*చెర్లపల్లి జైలులో...*
*_దురదృష్టవంతుడు_*
_◆ దోషి కాని నిందితుడు.!_
_◆ ఎవరికి చెప్పినా నమ్మరు.!_
_◆ అతి మంచితనమే అతగాడి బలహీనత.!_
_◆ ట్రాప్ అయ్యాడు.!_
Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 944 000 0009 'తెలంగాణ వాచ్ ' కోసం ప్రత్యేకం)_*
*_అతనో మధ్య తరగతి మనిషి. దీన స్థితిలో కష్టపడి చదివాడు. చూస్తుండగానే తల్లిదండ్రులు దూరంగా జరిగారు. భార్యబిడ్డలే ప్రపంచం. అందర్నీ నమ్మే నైజం. అతని సహజ లక్షణం. ఇదే శాపంగా మారింది. దోషి కాకున్నా.. అతడు నిందితుడే.! ఉండేది మాత్రం చర్లపల్లి జైలులోనే..! అయితే అతను జీవితశిక్ష పడిన ఖైదు కాదు. కనీసం రిమాండ్ ఖైదీ అంతకన్నా కాదు. చేయని నేరాలకు మానసిక శిక్ష అనుభవిస్తున్న కలియుగ ఖైదు ఉద్యోగి జీవిత కథ. అక్కడ పనిచేసే జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ విషాద గాథ ఇది._*
*_అసలేం జరిగిందంటే..?_*
సాటి మనిషికి సహజంగా ఉపయోగపడాలనే తాపత్రయం. ఆయన కొంప ముంచింది. మంచుతోంది. ముంచేస్తోంది కూడా. (ఈ కథనం రాకుంటే..) అష్టకష్టాలు పడి చదువుకొని.. దిగజారిన పరిస్థితుల మధ్య ఉద్యోగం కోసం అర్రులుచాసి.. ఎట్టకేలకు జైలులో ఓ సామాన్య ఉద్యోగం. సీనియారిటి మధ్యలో అక్కరకు రాకున్నా..అనుకోని పదోన్నతి. జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గా బాధ్యతలు. ఓ సైబర్ బ్యాచ్ ఇతగాడిని ట్రాప్ చేసింది. ఓ లక్ష కాజేసింది. పాత కేసు ఒకటి బయటకు వచ్చింది. అంతే.. జైలు నుంచి గెంటేసి.. ఉన్నతాధికారులు బయట బాధ్యతలు అప్పగించారు. ఆయన పేరు దశరథ్. జస్ట్ చింతల దశరథ్ మాత్రమే.!
*_కొసమెరుపు_*
ఈ రచయిత నిజమైన రాతలకు భయపడిన ప్రభుత్వం 53 రోజులు నిర్భంధం విధించిన సమయంలో... ఆయన సిసి పుటేజీల పర్యవేక్షణ చేసి.. 'డ్రై ఫ్రూట్స్' తప్ప ఓ మెతుకు మింగిన వైనాన్ని ఉన్నతాధికారులకు నివేదించిన అధికారులలో ఇతను ఒకరు కావడం యాదృచ్చికం. అదో నరకం..అయినా జర్నలిజం నిబంధనల మేరకు నిజాలను మాత్రమే వెలుగులోకి తేవటం ఓ జర్నలిస్ట్ సామాజిక కర్తవ్యం. అందుకే ఈ నిఖార్సయిన కథనం.
*_అంకితం_*
_వార్తలు రాసినందుకే... 8, 53, 17.. మొత్తం 78 రోజులు జైలులో నిర్భంధించిన 'తెలంగాణ దొర'కు ఈ కథనం అంకితం. ధన్యవాదాలు_
బాక్స్ 1:
*_ఎలా ట్రాప్ అయ్యాడు..?_*
సైబర్ నేరగాళ్ల బారినపడి చర్లపల్లి జైలు ఉన్నతాధికారి ఒకరు దాదాపు లక్ష రూపాయలు సమర్పించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఒక అధికారికి ఇటీవల ఫోన్ చేసిన కొందరు యువతులు ఆయనతో చాటింగ్ చేశారు. ఆ తర్వాత నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆయనతోనూ అలాగే మాట్లాడించారు. దానిని రికార్డు చేసిన నేరగాళ్లు ఆ తర్వాత అసలు రూపం బయటపెట్టారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. వారి బెదిరింపులను ఆయన పట్టించుకోలేదు.
*_సిబిఐ పేరుతో.._*
ఆ తర్వాత కొన్ని రోజులకు సీబీఐ అధికారి అజయ్ కుమార్ పాండే పేరుతో జైలు అధికారికి ఫోన్ చేసి.. మీ అసభ్య వీడియోపై యూట్యూబ్ నుంచి ఫిర్యాదు అందిందని, తనకు డబ్బులు చెల్లిస్తే మేనేజ్ చేసుకుంటానని నమ్మించాడు. అంతేకాదు, సీబీఐ పేరుతో నకిలీ లేఖ కూడా పంపాడు.
*_సెటిల్ మెంట్ అవకాశం_*
రాహుల్ శర్మ అనే వ్యక్తి నంబరు ఇచ్చి ఆయనకు ఫోన్ చేసి సెటిల్ చేసుకోవాలని సూచించాడు. ఆయన ఇచ్చిన నంబరుకు జైలు అధికారి ఫోన్ చేశారు. యూట్యూబ్ నుంచి వీడియోలు తొలగించేందుకు రెండు విడతలుగా రూ. 97,500 చెల్లించుకున్నారు. ఆ తర్వాత కూడా మరోమారు ఫోన్ చేసి మరో రెండు వీడియోలు ఉన్నాయని, వాటిని వైరల్ చేయకుండా ఉండాలంటే రూ.85 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో అయోమయంలో పడిన అధికారిని గమనించిన తోటి ఉద్యోగి విషయం ఆరా తీశారు. అది విని ఇది సైబర్ మోసం తప్ప మరోటి కాదని ఆయనకు చెప్పారు.
*_కుషాయిగూడ పోలీసుల వద్దకు.._*
ఆయన కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
బాక్స్ 2:
*_కాల్ చేస్తే.. పేరోల్.._*
పెరోల్ కాగితాలు ఉన్నతాధికారులకు పంపించి అనుమతి తొందరగా వచ్చేలా చూడాలంటే.. తనకు వీడియో కాల్ చేయాలంటూ ఖైదీ సోదరిని జైలు అధికారి వేధింపులకు గురిచేసిన ఘటన.
*_అసలేం జరిగిందంటే..?_*
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎండీ బాషా అనే ఖైదీ చర్లపల్లి కేంద్రకారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడికి పెరోల్ అవకాశం లభించింది. అయితే, త్వరగా ప్రక్రియ పూర్తికావాలంటే తనకు వీడియో కాల్ చేయాలంటూ డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథం ఖైదీ సోదరికి ఫోన్‌చేసి వేధించడం మొదలుపెట్టాడు. దీని గురించి జైల్లో ఉన్న సోదరుడికి చెప్పుకొని ఆమె విలపించింది. తమ కుటుంబసభ్యులను సదరు అధికారి లైంగికంగా వేధిస్తున్నాడంటూ పర్యవేక్షణాధికారి సంతోష్‌రాయ్‌కి గత నెల 26న ఖైదీ ఫిర్యాదు చేశాడు. వేధింపులు వాస్తవమేనని విచారణాధికారి నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆ అధికారిని బదిలీ చేస్తున్నట్లు జైళ్లశాఖ డీజీ జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అతడిపై జైళ్లశాఖ అధికారితోపాటు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
*_జైలు బయట విధులు_*
చర్లపల్లి డిప్యూటీ జైలర్ చింతల దశరథ్ పై చర్యల విషయంలో ఉన్నతాధికారులు సైతం ఎటూ నిర్ణయం తీసుకోలేని సంకట పరిస్థితి. అతని అతి మంచితనం.. ఇతరులకు అవకాశంగా మారింది. వెలుగుచూస్తున్న విషయాలు వేరు. యధార్థం వేరు. ఓ ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో దురదృష్టం వెంటాడితే.. ఆ ఉద్యోగి పేరే చింతల దశరథం.
No comments:
Post a Comment