*_తెలంగాణలో మరో పార్టీ_*
_◆ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో.._
_◆ పార్టీ పేరు, జెండా రూపకల్పనపై కసరత్తులు_
_◆ రాజకీయ బాటలో మాజీ ఐఏఎస్ లు_
_◆ ఇప్పటికే బీఎస్పీలో చేరిన మాజీ ఐపిఎస్ ప్రవీణ్ కుమార్_
_◆ లోక్ సత్తా పేరుతో ఓట్లు చీల్చిన జయప్రకాష్ నారాయణ్_
Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 944 000 0009 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*
*_క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న సర్వే వార్తల నేపథ్యంలో తెలంగాణలో మరో పార్టీ పురుడు పోసుకోబోతోంది. మాజీ ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వాన్ని తూర్పార పడుతున్నారు. గతంలో 'లోక్ సత్తా' పేరుతో జయప్రకాష్ నారాయణ ఓట్లను భారీగా చీల్చటం జరిగింది. తాజాగా మరో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నూతన పార్టీని పెట్టబోతున్నారు. ఆయన గత కొంత కాలంగా కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రశ్నిస్తు వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న రాజకీయ పార్టీకి జెండా, ఎజెండా ఖరారు చేసే.దిశలో మురళి కసరత్తులు చేస్తున్నారు._*
*_ప్రస్తుతం...:_*
ఆకునూరి మురళి తన సొంత రాష్ట్రమైన తెలంగాణలో ప్రజా సమస్యలపై గొంతెత్తుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయాల్లో దూకుడు పెంచారు.
*_జయప్రకాష్, ప్రవీణ్ బాటలో..:_*
ఇప్పుడు ఆకునూరి మురళి కూడా లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ, ప్రవీణ్ కుమార్ బాటలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో రాబోయే సాధారణ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
*_మునుగోడుపై ఫిర్యాదు:_*
ఇటీవల మునుగోడు ఉపఎన్నిక సమయంలోనూ ఆయన స్పందించారు. ఉప ఎన్నికను రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి ఆయన లేఖ కూడా రాశారు.
*_బలమైన పార్టీల మధ్యలో..:_*
రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు బలంగా ఉన్నాయి. ఇప్పడు మిగతా పార్టీలు కూడా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఆకునూరి మురళి ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో తప్పకుండా మార్పులు చోటు చేసుకుంటాయి.
బాక్స్:
*_గతంలో ఆయన..:_*
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా, స్టేట్ ఆర్కివ్స్ సంచాలకుడిగా పని చేశారు. ఇంకా పదవీకాలం మిగిలి ఉండగానే ఆయన స్వచ్చంద పదవీ విరమణ పొందారు. అనంతరం ఏపీలోని జగన్ ప్రభుత్వంలో విద్యాశాఖలో మౌలిక సదుపాయాల సలహాదారులుగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు.
No comments:
Post a Comment