*_లిక్కర్ స్కాంలో...'లోగో' లొల్లి_*
_◆ ఈ కేసులో ‘పెద్దలు’ ఉన్నారు_
_◆ ఇది హై ప్రొఫైల్ కేసు_
_◆ అభిషేక్ సాక్ష్యాధారాలను తారుమారు చేయగలడు_
_◆ దర్యాప్తునూ ప్రభావితం చేస్తాడు_
_◆ అతనికి బెయిలు ఇవ్వొద్దు_
_◆ ఢిల్లీ కోర్టులో సీబీఐ వాదనలు_
_◆ తదుపరి విచారణ 9కి వాయిదా_
_◆ తెరపైకి 'టివి9' లోగో_
_◆ పట్టు వదలని రవిప్రకాష్_
Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*
*_ఇండియా ఎహెడ్ చానెల్ లోగో కొనుగోలు వ్యవహారం హఠాత్తుగా వెలుగు చూసింది. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో శుక్రవారం విచారణ సందర్భంగా 'లిక్కర్ స్కాం' కేసులో ఈ లోగో విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ వాదనలలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందని సీబీఐ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా టివి9 లోగో విషయంలో కూడా కాస్త కదలిక వచ్చింది._*
*_అసలేం జరిగిందంటే..?:_*
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్న బోయినపల్లి అభిషేక్‌రావు సాక్ష్యాధారాలను తారుమారు చేయగల వ్యక్తి అని సిబిఐ తెలిపింది. అభిషేక్ బెయిలు పిటిషన్‌పై సీబీఐ ఈ మేరకు వాదనలు వినిపించింది. బెయిలు పిటిషన్‌పై జడ్జి ఎంకే నాగ్‌పాల్ విచారణ జరిపారు. సీబీఐ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘‘ఆయన చాలా ప్రభావితం చేయగల వ్యక్తి. ఇది హై ప్రొఫైల్ కేసు. ఇందులో పెద్ద పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉంది. అభిషేక్ కచ్చితంగా దర్యాప్తును ప్రభావితం చేయగలరు. సాఽక్ష్యాధారాలను తారుమారు చేయగలరు. కాబట్టి బెయిల్ ఇవ్వొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.
*_ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదని..:_*
అభిషేక్ తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌లో అభిషేక్ పేరు లేదని, అయినా గత నెల 22 నుంచి ఈ నెల 9 వరకు చాలా సార్లు విచారించిన సీబీఐ, చివరికి 9న అరెస్టు చేసిందని గుర్తుచేశారు. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కేసు దర్యాప్తులో ఎటువంటి మార్పు లేదని, జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదని పేర్కొన్నారు. అభిషేక్ దర్యాప్తును ప్రభావితం చేసేంత పెద్ద వ్యక్తి కాదన్నారు. ఆధారాలను తారుమారు చేస్తారన్న సీబీఐ ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.
*_లావాదేవీల మాట ఏమిటి.?:_*
డబ్బుల లావాదేవీలు జరిగాయన్న సీబీఐ వాదనపై మీ వివరణ ఏంటి? అని జడ్జి ప్రశ్నించగా.. అభిషేక్ చట్టబద్ధంగా వ్యాపారం చేసే వ్యక్తి అని, లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరిగాయని బదులిచ్చారు. అభిషేక్ ఏం వ్యాపారం చేస్తారు? అని జడ్జి ప్రశ్నించగా.. బ్యూటీ పార్లర్ల చైన్ వ్యాపారం ఉందని సమాధానమిచ్చారు.
*_ముత్తాతో ఏమిటి కోట్ల లింక్:_*
ముత్తా గౌతమ్‌కు సంబంధించిన 1.7 కోట్ల మేర లావాదేవీలు ఎందుకు జరిగాయి? అని జడ్జి ఈ సందర్భంగా ప్రశ్నించారు. ముత్తా గౌతమ్‌తో అభిషేక్‌కు చాలా కాలంగా వ్యాపార సంబంధాలున్నాయని న్యాయవాదులు పేర్కొన్నారు.
*_లోగో లొల్లి:_*
‘‘ముత్తా గౌతమ్‌కు చెందిన ఇండియా ఎహెడ్ చానెల్ లోగోను అభిషేక్ కొనుగోలు చేశారు. అంతే తప్ప ఆ కంపెనీలో అభిషేక్‌కు భాగస్వామ్యం ఉందని సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. లోగో కొనుగోలుకు పెట్టుబడి మాత్రమే పెట్టారు. జోక్యం చేసుకున్న సీబీఐ న్యాయవాదులు.. లోగో కొనుగోలు చేశారంటున్నారని, అసలు లోగో లేనిదే టీవీ చానెల్‌ను నడపలేరని అన్నారు. కాగా, ఈ నెల 9న కేసులోని మరో నిందితుడు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ తమ ముందుకు రానుందని, దాంతో కలిపి అభిషేక్ పిటిషన్‌ను విచారిస్తామని జడ్జి స్పష్టం చేశారు. తదుపరి విచారణను 9కి వాయిదా వేశారు.
బాక్స్:
*_పట్టు వదలని రవిప్రకాష్_*
_◆ లోగో పోతే టివి9_ డమ్మీనే..:
*_ఎలక్ట్రానిక్ మీడియాలో కొత్త ఒరవడిని సృష్టించిన రవిప్రకాష్ కు సంబంధించిన లోగో కేసు కూడా త్వరలోనే తెరపైకి రానున్నది. ఈ విషయంలో రవిప్రకాష్ పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నారు._*
*_సెక్షన్ 180:_*
టివి9 లోగో కేసులో అలందా కంపెనీ తరుపున రాసిన ఫిర్యాదులో కంపెనీ చట్టం సెక్షన్ 180 ప్రకారం షేర్ హోల్డర్స్ అనుమతి ఉండాలని ప్రస్తుత టివి9 న్యాయవాదుల వాదన. సెక్షన్ 180 టీవీ9 లాంటి ప్రైవేటు కంపనీలకు వర్తించదని రవిప్రకాష్ తరుపున లాయర్ వాదన. 2019 మే నెల పదో తారీఖున టీవీ9ను అక్రమంగా ఆక్రమించుకుని కేసులోని కీలకమైన డాకుమెంట్స్ అన్నీ అలందా డైరెక్టర్ జూపల్లి జగపతి రావు కైవసం చేసుకున్నారని, ఆ ఆక్రమణకు వందమంది పోలీసులు సాయపడ్డారని. రవిప్రకాష్ న్యాయవాది దిల్ జిత్ చెప్పడంతో జూపల్లి వర్గం నాడు ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
*_లోగో పోతే డమ్మీనే..:_*
లోగో మారిస్తే టీవీ9 విలువ నాసిరకం ఛానళ్ళ స్థాయికి ఒక్కసారిగా పడిపోతుంది. అందుకే ఇంత రాద్దాంతం జరిగిన తరువాత కొత్త వాటాదార్లకు టీవీ9 లోగో ఎట్టి పరిస్థితుల్లో రవిప్రకాష్ ఇవ్వడానికి ఒప్పుకోరు. 2013 కంపెనీల చట్టంలోని 180 సెక్షన్ పై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన పరిస్థితి పోలీసుల మెడకు చుట్టుకుంది. ఆ సెక్షన్ ప్రయివేటు కంపెనీలకు వర్తించదని రవిప్రకాష్ తరపు లాయర్లు వాదించడంతో దానితో లింకు అయి ఉన్న టివి9 లోగో విషయం ఎలాంటి మలుపు తిరుగుతుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది.
No comments:
Post a Comment