Tuesday, November 8, 2022

ఆ సమస్యకు వెంటనే ముగింపు పలకండి...మంత్రి KTR ఆదేశం....!

*ఆ సమస్యకు వెంటనే ముగింపు పలకండి...మంత్రి KTR ఆదేశం....!*

హైదరాబాద్‌: నిజాం కాలేజ్‌లో విద్యార్థినుల ఆందోళనపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. హాస్టల్‌ సౌకర్యం కల్పించాలంటూ అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థినులు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తునన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ సమస్యపై కేటీఆర్‌ స్పందిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని ఆమెను కోరారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్‌ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్‌ ప్రిన్సిపల్‌ను ఆయన ఆదేశించారు.

హాస్టల్‌ వసతి అంశంపై ఇటీవల బషీర్‌బాగ్‌ కూడలిలో విద్యార్థినులు ధర్నాకు దిగారు. దీంతో కాసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. అనంతరం కాలేజ్‌లో ప్రిన్సిపల్‌ ఛాంబర్‌లోనూ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి హాస్టల్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ఈ సమస్యపై స్పందించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment