Friday, November 4, 2022

విద్యాశాఖలో ‘స్మార్ట్ క్లాస్’ స్కాం

*_ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఎంత? బిడ్డింగ్ ఎంత.?_*
_◆ విద్యాశాఖలో ‘స్మార్ట్ క్లాస్’ స్కాం_
_◆ పైకి ఓసీబీ పేరుతో బిడ్డింగ్_
_◆ లోపల ఓఈబీతో ఆంధ్రావాళ్లకు కాంట్రాక్టులు_
_◆ రూ.1.25 లక్షల ఐఎఫ్పీకి రూ.3.50 లక్షలు_
_◆మూడు నెలల ముందు నుంచే సెల్‌ కాన్ దోస్తానా!_
_◆ మొబైల్ కంపెనీకి కొమ్ముకాస్తున్న మంత్రి ?_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*

*_ఇప్పటికే అప్పులతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ రాష్ట్రంలో డబ్బు ఆదా చేయాల్సింది కాగా... అదనంగా ఖర్చు చేస్తున్న వైనాలు ఎన్నో.. ఎన్నెన్నో. తాజా ఉదాహరణ..విద్యా శాఖలో ‘స్మార్ట్ క్లాస్’ విధానంలో కుంభకోణం ఇది. ఓవైపు విద్యాశాఖ కఠిన నిబంధనలు పెడుతూనే మరోవైపు తమకు అనుకూలమైన ఆంధ్రా కంపెనీలకు వందల కోట్లు ముట్టజెప్పేలా వాటిని మార్చింది. ఇప్పటికే హోర్డింగ్స్ ప్రచారాన్ని వదలకుండా రూ.3 కోట్ల విలువైన కార్లను వరంగల్ జిల్లా మంత్రి గిఫ్ట్ గా తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పైకి ఓసీబీ(ఓపెన్ కాంపిటెటివ్ బిడ్డింగ్) పేరుతో బిడ్డింగ్ పిలిచినా లోపల మాత్రం ఓఈఎం(ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మ్యానుఫ్యాక్చర్) పేరుతో తమకు అనుకూలంగా ఉన్నవారికి కట్టబెట్టేలా నిబంధనలు తయారు చేశారు. ఐఎఫ్‌పీ(ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్) అంటే క్లాస్ రూంలో స్మార్ట్ టీవీలాగా పనిచేస్తుంది. ఈ ప్యానెల్‌ ను మల్టీ పర్పస్‌ లా వాడుకోవచ్చు._*

*_అసలేం జరిగిందంటే..?:_*
ఇవి 8, 9, 10 తరగతి గదుల్లో 4,660 స్కూల్స్‌ కు అందించాలంటే సుమారు 14 వేల ఐఎఫ్‌పీ కావాలి. వీటి ధర మార్కెట్లో ఏడాది క్రితం రూ.3.5 లక్షలు ఉండేది. కానీ, ఇప్పుడు అవి లక్ష నుంచి లక్షా యాబై వేలకు అందుబాటులో ఉన్నాయి. మ్యాక్స్ హబ్, వీవీటెక్ కంపెనీలు 14 వేల ఐఎఫ్‌పీలకు ఇంకా తక్కువ ధరలోనే సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయి. అన్ని విమానాశ్రాయల్లో కనిపించే తైవాన్ కంపెనీ డెల్టా ఐఎఫ్‌పీ లక్ష రూపాయలకు ఇతర చోట్ల సరఫరా చేసింది. కానీ, తెలంగాణ విద్యా శాఖ మాత్రం 'స్పెషలైజేషన్' అంటూ ఒక్కొక్క ప్యానెల్ బోర్డుకు అదనంగా రూ.2 లక్షలకు పైగా దోచిపెడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

*_ఇది సాధ్యమేనా..?:_*
నిబంధనల ప్రకారం.. టెండర్‌ లో పేర్కొన్న వస్తువులు ఇక్కడే తయారు కావాలి. రెండు మూడు కంపెనీలు 'టై అప్' అయి ఇలాంటి టెండర్లలో పాల్గొంటాయి. ఇలా ఆయా కంపెనీలు ఒప్పందాల కోసం కలిసిపోయి టెండర్లలో పాల్గొంటాయి. 

*_గతంలోనూ ఇదే తంతు:_*
గతంలోనూ 'మన ఊరు-మన బడి' మూడు టెండర్లలో అలానే చేశారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ లోనూ ఇదే జరిగింది. వారు అనుకున్న వారికే ఇచ్చినా.. మరి ఇంత స్మార్ట్ గా చేసుకోలేదు. విద్యా శాఖ ఇచ్చిన టెండర్ల నోటిఫికేషన్ ప్రకారం ఓఈఎం అర్హత సామ్ సాంగ్, ఎల్జీ కంపెనీలకే ఉంది. అయితే, వీరి వద్ద నుంచి 3 నెలల ముందే సెల్‌ కాన్ అనే మొబైల్ కంపెనీకి చెందిన వారు తమకు తప్ప.. ఎవరికి ఐఎఫ్‌పీ‌లు అమ్మరాదని అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో పది రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేశారు.

*_ఏస్కో నా రాజా..!:_*
సెల్‌ కాన్ కు అన్ని ప్రాంతాల్లోనూ వారి మొబైల్ ఫోన్ షాపులైన సెలక్ట్ షోరూంలు ఉన్నాయి. ఇంకేముంది అన్ని అనుకున్నట్లే చకచకా జరిగిపోతున్నాయి. టెండర్ వచ్చాక 15 రోజుల్లో సరఫరా పూర్తి చేయాలి. 60 రోజుల్లో అన్ని స్కూల్స్ లో 'ఫిట్టింగ్ చేయాలి' అని పేర్కొన్నారు. వడ్డించే వాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా కంచం నిండుతుందని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ. ఇలా మూడు నెలల క్రితమే టెండర్లను కావాల్సిన వారికి ఇచ్చేసి.. పనులు ప్రారంభించుకుని పేరుకు మాత్రం 'ఓపెన్ కాంపిటేషన్ బిడ్డింగ్' అంటూ డ్రామాలతో 'స్మార్ట్'గా కుంభకోణానికి పాల్పడుతున్నారని అంటున్నారు.

*_కుమ్ముడే కుమ్ముడు..:_*
కాంట్రాక్టర్‌ కు చేసిన మేలుకు బదులుగా మూడో కంటికి తెలియకుండా డబ్బులు అధికార పార్టీ నేతలకు చేరాలి. అది ఆంధ్రా కాంట్రక్టర్స్‌ కే చెల్లుతుంది. ఆ లాబీయింగ్ వారికే సాధ్యమవుతుంది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వారినే నమ్ముకుంది. అందుకే టెండర్లు వారికే దక్కేలా పక్కా ప్లాన్ తో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. స్మార్ట్ గా విద్యాశాఖలో ఈ స్కాంని సెల్‌ కాన్ మొబైల్ వారికి అప్పగించి, వందల కోట్ల రూపాయలు వారికే మేలు జరిగేలా చేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామాకల్లోనూ జరిగే టెండర్ల పక్రియలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా వున్న వారిదే హవా? ఓపెన్ బిడ్డింగ్ వ్యవహారాల రహస్యాల చిట్టాలు తొలివెలుగు మీ ముందు ఉంచుతూనే ఉంది.

No comments:

Post a Comment