*"హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం"*
*హైదరాబాద్ జిందాబాద్ కల్చరల్ ఫెస్టివల్ ప్రచార పోస్టర్ ఆవిష్కరించిన సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి.*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 12:
80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో "కల్చరల్ ఫెస్టివల్ - 2026" ఆగష్టు 16 న రవీంద్ర భారతి మెయిన్ హాల్ లో జరగబోతున్నది. ఈ కల్చరల్ ఫెస్టివల్ కు సన్నాహంగా ప్రచార పోస్టర్ ను రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి ఆవిష్కరించారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి కె. వీరయ్య మాట్లాడుతూ హైదరాబాద్ జిందాబాద్ 2018 నుండి ప్రతి సంవత్సరం రవీంద్ర భారతిలో కల్చరల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, హైదరాబాద్ భిన్న సంస్కృతుల సమ్మేళనం అనే స్ఫూర్తి, స్వాతంత్రోద్యమ, భారత రాజ్యాంగ స్ఫూర్తితో కళా ప్రదర్శనలు ఉంటాయని అన్నారు.80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో జోనల్ స్థాయి హైస్కూల్ విద్యార్థుల పోటీలు ముఖ్యంగా వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్, పాటల పోటీలు నిర్వహించడం జరిగింది అన్నారు.ఇందులో విజేతలుగా గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు రవీంద్ర భారతిలో జరుగబోయే కల్చరల్ ఫెస్టివల్ లో బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుంది అని అన్నారు.ప్రఖ్యాత కళాకారులు గురు స్వామి పేరడి, రవూఫ్ స్టాండ్ అప్ కామెడీ, చొక్కాపు వెంకటరమణ మేజిక్ షో, మౌనిక పప్పేట్ షో, క్రాంతికార్ వెంట్రీలాక్విజం, రామడుగు వసంత్ మైమ్ షో లాంటి ఆకర్షనీయ ప్రదర్శనలున్నాయని అన్నారు. ది ట్రయిల్ ఆఫ్ భగత్ సింగ్, సే నో టు డ్రగ్స్, ఆర్గాన్ డొనేషన్ పై స్కిట్స్ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ ప్రదర్శనలు కూడా ఉన్నాయని, దేశభక్తి చాటేలా నృత్య ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. మొత్తం 16 ప్రదర్శనలలో 180 మంది కళాకారులు పాల్గొంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిందాబాద్ ఉపాధ్యక్షులు మల్లం రమేష్, పి.శ్రీనివాసరావు, పాండవుల నాగేశ్వరావు, మోహన్ నాయుడు, గోపాల్ జాయింట్ సెక్రటరీలు సంగీత, కె.లలిత, కె.రమేష్ నాయకత్వం వహించారు.
No comments:
Post a Comment