Wednesday, September 13, 2023

అణిచివేత సహించలేకే ఉద్యోగం వదులుకున్నా... RS ప్రవీణ్ కుమార్ IPS

*అణిచివేత సహించలేకే  ఉద్యోగం వదులుకున్నా... RS ప్రవీణ్ కుమార్ IPS*

బాగ్‌లింగంపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అణచివేత ధోరణి సహించలేకనే తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.లేకుంటే తనకు డీజీపీ పదవి వచ్చి ఉండేదన్నారు. బహుజనులు రాజకీయ బానిసలు కావొద్దని.. రాజ్యాధికారం సాధించుకుందామని పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ సుందరయ్య కళానిలయంలో రాష్ట్ర వడ్డెర మహాసభ జరిగింది.

ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఉద్యమకారులపై కేసులు ఉన్నాయని, బడుగులకు రాజకీయ అవకాశాలు కల్పించకుండా అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేతివృత్తిదారులు, నిమ్నజాతులు, అట్టడుగు వర్గాల నుంచి ఎంతమంది ప్రగతిభవన్‌, అసెంబ్లీ మెట్లు ఎక్కారని ప్రశ్నించారు. బహుజనుల రాజ్యాధికారం కోసం నిబద్ధతతో పని చేసేవారికి బీఎస్పీ అండగా ఉంటుందని, వారిని అసెంబ్లీకి పంపే బాధ్యత తీసుకుంటానన్నారు.రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు 

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment