Tuesday, November 8, 2022

మంత్రి సబితకు రాజ్‌భవన్ కార్యాలయం కౌంటర్

*మంత్రి సబితకు రాజ్‌భవన్ కార్యాలయం కౌంటర్*

హైదరాబాద్: తెలంగాణలో పెండింగ్ బిల్లులపై వివాదం ముదురుతోంది. యూనివర్శిటీలో నియామకాల బిల్లు విషయంలో తనకు ఎలాంటి సమాచారం రాలేదన్న మంత్రి సబిత వ్యాఖ్యలకు రాజ్‌భవన్ కార్యాలయం కౌంటర్ ఇచ్చింది. నిన్న (సోమవారం) మెసెంజర్ ద్వారా మంత్రికి సమాచారం ఇచ్చామని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం రాజ్‌భవన్‌పై కుట్ర చేసే ప్రయత్నం చేస్తోందని పేర్కొంది. పెండింగ్ బిల్లులు, యూనివర్శిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డులో నియామకాలపై యూసీజీతోపాటు మంత్రి సబితకు సోమవారం లేఖ రాశామని, తక్షణమే రాజ్‌భవన్‌కు వచ్చి వాటన్నింటిపై వివరణ ఇవ్వాల్సిందిగా సమాచారం పంపించామని రాజ్‌భవన్ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే సమాచారం అందలేదని మంత్రి చెప్పడం సరికాదంది.

కాగా గవర్నర్ కార్యాలయం నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని మంత్రి సబిత ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి తెలిపారు. లేఖ అందిన వెంటనే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. గవర్నర్ కార్యాలయం ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలు మానుకోవాలని మంత్రి సూచించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment