*పరిగి హరిశ్వర్ రెడ్డి.... కన్నుమూత....!*
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పరిగి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి(76) కన్నుమూశారు. శ్వాస సరిగ్గా ఆడక కార్డియాక్ అరెస్ట్ అయి హరీశ్వర్ రెడ్డి మృతి చెందారు.వివరాల ప్రకారం.. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పరిగిలో నివాసముంటున్న ఆయనకు శుక్రవారం రాత్రి 10.10 గంటల సమయంలో గుండెపోటు వచ్చిందని, వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. హరీశ్వర్ రెడ్డి.. సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు.
ఇక, హరీశ్వర్‌రెడ్డి 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికలలో పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన హరీశ్వర్‌రెడ్డి పరిగి ఉపసర్పంచ్‌గా, 1978లో సర్పంచ్‌గా, సమితి వైస్ చైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారుహరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పరిగిలో నిర్వహించనున్నారు. హరీశ్వర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేశ్‌రెడ్డి ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment