*_లిక్కర్ స్కామ్‌లో ‘కనిక’ట్టు_*
_● ప్లైట్ లో లిక్కర్ సొమ్ము.!_
_● సుమారు రూ 500 కోట్లు తరలించారని అనుమానం.!_
_● కనికా విమానాల్లోనే రూ.కోట్లు తరలించారా?_
_● సంస్థ వివరాలు కోరిన ఈడీ_
Courtesy by: (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_*
*_దేశ రాజధాని దిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం. హైదరాబాద్ నుంచి డబ్బు.. అదేనండీ కోట్లు, కోట్లు బస్తాల్లో ఎలా తరలించారనే కోణంలో ఈడీకి బలమైన ఆధారం దొరికింది._*
*_అసలేం జరిగిందంటే..?_*
గత నెల 17న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్‌కు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రాబిన్ గుప్తా రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన శరత్‌చంద్రారెడ్డి భార్య కనికా టేక్రివాల్ నడుపుతున్న ‘జెట్ సెట్ గో’ విమానయాన సంస్థ వివరాలు, ప్రత్యేక సర్వీసుల రాకపోకలపై వివరాలు ఇవ్వాలని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈడీ లేఖ రాసింది.
*_పూర్తి వివరాలు పంపండి_*
కనికా టేక్రివాల్ ‘జెట్ సెట్ గో’ పేరుతో ప్రైవేటు జెట్ చార్టర్డ్ విమాన సర్వీసులు నడుపుతున్నారు. దిల్లీ మద్యం కుంభకోణంలో చేతులు మారిన రూ.కోట్ల నగదు కనికా ఏర్పాటు చేసిన విమానాల్లోనే తరలించినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. కనికా సీఈవోగా నిర్వహిస్తున్న ‘జెట్ సెట్ గో’ సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి లేఖ రాసిన తేదీ వరకు నడిపిన అన్ని ఛార్టర్డ్ విమానాల వివరాలు, ఆ ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలు, విమాన మేనేజర్ల జాబితా అందించాలని ఈడీ లేఖలో పేర్కొంది. తాము అడిగిన సమాచారానికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు పంపాలని స్పష్టం చేసింది. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం జరుగుతున్న విచారణలో భాగంగా ఈ వివరాలు కోరుతున్నట్టు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ లేఖలో వెల్లడించారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో పెనక శరత్ చంద్రారెడ్డి కీలకంగా చక్రం తిప్పారని ఆరోపించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే అయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment