*బెయిల్ కాదు... రిమాండ్....!*
*చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు*
*ఈ నెల 22 వరకూ బాబుకు రిమాండ్*
విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు.స్కిల్ డెవలప్ మెంట్ పేరిట చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్న కేసుకు సంబంధించి ఈరోజు(ఆదివారం) ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘంగా ఏడున్నర గంటలపాటు ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. సాయంత్రం గం.6.50ని.ల సమయంలో రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నెల 22వరకూ రిమాండ్ విధించింది కోర్టు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది.
చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్‌ను CID ఉదయమే కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, విచారించేందుకు చంద్రబాబును 15 రోజుల కస్టడీ ఇవ్వాలని సిఐడీ కోరింది.
ఈ కేసుకు సంబంధించి సీఐడీ 34 అభియోగాలను చంద్రబాబుపై నమోదు చేసింది. రిమాండ్ రిపోర్ట్‌లో అన్ని ఆంశాలను పకడ్భందీగా చేర్చిన సీఐడీ... రూ. 271 కోట్ల స్కిల్ స్కామ్ సూత్రధారి బాబేనంటూ సీఐడీ అన్ని ఆధారాలతో బలంగా వాదించింది. ఈ కుంభకోణంలో వివిధ పాత్రల్లో బాబు పాత్ర ఉందని సీఐడీ తరుపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఏఏజీ పొన్నవోలు వాదనతో ఏకీభవించిన కోర్టు.. చంద్రబాబుకు 14 రోజులు పాటు రిమాండ్ విధించింది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment