*అమెరికా రాయబారి సెర్జియో గోర్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 06:
భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీసాల అంశంతో పాటు అమెరికా - తెలంగాణ సంబంధాల బలోపేతానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న భాషల్లో తెలుగు ఒకటని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు.
తెలంగాణ - అమెరికా సంబంధాల పరిధిని అన్ని రంగాల్లో మరింత విస్తరించేందుకు అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని రాయబారి సెర్జియో గోర్ హామీ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఆప్త మిత్రుడిగా నిలుస్తున్నందుకు రాయబారి సెర్జియో గోర్ కు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment