Sunday, November 6, 2022

గెలుపోటములకు అందరూ బాద్యులే

*గెలుపోటములకు అందరూ బాద్యులే*

*మునుగోడు ఉప ఎన్నికలో గెలుపోటములకు అందరూ బాధ్యులేనని.. గెలిచినా, ఓడినా ఏ* *ఒక్కరిదో బాధ్యత కాదని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు.*

*కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి*

*నల్లగొండ....*
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపోటములకు అందరూ బాధ్యులేనని.. గెలిచినా, ఓడినా ఏ ఒక్కరిదో బాధ్యత కాదని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి ఎఫ్‌సీఐ గోదాము వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపునకు ముందే కేంద్రానికి వచ్చిన స్రవంతి.. రెండు నుంచి మూడు రౌండ్లలో కాంగ్రెస్‌ పార్టీకి ఆశాజనకంగా ఓట్లు రాకపోవడంతో నిరాశ చెందారు. వస్తున్న ఫలితాలను బట్టి కాంగ్రె్‌సకు ఏ మండలంలో కూడా భారీగా ఓట్లు వచ్చే అవకాశాలు లేవని భావించిన ఆమె.. కౌంటింగ్‌ హాల్‌ నుంచి ముందుగానే వెళ్లిపోయారు. నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపునకు ముందే స్రవంతి కౌంటింగ్‌ కేంద్రం నుంచి నిష్క్రమించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment