Wednesday, September 13, 2023

నియంత #KCR కౌలు రైతుల పెట్టుబడికి "రైతు బంధు" సాయం ఇవ్వడం లేదు

రైతు స్వరాజ్య వేదిక (RSV) అధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణలో కౌలు రైతుల సమస్యలపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నాను. రాష్ట్రంలో లక్షలాది మంది కౌలు రైతులు భూ యజమానుల నుంచి వేల ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. కానీ ఈ నియంత #KCR కౌలు రైతుల పెట్టుబడికి "రైతు బంధు" సాయం ఇవ్వడం లేదు. దీంతో వీరు ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని సాగు చేస్తున్నారు.

కౌలు రైతులు పండించిన పంటను ప్రభుత్వం కౌలు రైతు పేరుతో కొనడం లేదు. కౌలు రైతులు మరణిస్తే కనీసం "రైతు భీమా" కూడా వర్తించడం లేదు. రైతు బంధు పేరుతో  పడావుపడ్డ భూములకు,వందల ఎకరాల భూస్వాములకు వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కేసీఆర్ కు కౌలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు? కౌలు రైతులపై #KCR కు ఎందుకింత వివక్ష? 

ఆఘమేఘాల మీద కోట్లాదిమందిని గందరగోళపరిచి, ఒక్కరోజులోనే తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే (SKS) నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్రంలోని కౌలు రైతుల లెక్కలు ఎందుకు తీయడం లేదు? తెలంగాణలో తక్షణమే కౌలు రైతుల చట్టం-2011 ను అమలు చేసి,కౌలు రైతులకు గుర్తింపు కార్డులతో పాటు,బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని #BSP డిమాండ్ చేస్తుంది.
#KCRfailedTelangana 
#VR99
#KCRCheatingFarmers

Courtesy / Source by :
https://twitter.com/RSPraveenSwaero/status/1701634131288023085?t=w_ItDj50vV_jjV3laSnX2g&s=19

No comments:

Post a Comment