Friday, November 25, 2022

రూ.3వేల కోట్ల లావాదేవీలపై అనుమానం.!

*_మల్లారెడ్డీ...మాట్లాడదాం రా..!_*
_◆ రంగంలోకి ఈడీ_
_◆ మంత్రి మల్లారెడ్డికి ఐటీ 'షాకింగ్' నోటీసులు_
_◆ ఆ 16 మందికి కూడా_
_◆ 15-18 డాక్యుమెంట్లు స్వాధీనం_
_◆ రూ.3వేల కోట్ల లావాదేవీలపై అనుమానం.!_
_◆ కబ్జాల కథనాలపై మరో దృష్టి_
_◆ ఐటీశాఖ గుర్తించిన అక్రమాలివే.!_
_◆ డొనేషన్ల కిందనే రూ.135 కోట్లట.!_
_◆ పరస్పరం కేసులు_
_◆ పోలీస్టేషన్ లో రివర్స్ సీన్_ 
_◆ ప్లీజ్..ఫీజుల విషయం చెప్పకండి: ఫోన్ లో బతిమాలుడు_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)_*

*_తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఓ మంత్రిపై ఐటీ శాఖ దాడులు చేసి మరీ నోటీసులు పంపింది. అర్థరాత్రి వరకు హైడ్రామా చోటుచేసుకుంది. పరస్పరం కేసులు. జీరో ఎఫ్ఐఆర్ ల నమోదు. తమ అధికారిని ఇబ్బంది పెట్టిన వైనంపై ఐటిశాఖ సీరియస్ గా ఉంది. సోమ, మంగళవారాలలో ఈ కేసుల విషయంలో కీలక సన్నివేశాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. కోట్లాది రూపాయల లావాదేవీల విషయంలో విదేశాలకు నగదు తరలిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)రంగంలోకి దిగే అవకాశం ఉంది._*

*_బాక్స్_*
*_{ రేపటి పరిశోధన కథనం: మంత్రి మల్లారెడ్డి ఎక్కడ..? ఎప్పుడు..? ఎలా ఇరుక్కున్నాడు..? }_*

*_ఐటీ ఏం చెప్పిందంటే..?_*
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై జరిగిన ఆదాయ పన్నుశాఖ సోదాల్లో దాదాపు రూ.15కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి. 22వ తేదీ ఉదయం మొదలైన ఐటీ సోదాలు ఇవాళ మధ్యాహ్నం ముగిశాయి. రెండున్నర రోజులపాటు కొనసాగిన సోదాల్లో మల్లారెడ్డి వ్యాపార లావాదేవీల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు గుర్తించామని ఐటీ వర్గాలు తెలిపాయి.

*_డొనేషన్ల కిందే రూ.135 కోట్లు..!_*
మెడికల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌, పీజీ సీట్ల విషయంలో విద్యార్థుల నుంచి దాదాపు రూ.135 కోట్లు డొనేషన్ల కింద వసూలు చేసినట్టు ఐటీశాఖ తెలిపింది. ఐటీ వర్గాలు వెల్లడించిన ప్రాథమిక సమాచారం మేరకు మెడికల్‌, డెంటల్‌, ఫార్మసీ, ఇంజినీరింగ్‌ కళాశాలలు, ఆసుపత్రులు, స్థిరాస్తి వ్యాపారం తదితర ఆస్తులపై మల్లారెడ్డి సంస్థలకు చెందిన కార్యాలయాలు, సీఈవోలు, డైరెక్టర్లు, మల్లారెడ్డి కుమారులు, అల్లుడు, బంధువులు, స్నేహితుల ఇళ్లతో పాటు క్రాంతి బ్యాంకు ఛైర్మన్‌ ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిబంధనలు తుంగలో తొక్కి కార్యకలాపాలు నిర్వహించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. మల్లారెడ్డికి చెందిన అన్ని కళాశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేసినట్టు ఆధారాలు లభించాయని ఐటీశాఖ వెల్లడించింది. 400 మందికి పైగా ఐటీ సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి.. మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున  అధికారులను ఐటీ శాఖ రప్పించింది. మరోవైపు సోదాలు ముగియడంతో ఈనెల 28, 29 తేదీల్లో హాజరై వివరణ ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులకు ఐటీశాఖ సమన్లు జారీ చేసింది. పెద్ద సంఖ్యలో సమన్లు ఇవ్వాల్సి ఉండటంతో మరికొందరికి వేరే తేదీల్లో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

*_రూ.28లక్షలు మాత్రమే దొరికాయాని బొంకుడు_*
మల్లారెడ్డి సంస్థల్లో రూ.15 కోట్లు స్వాధీనంచేసుకోగా.. ఐటీశాఖ పలు అక్రమాలను గుర్తించింది. అనేక డాక్యుమెంట్లతో పాటు స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు, హార్డ్ డిస్క్ లు బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయానికి తరలించారు. సోదాల అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి... తనపై కుట్ర పూరితంగా ఐటీ సోదాలు చేసిందని ఆరోపించారు. తనతో పాటు కుటుంబ సభ్యులు, ఉద్యోగులు అందరినీ ఇబ్బంది పెట్టారన్నారు. తాను చాలా క్లియర్‌గా ఉన్నానని, కట్టిన పన్నులు, లావాదేవీలు అన్నీ ఆన్‌లైన్‌లో ఉంటాయన్నారు. రూ.100కోట్లు అవకతవకలు అనేది అవాస్తవమని కొట్టిపారేశారు. తన ఇంటితో పాటు కుమారుల ఇళ్లలో జరిపిన సోదాల్లో  కేవలం రూ.28 లక్షలు మాత్రమే దొరికాయన్నారు. వాటికి కూడా లెక్కలు ఉన్నాయని తెలిపారు. తామోదో దొంగల్లాగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు నిలువరించారన్నారు. 

*_పరస్పరం కేసుల హైడ్రామా_*
గత రాత్రి ఐటీశాఖ, ఇటు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఫిర్యాదులు చర్చనీయాంశమయ్యాయి.
రూ.100కోట్లు డొనేషన్ తీసుకున్నారని రాసి వాటిపై బలవంతంగా సంతకం తీసుకున్నారని, మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా..384 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. తనపై దుర్భాషలాడి, ల్యాప్ టాప్, సెల్‌ఫోన్‌  తీసుకుని విధులకు ఆటంకం కలిగించాడని ఐటీశాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. సెక్షన్ 342, 353, 201, 203, 504, 506, 379, రెడ్‌విత్‌ 34 ఐపిసి కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన మల్లారెడ్డి మెడికల్ కాలేజి దుండిగల్ పరిధిలో ఉండటంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సైబరాబాద్ పరిధిలోని దుండిగల్‌కు బోయిన్ పల్లి పోలీసులు బదిలీ చేశారు. డీడీఐటీ రత్నాకర్‌ను మంత్రి మల్లారెడ్డి ఇబ్బంది పెట్టడంపై ఐటీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది.

బాక్స్:

*_డొనేషన్‌ కట్టలేదని చెప్పండి ప్లీజ్‌.. కాలేజీల నుంచి ఫోన్లు_*
రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కళాశాలలు, ఆయన బంధువుల నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేస్తోంది. కళాశాలల్లో డొనేషన్లపైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంజినీరింగ్‌, వైద్య కళాశాలల యాజమాన్యాలు.. తాము డొనేషన్‌ తీసుకున్న విద్యార్థులకు ఫోన్లు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

*_లెక్కలోకి రాకుండా.. రూ.లక్షల్లో వసూలు_*
నగర శివారులోని కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రవేశాల కోసం ఏకంగా రూ.లక్షల్లో డొనేషన్లు వసూలు చేశాయి. కళాశాల స్థాయి, బ్రాంచిని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు తీసుకున్నాయి. కొన్ని ప్రముఖ కళాశాలలు బీటెక్‌- కంప్యూటర్‌ సైన్స్‌కు రూ.12-15 లక్షలు వసూలు చేశాయి. మిగిలిన ఫీజులన్నీ దీనికి అదనం. ఒకే దఫాగా నగదు రూపంలో వసూలు చేసిన డొనేషన్‌ మొత్తాలకు పక్కా రసీదులివ్వరు. ఇవన్నీ కళాశాలల లెక్కల్లో కనిపించవు. ఈ నేపథ్యంలోనే కళాశాల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి.

బాక్స్:

*_సీన్ రివర్స్_*
అర్థరాత్రి 1.50 సమయంలో మల్లారెడ్డి, అధికారుల మధ్య పరస్పర కేసుల నమోదు విషయంలో ఓ సీన్ రివర్స్ అయినట్లు కనిపించింది. సహజంగా పోలీసులు ఎవరినైనా భయం కంపితులను చేయాలని భావిస్తే... ఇంట్లోకి వచ్చి హడావుడి చేయడం, ఫోన్ ఎత్తనీయకపోవటం సహజంగా చేస్తారు. దీంతో సున్నిత మనస్కులు భయపడతారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే పోలీసు అధికారులు ఈసారి మరో కోణం రుచి చూశారు. కేసుల నమోదైన కాసేపటికే పదుల సంఖ్యలో సీఆర్పీఎఫ్‌ బలగాలు బోయినపల్లి పిఎస్ కు చేరుకున్నారు. ఠాణాను తమ అధీనంలోకి తీసుకున్నంత పనిచేశారు. లోపలికి ఎవరినీ రానీయొద్దంటూ వారు సూచించడంతో బోయిన్‌పల్లి పోలీసులు స్టేషన్‌ గేటుకు తాళం వేశారు. కేసుల నమోదు సమయంలో సీఐకి మంత్రి నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఫోన్‌కాల్‌ను సీఆర్పీఎఫ్‌ బలగాలు మాట్లాడనీయలేదని సమాచారం. ఔరా..! ఏమీ విధి వైపరీత్యం.

No comments:

Post a Comment