*_మంత్రి మల్లారెడ్డి అన్నా... గిట్ల బుక్కయినవా...?_*
_● ఏందీ రోత పంచాయతీ.!_
_● ఇఃత చీఫ్ పనులు ఏల.?_
_● 'న్యాక్'కు అందిన ఫిర్యాదులతో కదలిక_
_● ఐటీ శాఖ నాలుగైదు నెలల ప్లానింగ్_
_● ఆ విద్యాసంస్థల్లో ఉద్యోగులుగా ఐటీ సిబ్బంది_
_● తనిఖీలకు కొద్ది రోజుల ముందే.వారు రాజీనామాలు_
_● గుట్టుమట్లన్నింటినీ రాబట్టి.. ఆపై పక్కా తనిఖీలు_
_● తేలని 'ల్యాప్ టాప్' రాద్దాంతం_
_● ఇదిగో ఆధారాలు.. కళ్ళప్శగించి చూడండి సార్..!_
Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009, 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*
*_తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారుల దృష్టి పడటానికి ముఖ్య కారణం ఆధారాలతో 'తెలంగాణ వాచ్' సంపాదించింది.తెలుగుదేశం పార్టీతో ప్రస్థానం మొదలయింది. అయితే... ఆయన తెరాస హయంలో భారీగా డబ్బు కూడబెట్టారనే విమర్శలు ఉన్నాయి. మల్లారెడ్డి స్వతహాగా కష్టజీవి. సమీప బంధువుల కారణంగా అదనపు అభియోగాలు మూటగట్టుకున్నారు. మల్లారెడ్డి వ్యాపారాలకు సంబంధించి.. మరీ ముఖ్యంగా విద్యా సంస్థల కారణంగా ఐటీశాఖ ఆయనపై దృష్టి పడినట్లు తెలుస్తోంది. నాలుగైదు నెలల ముందు నుంచే ఐటీ అధికారులు పక్కా ప్లాన్ చేసుకున్నారు. అందుకం అనుగుణంగా తమ నమ్మకస్తులైన ఉద్యోగులను మల్లారెడ్డి విద్యా సంస్థల్లో చేర్చింది. గుట్టుమట్లన్నింటినీ రాబట్టిన అనంతరం... తనిఖీలకు కొద్ది రోజుల ముందు వారంతా రాజీనామాలు చేశారు. వేదికలు ఎక్కి సొల్లు కబుర్లు చెప్పటం కాదు.. అప్పుడప్పుడు కొంచెం బుర్ర వాడాలి..ఐటీశాఖ లాగా..! ఇదీ మాటర్..!_*
*_అసలేం జరిగిందంటే...?_*
హైదరాబాదులోని కొంపల్లిలో ఉన్న మల్లారెడ్డి కాలేజ్ అఫ్ ఇంజినీరింగ్ పై నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ విషయాన్ని న్యాక్ తన అధికారిక వెబ్ సైట్ లో అప్పట్లో ప్రకటించింది. ఆదో పెద్ద రాద్దాంతం. వివరాల్లోకి వెళ్తే, మల్లారెడ్డి కాలేజ్ అఫ్ ఇంజినీరింగ్ కి 2018 విద్యా సంవత్సరంలో న్యాక్ బీ++ గ్రేడ్ ను కేటాయించింది. అయితే, ఈ గ్రేడ్ ను అధిగమించి మంచి గ్రేస్ సాధించాలనే ఉద్దేశంతో కాలేజీ మోసం చేసినట్టు అధికారులు గుర్తించారు. న్యాక్ బెంగళూరుకు నకిలీ డాక్యుమెంట్లను పంపారు. ఈ విషయాన్ని పసిగట్టిన న్యాక్ కౌన్సిల్ అధికారులు కాలేజ్ యాజమాన్యం మోసానికి పాల్పడిందని చర్యలు చేపట్టారు. అక్రిడేషన్ విషయంలో ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఇదే విషయాన్ని తన వెబ్ సైట్ లో న్యాక్ పొందుపరిచింది.
*_అదనపు ఫిర్యాదులు_*
అదే సమయంలో ఈ ఇంజనీరింగ్ కళాశాలపై ఫిర్యాదుతో పాటు మరికొన్ని వివరాలను, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు కూడా వెళ్ళాయి. అయితే ఆ ఫిర్యాదులను ఎవరికి పంపాలనే విషయంలో అంతర్గతంగా పలు సమావేశాలు జరిగినట్లు తెలిసింది. ఎట్టకేలకు ఆ ఫిర్యాదులను ఐటీశాఖకు 'లోపాయకారి'గా కొందరు పెద్దలు పంపినట్లు తెలుస్తోంది.
బాక్స్:
*_ఒడవని 'ల్యాప్ టాప్' లొల్లి_*
_● ఎటూ తేలని ల్యాప్టాప్ సంగతి_
_● ఇంతకూ ఐటీ అధికారుల ల్యాప్టాప్ ఎక్కడుంది?_
మంత్రి మల్లా రెడ్డి నివాసం వద్ద బుధవారం అర్ధరాత్రి నాటి హైడ్రామాలో కీల కంగా నిలిచిన ల్యాప్ టాప్ అంశం శుక్రవారం కూడా ఎటూ తేలలేదు. బోయినపల్లి పీఎస్ లో ఉన్న ల్యాప్ టాప్ అటు మంత్రి సంబంధీ కులు గానీ, ఇటు ఆదాయపన్ను అధికారులు గానీ తీసుకెళ్లలేదు. దీంతో శనివారం ల్యాప్ టాప్ ను సైబరాబాద్ పోలీసులకు అప్పగిస్తా మంటూ ఠాణా సీఐ రవికుమార్ తెలిపారు. మొదటి సారి తెచ్చిన ల్యాప్ టాప్ తమది కాదని ఐటీ అధికారులు చెప్పారు. రెండోసారి తెచ్చిన ల్యాప్టాప్ ను ఐటీ అధికారులు పరిశీలించినా... అది తమదేనని చెప్పలేదు. ఎత్తుకెళ్లిన వారు. రెండోసారి తెచ్చిన వారూ ఒకటి కాదని మాత్రం పేర్కొంటూ సీఆర్ పీఎఫ్ బలగాలతో కలిసి వెళ్లిపోయారు. మరోవైపు స్టేషన్ గేటు ముందే ఉండి సీఐ రవికుమార్ సీజ్ చేసి. భద్రపరిచారు. కాగా, శుక్ర వారం రాత్రి దాకా ఐటీ అధికారులు, మల్లారెడ్డి అనుచరులు ఎవరూ రాకపోవడంతో అసలు ఆ ల్యాప్టాప్ ఎవరిది..? అధికారుల నుంచి లాక్కెళ్లింది ఎవరు..? తిరిగి మరోటి తెచ్చింది ఎవరు..? సీఆర్పీఎఫ్ హెచ్చరికతో వెళ్లిపోయి.. ఇంకో
ల్యాప్ టాప్ తెచ్చినదెవరు? వీటన్ని టికీ మించి అసలు ల్యాప్ టాప్ లో ఏముంది? అనేది తేలాల్సి ఉంది.
*_సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తున్నా..:_*
ల్యాప్ టాప్ తెచ్చిన వ్యక్తుల ముఖాలు సీసీటీవీ ఫుటేజీల్లో స్పష్టంగా ఉన్నా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించలేదు. అసలు దీంతో ఈ విషయంలో మంత్రికి, ఐటీ అధికారులకు మధ్య 'ఏం జరుగుతోంది.?' అనేది మిస్టరీగా ఉంది. పోలీసులు విచారణ జరిపి సాంకేతిక నిపుణుల సాయంతో ముందుకెళ్తే ఆ ల్యాప్ టాప్ ఎవరిది? దాంట్లో ఏముంది? అనేది తెలిసే అవకాశం ఉంది.
No comments:
Post a Comment