహరం అందించ లేకపోతే అభివృద్ధికి అర్ధం లేదు.పిల్లల హక్కుల కోసం మనం మన గొంతు విసిపిద్దాం. 
మీ ప్రాంతాల్లో అంగన్ వాడి సెంటర్స్ నాణ్యమైన పోషకాహరాన్ని పిల్లలకు అందిస్తున్నారా? కామెంట్ రూపంలో తెలపండి .
అన్ని పథకాలు ఉన్నాయి కాని ఫలితాలు ఎక్కడ?

No comments:

Post a Comment