*నేడు తుమ్మల.... కాంగ్రెస్ పార్టీ తీర్థం*
*మాజీఎమ్మెల్యే యన్నం, జిట్టా సైతంపార్టీలో చేరిన* *భారాస మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు*
హైదరాబాద్: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది.శనివారం సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మలతోపాటు భాజపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు సైతం కాంగ్రెస్‌లో చేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు తుమ్మల నివాసానికి వెళ్లి చర్చించారు. కాంగ్రెస్‌లో చేరాలని తుమ్మలను ఆహ్వానించగా సుముఖత తెలిపారు. ఆయనకు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
తుమ్మల గతంలో ప్రాతినిధ్యం వహించిన పాలేరు టికెట్ కోసం పొంగులేటి ఇప్పటికే దరఖాస్తు చేశారు. ఈ రెండు స్థానాల విషయంలో వీరిద్దరి మధ్య సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కోమటిరెడ్డిని కలసి చర్చించారు.భారాసకు చెందిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్ భాగ్యలక్ష్మిలు శుక్రవారం తాజ్‌కృష్ణా హోటల్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారితోపాటు మంచిర్యాలకు చెందిన కౌన్సిలర్లు శివకిరణ్, నల్లాల శ్రావణ్, నల్లాల సందీప్, దుర్గం నరేష్, ముజాహిద్, మెరుగు ప్రభాకర్, మహేందర్‌లు సైతం పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మల్కాజిగిరి భారాస ఎమ్మెల్యే మైనంపల్లి తదితరులు విజయభేరి సభ అనంతరం కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయని నేతలు చెబుతున్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment