*తృతీయ ఫ్రంట్ కు అవకాశం వుంది.... కేసీఆర్ నాయకత్వం వహించాలి.... ఒవైసీ*
న్యూదిల్లి ...దేశంలో తృతీయ ఫ్రంట్‌కు బలమైన అవకాశాలున్నాయని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దానికి నాయకత్వం వహించాలని ఆయన ఆకాంక్షించారు.హైదరాబాద్‌లో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్‌పై ఆయన్ను ఓ ఆంగ్ల ఛానల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ''తృతీయ కూటమికి అవకాశం ఉందని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. మాయావతి, కేసీఆర్ కూటముల్లో లేరు. ప్రాంతీయంగా మంచి పట్టున్న చాలా పార్టీలు ఎన్‌డీఏ, ఇండియా కూటమిలో భాగస్వాములు కాదు. అందుకే.. కేసీఆర్ చొరవ తీసుకొంటారని ఆశిస్తున్నాను. తేడాను మీరే చూడండి'' అని ఒవైసీ పేర్కొన్నారు.
''దళితులు, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చెబుతోంది. మరి ముస్లింల మాటేంటీ..? మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడరెందుకు. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తా. మైనార్టీలకు కాంగ్రెస్ ఏమి చేసింది..?రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌లో ఏమి చేశారో చూపించమనండి'' అని ఒవైసీ కాంగ్రెస్‌ను నిలదీశారు. తెలంగాణలో ముస్లింలు అంత్యంత సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా ఉందని పేర్కొన్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment