Tuesday, August 25, 2026

తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ #TGFDC ఆధ్వర్యంలో ’యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఛాలెంజ్‌ 2026 - సీజన్ 2’_

*బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ #TGFDC ఆధ్వర్యంలో ’యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఛాలెంజ్‌ 2026 - సీజన్ 2’ పోటీలు* 

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 24:

బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ #TGFDC ఆధ్వర్యంలో ’యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఛాలెంజ్‌ 2026 - సీజన్ 2’ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎఫ్‌డీసీ ఎండీ జి. ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రెయేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్ బాబుతో కలిసి ఆవిష్కరించారు.రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్‌ ఫిల్మ్, పాటల పోటీలు ఉంటాయన్నారు. ఈ సారి కొత్తగా జానపద పాటలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోస్, వ్యాసాలు (ఆర్టికల్స్) కు చోటు కల్పించామని తెలిపారు.గత ఏడాది నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌కు విశేష స్పందన లభించిందని,  500కు పైగా లఘు చిత్రాలు, బతుకమ్మ పాటలు వచ్చాయన్నారు. ఈ సంవత్సరం కూడా యువ ప్రతిభావంతులు పోటీలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ పోటీలు యువతకు భవిష్యత్తులో సినీ రంగంలో అవకాశాలను సృష్టించడానికి, సృజనాత్మక కంటెంట్‌కు వేదికగా నిలుస్తాయి. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, పండగలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రాచుర్యం పొందేందుకు దోహదం చేస్తాయని ఈ పోటీలను నిర్వహిస్తున్నారు అని అన్నారు.లఘు చిత్రాల నిడివి 3 నిమిషాలు, పాటల రన్‌టైమ్‌ 5 నిమిషాలకు మించకూడదు అని ఆయా వీడియోలు 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి అని అన్నారు. ఆసక్తి కలిగిన వారు వాటిని 2026 సెప్టెంబర్ 15లోపు youngfilmmakerschallenge@gmail.com మెయిల్‌కు గానీ, 8125834009 వాట్సాప్ నంబరుకు గానీ పంపాలి అని అన్నారు. అనంతరం నిపుణులతో కూడిన జ్యూరీ విజేతలను ప్రకటిస్తుంది.ఈ పోటీలలో ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. 2 లక్షలు, తృతీయ బహుమతి రూ. 1 లక్ష. మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతిగా రూ. 20 వేల చొప్పున అందించనున్నారు. ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేస్తారు.

No comments:

Post a Comment