*ముంబై నగరంలో 69 కిలోల బంగారం 336 కిలోల ఆభరణాలతో.... విఘ్నేశ్వరుడు...*
ముంబై : దేశంలో ప్రముఖంగా జరిగే పండుగల్లో వినాయక చవితి ఒకటి. భక్తులు తమ శక్తికొద్దీ గణేషుడి ప్రతిమలు కొలుదీర్చి పూజలు చేస్తారు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో గణేష్ చతుర్థి అత్యంత వైభవంగా జరుగుంది.గణేషుడి భారీ విగ్రహాలతోపాటు కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన మంటపాలను ఇక్కడ చూడవచ్చు.
ముంబై నగరంలోని అత్యంత సంపన్నమైన గణపతి మండపాలలో ఒకటిగా పేరుగాంచిన గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) మండల్ తమ 69వ వార్షిక గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా 69 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాలతో గణేష్ విగ్రహాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు.కాగా ఈ సంవత్సరం ఉత్సవాలకు రూ. 360.45 కోట్ల బీమా కవరేజీని తీసుకున్నట్లు జీఎస్‌బీ సేవా మండల్ వైస్ ఛైర్మన్ రాఘవేంద్ర జి భట్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో వెల్లడించారు. గతేడాది రూ. 316.40 కోట్లకు బీమా తీసుకోగా ఈసారి మరింత మొత్తానికి కవరేజీ కవరేజీ తీసుకున్నారు. బీమా ప్యాకేజీలో బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులకు రూ. 31.97 కోట్ల కవరేజీ ఉంటుంది. మిగిలినది మంటపం, నిర్వాహకులు, భక్తుల భద్రతకు కవరేజీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment