Wednesday, August 12, 2026

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సమీక్షలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి_

*నిర్ణీత గడువులోగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి కావాల్సిందే*

*ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సమీక్షలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 12:

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నిర్లక్ష్యాన్ని,పనుల్లో ఆలస్యాన్ని అస్సలు సహించేది లేదు.రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువులోగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కావాల్సిందేనని,నిర్లక్ష్యాన్ని,పనుల్లో ఆలస్యాన్ని అస్సలు సహించేది లేదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రజలకు మాట ఇచ్చాం...మాట ప్రకారం చేసి తీరాల్సిందే.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పూర్తి జవాబుదారిగా వ్యవహరిస్తుంది.అటు వైపు నిత్యం ప్రయాణించే వారికి ఏళ్ల తరబడి నరకప్రాయంగా మారిందని,అందుకోసమే 2026 దసరా నాటికి పూర్తి చేస్తామని ప్రజలకు మాట ఇచ్చాం...మాట ప్రకారం చేసి తీరాల్సిందేనని సమీక్షలో మంత్రి పునరుద్ఘాటించారు.అధికారులు మనసుపెట్టి పనిచేయండి.
మ్యాన్ పవర్ పెంచి..మూడు షిఫ్టుల్లో పనులు చేయాలి..రాత్రి వేళల్లో 11 నుండి ఉదయం 6గంటల వరకు నిరంతరాయంగా పనులు జరగాలి.కారిడార్ కింద బిటి రోడ్డు పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాల్సిందే.అటు నారపల్లి(CPRI) వైపు నుండి,ఇటు ఉప్పల్ వైపు నుండి..ఇరువైపుల లాంచింగ్ గడ్డర్లతో పనులు వేగం పెంచాలి.
ప్రతి పది రోజులకు ఒకసారి నేను స్వయంగా క్షేత్రస్థాయి పనుల పురోగతి సమీక్షిస్తా..ప్రతి రోజు వర్క్ ప్రోగ్రెస్ చూపించాలి అని అన్నారు.ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో నడుస్తున్న పనులపై మంత్రి కూలంకషంగా చర్చించారు.. సైట్ లోని కచ్చితమైన వాస్తవ పరిస్థితులు చెప్పాలని మంత్రి అధికారులు,వర్క్ ఏజెన్సీని అడిగారు.ప్రస్తుతం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 60% మేర పనులు పూర్తయ్యాయని మరో 40% పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు,వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు వివరించారు.
సైట్లో సెగ్మెంట్ తయారు చేయుటకు నాలుగు బెడ్లు,నాలుగు గ్యాంట్రీస్ తో 300మంది కార్మికులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారనీ మంత్రికి చెప్పారు అధికారులు,వర్క్ ఏజెన్సీ. ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రిపూట పనుల వల్ల మరింత సమయం పట్టే అవకాశం ఉన్నదని విజ్ఞప్తి చేసిన నిర్మాణ సంస్థ.2026 అక్టోబర్ 31 నాటికి అందుబాటులోకి తెస్తామని డెడ్ లైన్ పెట్టుకున్నాం..ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులు గురించి ఆలోచించాలన్న మంత్రి.2026 సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిందే..అధికారులు,వర్క్ ఏజెన్సీ ఆ దిశగా పనిచేయాలని స్పష్టం చేసిన మంత్రి.ఈ సమీక్షలో ఆర్ అండ్ బి సి.ఈ ధర్మారెడ్డి,పలువురు అధికారులు,నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


 .

No comments:

Post a Comment