Tuesday, September 12, 2023

అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు....!

*అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు....!*

హైదరాబాద్‌: సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఒక్కరోజు ముందే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌కు రానున్నారు.ఈనెల 16న రాత్రి 7.55 గంటలకు ఔరంగాబాద్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఆర్పీఎఫ్‌ సెక్టార్స్‌ ఆఫీసర్స్‌ మెస్‌కు చేరుకుని ఆరోజు రాత్రి అక్కడే బస చేస్తారు. 17న ఉదయం సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదాన్‌కు చేరుకుని తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. అనంతరం తెలంగాణ ప్రజల నుద్దేశించి అమిత్‌ షా ప్రసంగించనున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment