Saturday, September 2, 2023

ఫీజుల వివరాలు వెబ్ సైట్ లో ఉంచాలి

*ఫీజుల వివరాలు వెబ్ సైట్ లో ఉంచాలి...... విద్యాశాఖ ఆదేశం!*

హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని ప్రైవేట్‌ పాఠశాలలు తాము వసూలు చేసే ఫీజులు ఎంతో విద్యాశాఖ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయడమే కాకుండా పాఠశాలల వెబ్‌సైట్లోనూ ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోని జారీ చేసిన జీఓ 1, జీఓ 95ల ప్రకారం ఉపాధ్యాయులకు వేతనాలు నిర్ణయించాలని, ఫీజులు ఖరారు చేయాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఉత్తర్వులపై హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎస్‌పీఏ) ప్రధాన కార్యదర్శి వెంకట సాయినాథ్‌ మండిపడ్డారు. హైకోర్టులో తాము కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసినందున దాన్నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం తూతూమంత్రంగా ఈ ఆదేశాలిచ్చిందని విమర్శించారు. ఫీజులను ఎలా నియంత్రించాలో చెప్పకుండా పాత జీఓల్లో ఉన్న వాటిని ప్రస్తావిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment