Sunday, August 23, 2026

పాలిటెక్నిక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - తెలంగాణ ప్రభుత్వం_

*పాలిటెక్నిక్ కళాశాలలను అత్యుత్తమ ప్రమాణాలతో అప్‌గ్రేడ్ చేస్తున్నాము*

*పాలిటెక్నిక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - తెలంగాణ ప్రభుత్వం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 22:

పాలిటెక్నిక్ విద్యార్థులకు విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పాలిటెక్నిక్ విద్యలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో పాటు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల విధానం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. శాఖ మార్పు వల్ల పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించిన సర్వీసు నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని వెల్లడించింది.పాలిటెక్నిక్ కళాశాలలను అత్యుత్తమ ప్రమాణాలతో అప్‌గ్రేడ్ చేసేందుకు, అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం వాటిని శక్తి శాఖతో అనుసంధానం చేసినట్లు పేర్కొంది. ఆధునిక సౌకర్యాలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్ది, కోర్సులు పూర్తి చేసిన తర్వాత వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు, అత్యుత్తమ వేతనాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, పాలిటెక్నిక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

No comments:

Post a Comment