Wednesday, September 27, 2023

వైకల్య ధ్రువీకరణ పత్రం జారీలో అవకతవకలు.. NPRD

పత్రిక ప్రకటన   27.09.2023

*కరీంనగర్ జిల్లాలో సదరం క్యాంపులో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి*

*బోగస్ సర్టిఫికెట్స్ జారీ చేస్తున్న డాక్టర్లపై కేసు నమోదు చేయాలి*

            *NPRD డిమాండ్* 

 కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాపితంగా సదరం 
క్యాంపులో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, స్లాట్ బుక్ చేయడం కోసం డబ్బులు వసూలు చేస్తున్న మీసేవ కేంద్రాలను సీజ్ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది 
       
వైకల్య ధ్రువీకరణ పత్రం పొందాలంటే మీసేవ కేంద్రాలలో స్లాట్ బుక్ చేసిన తర్వాతనే సదరన్ క్యాంపుకు హాజరు కావాల్సి ఉంటుంది దీన్ని ఆసరా చేసుకొని మీసేవ సెంటర్స్ 500 నుండి 5000 రూపాయల వరకు వసూలు చేస్తూ వికలాంగులను మోసం చేస్తున్నారు. మీసేవ సెంటర్ల ద్వారా స్లాట్ బుక్ చేయాలంటే కనీస చార్జ్ మాత్రమే వసూలు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా మీసేవ సెంటర్స్ వ్యవహరిస్తున్న అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు. వైకల్య ధృవీకరణ పత్రాలు ఇప్పిస్తామని కొంతమంది బ్రోకర్లు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి డాక్టర్లతో కుమ్మక్కై అనరులకు సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నారు సదరం క్యాంప్ నిర్వహణ దగ్గర దళారుల పెత్తనం చేస్తున్న క్యాంపు పర్యవేక్షించవలసిన డిఎంహెచ్ఓ ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఒక్కొక్క సర్టిఫికెట్ ఇప్పించేందుకు ఐదువేల నుండి 20వేల వరకు డబ్బులు వసూలు చేస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు సర్టిఫికెట్ కాలపరిమితిని  బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నరు ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, మహబూబ్నగర్తో పాటు సిద్దిపేట నిజామా బాద్, వికారాబాద్, అదిలాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో వికలాంగుల శ్వయంగా సదరo క్యాంపుకు హాజరు అయితే అర్హత ఉన్నప్పటికీ పర్సంటేజ్ తక్కువ వైకల్య శాతం వేసి తిరస్కరిస్తున్నారు. బ్రోకర్ల ద్వారా వెళ్లిన వారికి మాత్రమే వైకల్యం లేకున్నా డబ్బులు తీసుకొని ఎక్కువ వైకల్యం 
శాతం వేసి సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నప్పటికీ నకిలీ వైకాల్య ధ్రువీకరణ పత్రాలతో ప్రమోషన్స్ పొందుతున్నారు. మూగ చెవిటి, మానసిక వికలాంగులకు జిల్లాల్లో సర్టిఫికెట్ జారీ చేయాలంటే కోటి ENT హాస్పిటల్, బోయిన్పల్లి లోని ఎన్ఐఎంహెచ్ కేంద్రాల్లో సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది.దీనికోసం జిల్లాల నుండి వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది తక్షణమే SERP సీఈవో, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రవ్యాప్తంగా సదరం క్యాంపులలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలనీ , నకిలీ వైకల్య
ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపై కేసులు నమోదు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.

కె వెంకట్
 రాష్ట్ర అధ్యక్షులు

యం అడివయ్య
 రాష్ట్ర కార్యదర్శి

అర్ వెంకటేష్
 రాష్ట్ర కోశాధికారి

Courtesy / Source by : NPRD 

No comments:

Post a Comment