*మానసిక వికలాంగుడి హత్య ను ఖండించిన...
ఎన్పి ఆర్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగ రెడ్డి*
*చేయూతనందించాల్సిన వారే ఇలాంటి దుర్ఘటనకు పాల్పడడం దారుణం.*
నేటి సమాజంలో మానసిక వికలాంగులకు సామాజిక న్యాయం, సామాజిక భద్రత కరువైందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి ఆరోపించారు.
కొత్తూరు పరిధిలోని పెంజర్ల గ్రామంలో మానసిక మూగవాడైన నరసింహ ను భార్య మద్యం మత్తులో రోకలి బండతో మోదీ హత్యకు పాల్పడిన సంఘటనకు స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమాజంలో మానసిక వికలాంగులు అవమానాలను ఎదుర్కొంటూ దుర్భర దీన స్థితిలో జీవితాలను గడుపుతున్నారు. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు చేయూతనందించి వెన్నుదన్నుగా నిలువాల్సిన వారు ఇలాంటి హత్యలకు పాల్పడడం దారుణమని భుజంగ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమాల పోరాటాల ఫలితాలతో 2016 ఆక్ట్ 92 ఏ బి చట్టలను సాధించుకున్నాం. కానీ అమలు పరచడంలో ప్రభుత్వాలు నిరుగార్చుతున్నయని మండిపడ్డారు. మానసిక దివ్యాంగులపై అఘాయిత్యాలు, దాడులకు పాల్పడిన సకాలంలో సమగ్రంగా విచారణతో చట్టాలను అమలైనప్పుడు ఆత్మగౌరవంతో జీవనం కొనసాగిస్తారు. అలాంటివి కొనసాగించకపోవడంతోనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని రంగారెడ్డి జిల్లా కమిటి ఆరోపించారు. చట్ట సభలలో వికలాంగుల కమిషన్ ఏర్పాటు చేస్తేనే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఇప్పటికైన ప్రభుత్వం దృష్టి సారించి పునర్వతం కాకుండా అత్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్కొని రాజు, కోశాధికారి దేవరం పల్లి రాజశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
CRM....!
(ప్రజల పక్షం)
No comments:
Post a Comment