*_మా కుటుంబాల బాద...తెలంగాణలో జర్నలిస్టులను, ఆర్.టి.ఐ. ఉద్యమ కారులను, సామాజిక వేత్తలను, ప్రశ్నించే గొంతులను నులిమినప్పటి 'నొప్పి'...._*
*_ఇప్పుడు మీకు తెలుస్తుందా..?_*
_● గుండెలు బాదుకుంటున్న గులాబీలు౼
_● నాడు ప్రజల ఆక్రందనలు విన్నారా.?_
_● త్యాగాలతో 'మీం'_
_● డబ్బు సంచులతో 'మీరు'_
_● అదే జైళ్ళు నోరు తెరుచుకుంటే.. మీ బతుకులు.!_
Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం, 9440000009)_*
*_తెలంగాణలో బుధవారం ఓ హైడ్రామా. 'నీవు నేర్పిన విద్యే నీరజాక్ష' అంటూ కేంద్రం వ్యూహాత్మక దాడులు గులాబీ నేతల గుండెల్లో ఒకటే గుబులు..టెన్షన్... తెల్లవారితే ఎవరికి..? ఏం జరుగుతోందన్న భయం. ఇవే క్షణాలు గతంలో జర్నలిస్టులను కిడ్నాప్ చేసినప్పుడు, ఆర్.టి.ఐ. ఉద్యమ కారులను అక్రమంగా అరెస్టులు చేసినప్పుడు.. సామాజిక వేత్తలను, ప్రశ్నించే గొంతులను నులిమినప్పుడు వచ్చిన ఆక్రందనలే..! అప్పుడు అధికార మదంతో పోలీసుల భుజంపై గన్నులు పెట్టి 'పెన్నుల'పై 'వీరంగం' చేశారు. జస్ట్ ఇప్పుడు మీ మీద జరుగుతుంది సరికొత్త 'వీరంగం.!' అప్పుడు ప్రశ్నించే గొంతుకల దగ్గర దొరికింది సెల్ ఫోన్స్ మాత్రమే.! మరి ఇప్పుడు మీ దగ్గర కోట్లాది రూపాయలు, సంచుల కొద్దీ బంగారం, భూ పత్రాలు. మా మండే గుండెలు ఎప్పుడు చల్లారతాయో.. తెలుసా..? మీరు, మీ కుటుంబ సభ్యులు జైళ్ళకు న్యాయంగా వెళ్ళినప్పుడు..మాత్రమే..! తథాస్తు..!!_*
*_అసలేం జరిగిందంటే..?_*
మంత్రి మల్లారెడ్డి ఐటీ దాడులతో మంగవారం షాక్ లో ఉండగా... బుధవారం నుంచి గుండెలు బాదుకునే కార్యక్రమం చేపట్టారు. కొడుకు...కూడా ఎమ్మెల్సీ రమణలాగే బెడ్ ఎక్కేశాడు. నా కొడుకును కొట్టారంటూ మల్లారెడ్డి శివాలెత్తాడు. అక్కడ విచారణ అంతా (మల్లన్న సినిమాలో లాగా) కెమెరాలలో నిక్షిప్తమై ఉందనే లాజిక్ మరిచాడు. ఓకే..!
*_వ్యవస్థలను నిర్వీర్యం చేసి.._*
సోదర పోలీసులను ఇక్కడ తప్పు పట్టం.. ఎందుకంటే అధికారం క్రింద పనిచేసే వాళ్ళు కనుక. చదరంగం ఆటలో పావులను ఎలా తప్పు పట్టగలం.. తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలను కిడ్నాప్ లు చేసి మరీ అకృత్యాలు చేశారు కదా..! ఇప్పుడు సేమ్ సీన్..రివర్స్ గేర్ పడింది. టైం అంటే అదే.!
*_సిబిఐ రావచ్చు..!_*
తెలంగాణ రాష్ట్రంలోకి సిబిఐ రావద్దంటూ ప్రభుత్వం హుకుం గుట్టుగా జారీ చేసింది. ఇది భయంతో చేసిందని భాజపా నేతల ఆరోపణ. నేర విస్తరణ, తీవ్రతను బట్టి సిబిఐ వచ్చే వీలుందనే సుప్రీంకోర్టు తీర్పును తాజాగా కమలం నేతలం బయటకు తీశారు.. సో..! సిబిఐ అరెస్టుల పర్వం తెలంగాణలో ఉండవచ్చు. ఇక పాత కేసులతో ఉన్న లింక్ లపై సిబిఐ నేరుగా వచ్చే అవకాశం ఉంది.
బాక్స్:
*_ఎంత 'సొత్తు' దొరిందంటే..?_*
రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై రెండు రోజులుగా కొనసాగుతున్న ఐటీ దాడులకు సంబంధించి అధికారులు కీలక వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం రూ.8.80 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మంగళవారం జరిపిన సోదాల్లో రూ.4.80 కోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా దొరికిన మొత్తంలో త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2.80 కోట్లు, మర్రిరాజశేఖర్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, మల్లారెడ్డి బావమరిది కొడుకు సంతోష్‌రెడ్డి ఇంట్లో రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. కాగా మల్లారెడ్డికి 38 ఇంజనీరింగ్ కాలేజీలు, నాలుగు మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీతోపాటు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్న నేపథ్యంలో.. వాటి కొనుగోలుకు సంబంధించిన వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు గత మూడేళ్లలో కొనుగోలు చేసిన భూములు, ఆస్తులు, వాటికి డబ్బును ఎక్కడెక్కడి నుంచి చెల్లించారు? అన్న విషయాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేవరయాంజాల్, శామీర్‌పేట, జవహర్‌నగర్, మేడ్చల్, ఘట్‌కేసర్, కీసరలో మల్లారెడ్డి కుటుంబానికి లెక్కకు మించిన ఆస్తులు ఉన్నట్లు చెబుతుంటారు. ఇక మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపులోనూ అవకతవకలు చోటుచేసుకున్నట్లు, చాలా సీట్లను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల బ్యాంకు లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
బాక్స్ :
*_అక్కడ నోబెల్ - ఇక్కడ నో బెయిల్_*
_★ రవిప్రకాష్ 23 రోజులు_
_★ అనంచిన్ని వెంకటేశ్వరరావు 79 రోజులు_
_★ గంజి రఘు 13 రోజులు_
_★ తీన్మార్ మల్లన్న 71 రోజులు_
_★ జైల్లో నరకం_
అద్భుతమైన ప్రజాస్వామ్య దేశంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఎలా ఉంది.? ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అధికారికంగా ప్రకటించిన మహిళా ప్రధాని. నేడు భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణరాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉంది.? ఫిలిఫీన్స్, రష్యాలలో ఎలా ఉంది.? ఆ,యా దేశాలలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు అత్యున్నత నోబెల్ పురస్కారాలు. మరి ఇక్కడ నో'బెయిల్' సత్కారాలు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వేధింపులు, అక్రమ కేసులు, కిడ్నాప్ 'అరెస్టులు... ఆ,యా జర్నలిస్టులకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న అధికార వర్గాలు. ఇప్పటి వరకు ముగ్గురు ప్రముఖ పాత్రికేయులను జైళ్ళల్లో 'మగ్గ' పెట్టారు. ఇప్పుడు వారే చేయాల్సిన వారిని 'ఫ్రై' చేస్తున్నారు.
*_రవిప్రకాష్_*
దేశంలో ఎలక్ట్రానిక్ మీడియాను వ్యాపార రంగంలో కొత్త ఒరవడిని సృషించాడు. పాతిక కోట్ల ప్రస్థానాన్ని రూ. 450 కోట్లకు చేర్చాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల 'ఆత్మహత్య' సంఘటనపై నోరు తెరిచిన కొద్ది గంటల్లోనే యాజమాన్యం విషం గక్కింది. ఆయన్ని బయటకు పంపింది. నాడు లాభాల బాటలో ఉన్న టివి9 ఇప్పుడు ఆనాటి ఆర్థిక ప్రాభవం కోల్పోయింది. చంచల్ గూడలో 23 రోజులు అక్రమంగా కేసులు పెట్టి బెయిల్ రాకుండా వేధించిన వైనం చరిత్ర.
*అనంచిన్ని వెంకటేశ్వరరావు*
పరిశోధన పాత్రికేయంలో తనదైన ముద్ర. 'విజయవిహారం' చేస్తూ ఏ అవినీతి పరుడికి లొంగని తీరు. అక్రమాలను వెలికి తీయడంలో అరడజను ముఖ్యమంత్రుల వైభోగాలను అలవోకగా రాసిన అక్షర మాంత్రికుడు. నిజాలను నిక్కచ్చిగా చెప్పే దమ్మున్న జర్నలిస్ట్. ఇక వార్తలు రాయడమే ముఖ్యం కాదు. 'స్టైల్' మార్చి అందర్నీ మాట్లాడించే తర్ఫీదు ప్రక్రియ విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. పలు ప్రజాసంఘాలతో ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ.. 'ఫాంహౌస్' పడుకున్న వాళ్ళను బయటకు రప్పించి మరీ మాట్లాడిస్తున్నాడు.
3 సార్లు కిడ్నాప్ డ్రామా.! కేవలం వార్తలు రాసినందుకే నల్గొండలో 8, హైదరాబాద్ చర్లపల్లి సింగిల్ బారెక్ లో 53, చంచల గూడలో 18 మొత్తం 79 రోజులు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం తర్వాత వార్తలు రాసినందుకు అత్యధిక రోజులు జైలులో పెట్టిన అద్భుతమైన ఘనత మన తెలంగాణ ప్రభుత్వానిదే..!
*_గంజి రఘు_*
యువ జర్నలిస్ట్. పేదోళ్ళ మధ్య తిరుగుతూ.. వాళ్ళ సమస్యలపై 'యాంకరింగ్' చేస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు సగర్వంతో చేసిన కిడ్నాప్ అరెస్ట్. పాపం సిసి ఫుటేజ్ వల్ల తెలంగాణ పోలీసుల ప్రతిభ అందరికీ తెలిసింది. వారికి ధన్యవాదాలు. హుజురాబాద్ జైలు నుంచి నల్గొండ జైలు వరకు 13 రోజుల హైడ్రామా. వెరసి బయటకు వచ్చిన తర్వాత జర్నలిస్ట్ 'తలకొరివి ఎలా పెట్టవచ్చు.?' అనే విషయంలో 'మాస్టర్'గా మారాడు.
No comments:
Post a Comment