Wednesday, November 30, 2022

దేవాలయ భూముల ఆక్రమణలపై ఉక్కు పాదం

*దేవాలయ భూముల ఆక్రమణలపై ఉక్కు పాదం*

*రామంతపూర్ లో దేవాదాయ శాఖ భూములు పరిశీలించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్*
రామంతపూర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న దేవాదాయ శాఖ భూములను స్థానిక కార్పొరేటర్ *శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్ రావు గారి* ఆధ్వర్యంలో బుధవారం దేవాదాయ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి తాసిల్దార్ సునీత అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ మల్లికార్జున స్వామి దేవాలయం కార్యనిర్వాహన అధికారి నరేందర్ శ్రీనివాస్ రావు తదితరులతో కలిసి పలు ప్రాంతాల్లో ఉన్న దేవదాయ శాఖ భూములను పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో దేవాదాయశాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మాట్లాడుతూ రామంతపూర్ లోని దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు తగు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు దేవాదాయ శాఖ భూములను సర్వే చేయించి పూర్తిస్థాయిలో హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు.దేవాదాయ శాఖ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. మల్లికార్జున స్వామి దేవాలయం పక్కనే ఉన్న గ్రామ కంఠం స్థలాన్ని పార్కింగ్ కోసం ఉపయోగిస్తామని ఆమె తెలిపారు. ఇందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా జిహెచ్ఎంసి, రెవెన్యూ అధికారులకు రాతపూర్వకంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. స్థల యజమానులతో ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రామంతపూర్ శ్రీరామ కాలనీలోని సర్వేనెంబర్ 91/1, 91/2 లోని 33 గుంటల స్థలంలో కళ్యాణ మండపం నిర్మిస్తామని ఇందులో ఆరు గుంటల స్థలంలో ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించామని ఆమె పేర్కొన్నారు అదేవిధంగా భగయాత్ లోని సర్వే నెంబరు 1 లోని ఒక ఎకరా 12 గుంటల స్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలని, గడ్డి భూములను వేలం వేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన పలు విషయాలను స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి అధికారుల దృష్టికి తీసుకొని వచ్చారు .

ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు బండారు వెంకట్రావు, సంకూరి కుమారస్వామి, వంగాల సంతోష్ గుప్తా, పరి శ్రీనివాస్, శైలేందర్ , మామిండ్ల సుధాకర్ యాదవ్ ,పలువురు కాలనీవాసులు స్థానిక నేతలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Courtesy by : బీజేపీ పార్టీ రామంతాపూర్ డివిజన్ అధ్యక్షులు 

No comments:

Post a Comment