Friday, November 18, 2022

ఈటలతో పాటు ప్రభుత్వ పెద్దలకూ నిర్మాణాలు.....!

*ఈటలతో పాటు ప్రభుత్వ పెద్దలకూ నిర్మాణాలు.....!*

*పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులకు కూడా..*

*దేవరయాంజాల్‌'లో* *1350 ఎకరాలు దేవాదాయ శాఖవే!*

*ఆ భూముల్లో గోదాములు, పరిశ్రమలు*

*సర్కారుకు నివేదిక అందించిన త్రిసభ్య కమిటీ*

మేడ్చల్‌, : దేవరయాంజాల్‌లోని 1350 ఎకరాలు దేవాదాయ శాఖకు చెందినవేనని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది.మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మునిసిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్‌ సీతారామచంద్రస్వామి ఆలయ భూములు 1350 ఎకరాలు దేవాదాయ శాఖవేనని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రఘునందన్‌రావు నేృత్వంలోని కమిటీ స్పష్టం చేసింది. అయితే ఈ భూముల్లో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామిక వేత్తలు, ప్రజాప్రతినిధులు గోదాములు, పరిశ్రమలు తదితర నిర్మాణాలను చేపట్టినట్లు కమిటీ పేర్కొంది. ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎ్‌సలో ఉన్నంత వరకూ ఈ భూముల వైపు కన్నెత్తి చూడని అధికారులు.. ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపించిన తర్వాత ఆలయ భూములను గుర్తించే పని చేపట్టడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో పలుమార్లు క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిటీ.. ఆలయ భూములతో పాటు అందులో చేపట్టిన నిర్మాణాలను పరిశీలించింది. ఎట్టకేలకు 1350 ఎకరాలు దేవాదాయ శాఖవేనని తే ల్చింది. ఈ భూముల్లో ఈటలతో పాటు అధికార పార్టీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధుల నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఈటలకు చెందిన గోదాముల్లో ఉన్న ప్రభుత్వ మద్యం డిపోలను కూడా అప్పట్లో సర్కారు ఖాళీ చేయించింది. ప్రస్తుతం ఈ గోదాములు ఖాళీగానే ఉన్నాయి. దేవరయాంజాల్‌లో సర్వే నంబర్లు 55 నుంచి 63 వరకు, 639, 641, 656, 657, 660, 682, 686, 718లో ఆలయ భూములున్నాయి. ప్రస్తుతం త్రిసభ్య కమిటీ ఈ భూములు దేవాదాయ శాఖకు చెందినవేనని నివేదిక అందించడంతో అక్క డ నిర్మాణాలు చేపట్టిన వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందోనని ఆందోళనలో ఉన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment