Sunday, November 20, 2022

తొలివెలుగు'పై 10 కోట్ల పరువు నష్టం దావా

*_యశోద వెర్రి చేష్టలు.!_*
_★ 'తొలివెలుగు'పై 10 కోట్ల పరువు నష్టం దావా_
_★ రమ్య మృతికి సంబంధం లేదంటూ వీడియో_
_★ తన కూతురి ప్రాణానికి 20 కోట్లు ఇవ్వాలంటున్న తండ్రి_
_★ సోషల్ మీడియా ద్వారా బాధితుల ఆవేదన_
_★ మీడియా గొంతు నోక్కే ప్రయత్నం_
_★ రాక్షస ఆనందం: జర్నలిస్ట్ రఘు_
_★ యశోద కొవ్వు కరిగించాలి: టిజేఎస్ఎస్_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, 9440000009)_*

*_యశోద హాస్పిటల్ ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. తెలంగాణ ప్రజల సొత్తును 'జలగ' లాగా పీలుస్తూ.. డబ్బు మదం, కొవ్వుతో యశోద ఆసుపత్రి కొట్టుమిట్టాడుతోంది. కార్పొరేట్ వ్యవస్థ ఆగడాలపై వార్తలు రాయొద్దా? ప్రసారం చేయొద్దా? ఎన్ని ఘోరాలు చేసినా కళ్లు మూసుకుని కుర్చోవాలా? ప్రశ్నిస్తే.. 'పరువు పోయింది' అంటూ దావాలు వేస్తారా? కార్పొరేట్ తీరు చూస్తుంటే బాధితులకు 'అండగా నిలబడొద్దు' అనేలా ఉందని జర్నలిస్ట్ సంఘాలు అంటున్నాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే 'ఎక్స్ పార్టీ ఆర్డర్స్' తెచ్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన మీడియాని గుప్పిట్లో పెట్టుకున్న కార్పొరేట్ రంగం.. సోషల్ మీడియాను కూడా తన కంట్రోల్ లో ఉంచుకోవాలని చూస్తోందని మండిపడుతున్నాయి._*

*_ఏం జరిగిందంటే?_*
డెంగ్యూతో బాధపడుతున్న 21 ఏళ్ల రమ్యను దిల్ సుఖ్ నగర్ ప్రాణహిత్ హాస్పిటల్ లో చేర్చించారు ఆమె తండ్రి సత్యనారాయణరెడ్డి. ఆరోగ్యం విషమించడంతో గత నెల 12న మలక్‌ పేట యశోద హాస్పిటల్‌ లో (ఐపీ నెం.336592) చేర్పించారు. దురదృష్టవశాత్తు 14వ తేదీన రాత్రి 11.29 గంటలకు రమ్య చనిపోయింది. ఆమె మృతిని కన్ఫామ్ చేసి డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. కానీ, బిల్లు మాత్రం 15వ తారీఖు కూడా వేశారు. కుటుంబసభ్యులు కూడా డీటెయిల్స్ చూసుకోకుండానే మొత్తం బిల్లు కట్టారు. తర్వాత బిల్లుల్ని పరిశీలించగా ఈ విషయం వెలుగుచూసింది. డెత్ సర్టిఫికెట్ లో 14న చనిపోయిన యువతికి 15న రకరకాల టెస్టులు చేసినట్లు బిల్లులో ఉందని బాధితులు చెబుతున్నారు. ఈ విషయాన్నే తొలివెలుగు హాస్పిటల్ దగ్గరకు వెళ్లి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించింది. అయితే.. యశోద యాజమాన్యం 10 కోట్ల పరువు నష్టం దావా వేసింది. దీనిపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి.

*_మీ బతుకులు చెడ.!_*
యశోద హాస్పటల్ ఆగడాలు తరచూ ఎక్కడో ఒక చోట బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలను కూడా ఆధారాలతో, బాధితుల ఆవేదనలు వేయరాదంటూ అడ్డు తగులుతున్నారు.

*_బాధితులంతా ఏకం_*
కాసుల కోసం రక్తం తాగుతున్న యాజమాన్యాన్ని కడిగి పారేసేందుకు బాధితులంతా ఓకే వేదిక మీదకు రాబోతున్నారు. వారి గోడు చెప్పడానికి తొలివెలుగు, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టిజేఎస్ఎస్) అండగా ఉంటుంది. జరిగిన నష్టం ఏంటో కళ్లకు కట్టేలా చూపించబోతోంది. బాధితులు వినియోగదారుల ఫోరంలో కేసులు వేయబోతున్నారు. హైకోర్టుని ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు.

బాక్స్:
*_తప్పు లేకుంటే.. ఖరీదులు ఎందుకు కడుతున్నారు: టిజేఎస్ఎస్_*
అప్పటికప్పుడు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్న కేసులను కూడా ఇప్పుడు బయటకు తీసుకురాబోతున్నాం. తమ తప్పే లేకపోతే.. హాస్పటల్ వారు లక్షలకు లక్షలు చనిపోయిన బాధిత కుటుంబాలకు ఎందుకు ఇచ్చారు. ప్రభుత్వం అండదండలతో ఎన్ని అరాచకాలు చేసిందో..? అనాది కాలంలోనే వేల కోట్లకు ఎలా ఎదిగారో..? క్విడ్ ప్రో కో ఎక్కడ జరిగిందో..? అన్నింటినీ 'తొలివెలుగు' ఆధ్వర్యంలో బట్టబయలు చేస్తాం. యశోద ఆస్పత్రి యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉందని చెబుతుంటారు. అయితే.. హాస్పిటల్ తీరుపై సర్కార్ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పేరు చెప్పి అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

బాక్స్:
*_మానవహక్కుల కోసం పోరాటం_*
బాలిక తండ్రి పేద రైతు. కూతురిని బతికించుకుందామని తనకున్న వ్యవసాయ భూమిని అమ్మి డబ్బులు చెల్లించాడు. రూ. 6 లక్షల లెక్క సరిచేయడానికి రమ్యకు మరణించిన తర్వాత చికిత్స కొనసాగించారని రమ్య తండ్రి ఆరోపించారు. ఈ మేరకు యువతి తల్లిదండ్రులు మలక్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా రోగులు చనిపోయిన తర్వాత కూడా బిల్లులు వసూలు చేసిన యశోద హాస్పిటల్ పై, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన ప్రాణహిత హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్‌హెచ్ఆర్సీని కోరారు.

బాక్స్:
*_రాక్షస ఆనందం: జర్నలిస్ట్ రఘు_*
'తొలివెలుగు', జర్నలిస్ట్ రఘుకు యశోద యాజమాన్యం రూ.10 కోట్లకు పరువునష్టం దావా పంపింది. దీనిపై జర్నలిస్ట్ రఘు స్పందించారు. బాధితుల ఆవేదనలను బయట ప్రపంచానికి చూపటం తప్పా.? ఇటీవల ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువయ్యాయని, ఇదొక రాక్షస ఆనందగా మారిందని, జైళ్ళు నోరు తెరిచినప్పుడే భయపడలేదని, ఇలాంటి నోటీసులకు 'తొలివెలుగు' బెదరదని, తాము న్యాయపోరాటం చేస్తామని స్పష్టంగా తేల్చి చెప్పారు.

No comments:

Post a Comment