కటకటాల్లోకి కల్వకుంట్ల కుటుంబం..?
మార్చ్ మూడో వారంలో షురూ
కేసీఆర్ ఫ్యామిలీపై ఈడీ ఫోకస్
ఇటీవల రూ. 2660 కోట్ల ట్రాన్సాక్షన్
అధికారులతో ఆరా మొదలు
వివరాలు సేకరిస్తున్న ఓ ఐపీఎస్
యూపీ ఎలక్షన్స్ తర్వాత టార్గెట్
విషయం కేసీఆర్ కు తెలిసిపోయింది.
కేంద్రం ఉచ్చుభిగిస్తుందన్న విషయం నిఘావర్గాల ద్వారా తెలుసుకున్న కేసీఆర్.. ఎలాగైనా మళ్లీ ప్రజల అండను కూడగట్టి గట్టెక్కేందుకు ప్రయత్నాలు ఓవైపు మొదలు పెట్టి దళిత బందు.. మన బడి మన ప్రణాళిక పేరుతో ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేంద్రం ఉచ్చుభిగించే సమయంలో ప్రజల నుండి సానుభూతిని పొందెందుకు తంటాలు పడుతున్నాడు.. అయితే మార్చి మూడోవారంలో ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలుసుకున్న కేసీఆర్ ఐఏఎస్ అధికారులను డిప్యూటేషన్ పై తీసుకువెళ్లే విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ లేఖను కూడా వదిలాడు. రాష్ట్రం నుండి డిప్యూటేషన్ పై కేంద్రానికి వెళ్తున్న ఐఏఎస్ లను ఎలాగైనా వెళ్లకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ నానాపాట్లు పడుతున్నాడు. తనకు ఇబ్బంది కలిగిన ప్రతిసారి ప్రజలను రెచ్చగొట్టి బయటపడే కేసీఆర్ కు ఈసారి ప్రజల నుండి అలాంటి సపోర్ట్ దొరికే ఛాన్స్ కనిపించడంలేదు..
ప్రత్యేక నిఘా బృందం
కేసీఆర్ ఫ్యామిలీ కొల్లగొట్టిన సంపద.. వారి బినామీల వ్యవహారంలో కేంద్రం నిఘా బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది.. కేంద్ర సర్వీసులలో పనిచేస్తున్న ఓ ఐపీఎస్ అధికారి నిఘా బృందానికి నేతృత్వం వహిస్తున్నాడు. ప్రతిమా శ్రీనివాసరావు, చిన్నజీయర్ స్వామీ, మై హోం రామేశ్వర్ రావు తో పాటు ఓ రియలెస్టేట్ దిగ్గజ సంస్థ.. ఓ ఫార్మా ఇండస్ట్రీ ఓనర్ వివరాలు సేకరిస్తున్నారు. జనవరి 15నాడు కేంద్ర నిఘాబృందానికి రాష్ట్రంలోని ఓ ఐపీఎస్ అధికారి కొన్ని కీలక ఫైళ్లు అప్పగించినట్టు తెలుస్తుంది.
విదేశాలకు డబ్బుతరలింపు..?
ఇప్పటికే కేసీఆర్ ఫ్యామిలీ విదేశాలకు డబ్బులు చేరవేసే పనిమొదలు పెట్టినట్టు పక్కాసమాచారం అందుకున్న కేంద్రం గతకొన్నిరోజులుగా కేసీఆర్ ఫ్యామిలీ విదేశీ టూర్లపై నిఘాపెట్టినట్టు తెలుస్తుంది.. దుబాయ్.. హాంకాంగ్ తో పాటు కొన్ని యూపర్ దేశాల్లో జరిగిన లావాదేవీల వివరాలు రాబడుతున్నట్టు తెలిసింది. వేలాది కోట్ల రూపాయల సంపదను హవాలా రూపంలో కాకుండా మరో రూపంలో నుండి తరలిస్తున్నట్టుగా కేంద్రం సమాచారం సేకరించింది..
డేటా సెంటర్ల పై నిఘా
హైదరాబాద్ లో కొత్తగా కొన్ని డేటా సెంటర్లు రాబోతున్నాయంటూ ఇటీవల కేసీఆర్ కొడుకు చేసిన ప్రకటనకు.. అక్రమ సొమ్ము తరలింపునకు ఉన్న లింకులపై ఆరాతీస్తున్నారు.. రీసెంట్ గా జరిగిన 2660 కోట్ల రూపాయల విలువైన ట్రాన్స్ సాక్షన్ పై నిఘావెసి ఉంచినట్టు తెలస్తుంది.. డాటా సెంటర్ల పేరుతో హవాలాకు మరో రూపం కనుగొన్నట్టు తెలుసుకున్న కేంద్ర నిఘా సంస్థలు ఆదిశగా ఆధారాలు సేకరింస్తున్నట్టు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తుంది.. మార్చి రెండో వారం కల్లా కేంద్రం చేతికి పూర్తిస్థాయి నివేదిక అందించనున్న నిఘా బృంధం.. మూడో వారంలో కీలక పనికి తెరలేపబోతున్నట్టు సమాచారం.

ఈ కేసులో తీగలాగితే డొంక కదిలింది. లోతుగా విచారణ చేస్తే మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు ముంబయిలో పట్టు బడిన టోనీని హైదరాబాద్ కి తీసుకొచ్చారు. ఇక్కడ విచారణ చేయగా పలు కీలక అంశాలు వెల్లడించాడు. హైదరాబాద్కు చెందిన పలువురు వ్యాపారవేత్తలకు తాను డ్రగ్స్ అమ్మినట్టు చెప్పాడు. నిరంజన్ కుమార్ జైన్, శాశ్వత్ జైన్, యాగ్యానంద్, సుమంత్ రెడ్డి, బండి భార్గవ్, వెంకట్ చలసాని, సాగర్తో పాటు… ఇద్దరు డ్రైవర్ల పేర్లు చెప్పాడు. పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. మరో నలుగురు వ్యాపారులు పరారీలో ఉన్నట్టు చెప్పారు.
