*నాలుగో స్తంబమూ.... కూలిపోయింది.....!*
*తొలి తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్.. మలి దశలో కృష్ణ, శోభన్‌బాబు*
*ఎన్టీఆర్ తరహాలో అన్ని పాత్రలూ పోషించిన సూపర్ స్టార్ కృష్ణ*
తెలుగు చిత్ర పరిశ్రమ తొలి తరం హీరోలెవరంటే ఎన్టీఆర్, ఏఎన్నార్..! వీరిలో ఎన్టీఆర్ పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక పాత్రలతో అలరించగా.. ఏఎన్నార్ రొమాంటిక్, కుటుంబ ప్రాఽధాన్య చిత్రాలతో ఆకట్టుకున్నారు. వీరి స్థానాలను మలి తరంలో కృష్ణ, శోభన్‌బాబు భర్తీ చేశారు.
కృష్ణ.. ఎన్టీఆర్‌లా అన్ని తరహా పాత్రలతో రంజింపజేశారు. దీనికితోడుగా సాహసోపేత ప్రయోగాలతో దూసుకెళ్లారు. శోభన్‌బాబు కుటుంబ కథానాయకుడిగా, మహిళల అభిమాన హీరోగా మన్ననలు పొందారు.
అలా ఈ నలుగురూ తెలుగు సినీ సౌధానికి నాలుగు స్తంభాలుగా నిలిచారు. సినిమా కథాంశాల్లోనే కాక సంఖ్యలోనూ వీరి మధ్య పోలికలున్నాయి. నలుగురిలోనూ కష్ణనే ఎక్కువ సినిమాలు చేశారు. ఎన్టీఆర్, కృష్ణ ఇద్దరూ 300 పైగా చిత్రాల్లో నటించారు. కృష్ణ స్కోరు 350పైనే. ఏఎన్నార్ 255, శోభన్‌బాబు 230 సినిమాలు చేశారు. కృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్తంభాలుగా నిలిచిన నలుగురూ వెళ్లిపోయినట్లుయింది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment