*హైదరాబాదు నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం*
*తెలంగాణ రాష్ట్రంలో కళలను ప్రోత్సహిస్తున్నాం - సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు.*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 16:
హైదరాబాద్ జిందాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రవీంద్రభారతి మెయిన్ హాల్లో కల్చరల్ ఫెస్టివల్ 2026 వైభవంగా జరిగింది. 16 రకాల కళా రూపాలను సుమారు 170 మంది కళాకారులు ప్రదర్శించారు.ఈ కల్చరల్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరైన సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ప్రజలలో చైతన్యాన్ని కల్పించేలా కళారూపాలను ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అందులో హైదరాబాద్ జిందాబాద్ లాంటి సంస్థలను కూడా భాగస్వాములను చేస్తామని అన్నారు. హైదరాబాద్ జిందాబాద్ లాంటి పౌర సంస్థలు మెడికల్ ఉచిత మెడికల్ క్యాంపులు, పర్యావరణ పరిరక్షణ మొదలగు అంశాలపై కృషి చేస్తూ ప్రజలకు తమ వంతు సహకారాన్ని, సేవలను అందిస్తున్నందుకు అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కళాభివృద్ధికి చేస్తున్న కృషిని సోదాహరణంగా వివరించారు.
ఈ కల్చరల్ ఫెస్టివల్ లో "ది ట్రైల్ ఆఫ్ భగత్ సింగ్" డ్రామా మరియు ప్రగతి నగర్ విద్యార్థులు ప్రదర్శించిన "సే నోటు డ్రగ్స్" "ఆర్గాన్ డొనేషన్ లపై స్కిట్" లు సందేశాత్మకంగా, ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఓం డాన్స్ అకాడమీ, అంబేద్కర్ కాలేజీ కళాబృందాలు వేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకర్షించాయి. కురుగంటి కళాక్షేత్రం సాంప్రదాయ భరతనాట్యం ప్రఖ్యాత కళాకారులు గురు స్వామి పేరడీ, రవుఫుద్దీన్ స్టాండప్ కామెడీ, శివ ప్రసాద్ మిమిక్రీ, రామడుగు వసంత్ మైమ్ షో, మౌనిక పపెట్ షో ప్రేక్షకుల మన్ననలు పొందాయి. తానల్ మలయాళీ సేవాసమితి కేరళ సాంప్రదాయ తిరువతిర నృత్యం ప్రేక్షకులను ఆకర్షించింది.ఈ సందర్భంగా హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో సుమారు 100 హైస్కూల్స్ లలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, డ్రాయింగ్, పాటల పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజినల్ ఉపాధ్యక్షులు మురళీకృష్ణ , పర్యావరణవేత్త డాక్టర్ జయ సూర్య, హ్యాపీ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రాజశేఖర్, ప్రముఖ టీవీ నటులు మలక్పేట శైలజ గారు హాజరై బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిందాబాద్ అధ్యక్ష కార్యదర్శులు ఎం. శ్రీనివాసరావు, కె.వీరయ్య ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరావు, పి.నాగేశ్వరరావు, మోహన్ నాయుడు , సంగీత, శ్రీవల్లి, మాధవి సుకుమార్, రాజమౌళి, నాగేష్, శంకర్ లు కార్యక్రమ నిర్వహణకు నాయకత్వం వహించారు.
No comments:
Post a Comment