*పిల్లలు పాఠశాలకు వెళ్లి చదువు కోవాలా? లేక వారి ప్రాథమిక హక్కుల కోసం రోడ్డెక్కి ధర్నాలు చేయాలా?*
*అనూరాధ రావు - అధ్యక్షురాలు బాలల హక్కుల సంఘం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 07:
ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్య, భద్రత, మౌలిక సదుపాయాలు అందించడం ప్రభుత్వ బాధ్యత.
కానీ ఎక్కడ చూసినా పిల్లలు సమస్యలతో సతమతమవుతున్నారు అని అనూరాధ రావు (అధ్యక్షురాలు బాలల హక్కుల సంఘం) అన్నారు.తాగునీరు లేక, క్లాస్ రూం పై పెచ్చులు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితుల్లో కొన్ని పాఠశాలలు, శుభ్రమైన నీటి వసతి గల టాయ్ లెట్స్ లేని పాఠశాలలు,కొన్ని పాఠశాలల్లో అసలు టాయ్ లెట్స్ లేవు అని అన్నారు.మన తెలంగాణా రాష్ట్రంలో టాయ్ లెట్స్ లేని పాఠశాలలు 1161, టాయ్ లెట్స్ ఉన్నా పని చేయనివి 2272 దాంతో అమ్మాయిల డ్రాపౌవుట్స్.
ఇక గురుకుల పాఠశాలల్లో పిల్లలు తరుచూ ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు.
విద్యా సంవత్సరాలు మారుతున్నాయి కానీ పిల్లల పరిస్థితి మారడం లేదు.
విసుగేత్తిన రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు, మాకు కనీస వసతులు కల్పించాలి అని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు, దాంతో రోడ్డెక్కారు. వెంటనే అధికారులు స్పందించి పనులు చేస్తాం అని హామీ ఇచ్చారు.మన తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి,2025 లో గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులు రోడ్డెక్కిన ఘటనలు ఉన్నాయి.2025 ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్లో అడ్మిట్ అయిన సంఘటనలు 886....48 విద్యార్థులు చనిపోయారు.కారణం ఆహార నాణ్యత లేకపోవడం, అపరిశుభ్రమైన వంట గది/ స్థలం, ఆహార నిల్వ ప్రదేశం అపరిశుభ్రంగా ఉండటం, ఈగలు దోమల వాలిన ఆహారం ఇవ్వడం వల్ల పిల్లలు డయోరియా బారిన పడడం.సరియైన నిఘా లేకపోవడం వల్ల సంఘటనలు పునరావృతం అవుతున్నాయి.
విద్యా సంవత్సరం ప్రారంభం అయి నెల రోజులు అవుతుంది కానీ రోజు పిల్లల ఫుడ్ పాయిజనింగ్ తో హాస్పిటల్లో అడ్మిట్ అయితున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ గురుకుల పాఠశాల విద్యార్థులు కడుపు నోప్పి, వాంతులతో అచ్చంపేట ఆసుపత్రిలో చికిత్స పొందారు జులై 9న.కామారెడ్డి, బెల్లంపల్లి, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స పొందారు. ఈ వార్తలు రోజు మనం వార్తా పత్రికలలో చూస్తున్నాం, అధికారులకు సమాచారం ఉన్నా ఏం చర్యలు తీసుకోవడం లేదు.పిల్లలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు అని అంటే, వారి పరిస్థితిని అర్థం చేసుకోలేని విద్యావ్యవస్థ, ప్రభుత్వం. మనకు మన ముఖ్యమంత్రి గారే మన విద్యాశాఖ మంత్రి. ఎన్నో హామీలు వేదికల పై ఇస్తున్నారు, నాకు వారు ఓటు బ్యాంకు కాదు, అందరికి విద్య అందేలా చూడడం నా బాధ్యత అని చెపుతున్నారు.కానీ పిల్లల సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి.ముఖ్యంగా గురుకులాల్లో చదువుకునేది పేద వెనుక బడిన కుటుంబాల పిల్లలు.వారికి నాణ్యమైన విద్య, మంచి భోజనం,వసతి సౌకర్యాలు ఉండేలా ఈ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. కానీ సమస్యలు అనేకం.వారు ధర్నాలు చేసినా, హాస్పిటల్ పాలు అయిన పట్టించుకునే అధికారులు ఎక్కడ? పిల్లల ప్రాథమిక హక్కులకు భంగం కలిగింది. మంచి పోషకాహారంతో భొజనం నాణ్యమైన విద్యను పొందడం వారి హక్కు.ఈ పరిస్థితులకు కారణం అయిన అధికారుల పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి, వారికి కనీస సౌకర్యాలు వసతులు ఉండేలా చూసుకోవాలి, అంటే మంచి నీరు,పోషకాహరం, శుభ్రమైన నీటి వసతి గల టాయ్ లెట్స్, నాణ్యమైన విద్య అందేలా చూడడం ప్రభుత్వ బాధ్యత.అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు ఆకస్మిక తనిఖీలు ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్వహించాలి, అక్కడ విద్యార్థులతో వారి సమస్యలు చర్చించి, పరిష్కారించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్.
No comments:
Post a Comment