Tuesday, August 11, 2026

రామంతాపూర్ చిన్నచెరువు కట్ట కింద ఉన్న శ్రీ శ్రీ శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో ఘనంగా బోనాల పండుగ సంబురాలు_

*రామంతాపూర్ చిన్నచెరువు కట్ట కింద ఉన్న శ్రీ శ్రీ శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో ఘనంగా బోనాల పండుగ సంబురాలు*

*అమ్మవారి పూజాకార్యక్రమం లో పాల్గొన్న బాపట్ల పుష్పలత*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 09:

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ చిన్నచెరువు కట్ట కింద ఉన్న పురాతన శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ దేవాలయంలో వైభవంగా అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్దలతో బోనాలు సమర్పించించారు.పదకొండు సంవత్సరాల క్రితం ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం ఇప్పించిన దాత స్వర్గీయ బిక్షపతి గారి కుటుంబ సభ్యులకు సన్మానం చేసిన అర్జున్, మధు మరియు బాపట్ల పుష్పలత. ఈ కార్యక్రమంలో ఈ దేవాలయ చైర్మన్ యాదగిరి మరియు కుటుంబసభ్యులు స్థానికులు పాల్గొన్నారు.బోనాల పండుగ అనేది తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఆషాఢ మాసంలో మహాకాళి అమ్మవార్లను (పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ తదితరులు) పూజిస్తూ అత్యంత వైభవంగా జరుపుకునే జానపద సంప్రదాయ రాష్ట్ర పండుగ. ‘బోనం’ అనగా భోజనం లేదా నైవేద్యం అని అర్థం. అమ్మవారికి కృతజ్ఞతగా మహిళలు వంటకం సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ వైభవంగా జరుగుతుంది.

No comments:

Post a Comment