👉తస్మాత్ జాగ్రత్త
దంపతులు కాని ఒంటరి మహిళలు కానీ వృత్తి పరంగా లేదా విహార యాత్రకో దూర ప్రాంతాలకు వెళ్లి హోటల్ గదుల్లో బసచేయాల్సి రావటం తప్పనిసరవుతుంది......
ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెందడం వల్ల సౌకర్యాలతో పాటు ఇబ్బందులు కూడా పెరుగు తున్నాయని గుర్తించాలి.......
బసచేసే గదుల్లో, చీకటిలో సైతం చిత్రీకరించగల అత్యాధునిక రహస్య కెమేరాలు బిగించి, అభ్యంతర సన్నివేశాలను నేరస్తులు చిత్రీకరించి అంతర్జాలంలో సొమ్ము చేసుకుంటున్నారు. గుర్తు పట్టలేనంత సూక్ష్మ కెమేరాలు మార్కెట్లో లభిస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నేరస్తుల వల్ల ఇబ్బంది పడకుండా ఉండవచ్చు........
మీరు బసచేసే ప్రాంతం గురించి, హోటల్ గురించి ముందుగానే సమాచారం సేకరించి నమ్మకం కుదిరాకే హోటల్ గది బుక్ చేసుకోవాలి.........
ఎంత మంచి పేరున్న హోటలయినా గుడ్డిగా నమ్మి అజాగ్రత్తగా ఉండకండి. హోటల్ యాజమాన్యం మంచిదయినా, పనిచేసే సిబ్బంది నేరపూరిత మనస్తత్వం ఉన్న వాళ్ళు కావచ్చు. ఇంతకు ముందు బసచేసిన కస్టమర్లు కూడా, హోటల్ సిబ్బందికి తెలియకుండా రహస్యంగా కేమేరాలు ఏర్పాటు చేసుకుని, రిమోట్ లొకేషన్ నుంచి చిత్రాలను రికార్డు చేసుకొనేందుకు అవకాశం ఉంది.........
హోటల్ గదుల్లోనే కాకుండా, ట్రయల్ రూమ్స్, మహిళా షేరింగ్ గదుల్లో, రాబందుల వంటి బందువుల ఇళ్ళల్లో కూడా రహస్య కెమేరాలు అమర్చి అభ్యంతర సన్నివేశాలు చిత్రీకరించే అవకాశం లేకపోలేదు.........
ఇటు వంటి నేరాలకు పురుషులే కాకుండా, సాటి స్త్రీలు కూడ పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. దగ్గరి బంధువులు, స్నేహితులు కూడా అభ్యంతర సన్నివేశాలను రహస్యంగా చిత్రీకరించి, బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది.........
గదిలో ప్రవేశించిన వెంటనే, గదిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఫ్లవర్ వాజులను, అలంకారం కోసం ఉంచిన బొమ్మలను, లైట్లను, గోడ గడియారాలను, అవకాశం ఉన్న ఇతర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయ మేమంటే, రహస్య కెమేరాలు అతి సూక్ష్మంగా ఉండి, అలంకారం కోసం ఉంచిన వస్తువుల రంగులతో కలిసిపోయి, గుర్తించలేనంతగా అమరుతాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప కనిపించవు.........
గదిని పూర్తిగా చీకటి చేసి, అంటే లైట్లు, టి.వి లు, ఇతర వెలుగునిచ్చే డివైజులన్నింటిని ఆపి, మీ మొబైల్ ఫోన్ కేమరాతో గది మొత్తం క్షుణ్ణంగా పరిశీలించండి. రహస్య కెమరాల నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ కిరణాలు మిణుకు మిణుకు మంటూ కనిపిస్తాయి...........
మీ పరిశీలనలో ఏమైనా రహస్య కెమేరాలు దొరికి నట్లయితే, ముందుగా మీ మొబైల్ కెమెరాతో ఫొటోలు తీయండి. సాక్ష్యం కోసం పనికి వస్తాయి. హోటల్ యాజమాన్యంకి కాకుండా, డైరెక్టుగా లోకల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి మరో హోటలుకి మారండి. వీలైతే స్థానిక మీడియా దృష్టికి తీసుకు రండి................
Courtesy / Source by : శ్రీమతి రాధిక గారు IPS, SP - శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
No comments:
Post a Comment