Wednesday, September 27, 2023

తెలంగాణలో కొత్త రెవిన్యూ డివిజన్లు... నేటి నుంచి అమల్లోకి

*తెలంగాణలో కొత్త రెవిన్యూ డివిజన్లు... నేటి నుంచి అమల్లోకి*

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటైంది. నల్గొండ జిల్లా చండూరు డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది నోఫికేషన్ జారీ చేసింది.కొత్త రెవెన్యూ డివిజన్లు బుధవారం నుంచే అమల్లోకి వస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నల్గొండ జిల్లాలోని చండూరు, మునుగోడు, గట్టుప్పల్‌, నాంపల్లి, మర్రిగూడ మండలాలతో చండూరు డివిజన్‌ ఏర్పాటైంది. కామారెడ్డి జిల్లాలో మహమ్మద్‌ నగర్‌ కొత్త మండలం కూడా ఏర్పాటైంది. గతంలో నిజాంసాగర్‌ మండలంలో ఉన్న 18 గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. మహమ్మద్‌ నగర్‌ మండలం కూడా ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. నల్గొండ జిల్లాలో అమ్మనబోలు పేరిట మరో మండలం ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. నల్గొండ జిల్లాలోని అమ్మనబోలు, ఉప్పలంచ, యాదాద్రి భువనగరి జిల్లాలోని సూరారం, బీతుర్కపల్లి, కుంకుడుపాముల గ్రామాలతో కొత్త మండలాన్ని ప్రతిపాదించారు. అభ్యంతరాలు, వినతులకు పక్షం రోజుల గడువు ఇచ్చారు. జగిత్యాల జిల్లాలోని తిర్మలాపురం, ఇబ్రహీంనగర్ గ్రామాల పేర్లను మల్లన్నపేట, శ్రీరాములపల్లిగా మార్పు చేశారు. రెండు గ్రామాల పేర్ల మార్పు కూడా ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment