Wednesday, December 21, 2022

అతను ఓ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి..ఈ పైత్యం ఇంకా ఎన్నాళ్ళు.?

*_ఓ శ్రీనివాసా...! ఏందీ పని.!!_*
_● ఈ ప్రదక్షిణలు ఏంటి.?_
_● ఆ కాళ్ళు మొక్కుట ఏంది?_
_● ఈ పైత్యం ఇంకా ఎన్నాళ్ళు.?_
_● ఎమ్మెల్యే టిక్కెట్ కోసమేనా.?_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*

[ *_"ఏసుక్రీస్తు" గురించి... హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యల👇 EXCLUSIVE వీడియో_*

*https://youtu.be/QXMDLRxo8Sc* ]

*_అతను ఓ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి. ఒకసారి స్వయం ప్రకటిత దేవత చుట్టూ ప్రదక్షిణలు. మరోసారి రెండు నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు సిఎం కాళ్ళు మొక్కటం. ఇప్పుడు ఏకంగా ఒక మత ఉత్సవ వేడుకల్లో వివాదాస్పద వ్యాఖ్యలు. ఇంతకీ అతను ఎవరు అనుకుంటున్నారా..? ఆయనకు లేని మొహమాటం మనకు ఎందుకు.? ఆయనే... గౌరవనీయులైన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు._*

*_వివాదాలను వాటేసుకొని..:_*
నిత్యం వివాదాల్లో ఉండాలని కోరుకుంటారో ఏమోగానీ.. ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీతో వార్తల్లో నిలుస్తుంటారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. ఈమధ్యే సీఎం కేసీఆర్ కాళ్లపై పడి ఈయన విమర్శల పాలయిన విషయం తెలిసిందే.

*_అసలేం జరిగింది.?:_*
భద్రాద్రిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అందరినీ నవ్వుతూ పలకరించారు. తర్వాత మైక్ అందుకున్న డీహెచ్.. క్రైస్తవంపై వీర లెవల్ లో స్పీచ్ ఇచ్చారు. ఇప్పుడా కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి.

*_హేమిటో... ఇది..:_*
దేశాభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమని చెప్పారు డీహెచ్. ఏసుక్రీస్తు దయవల్లే కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని తెలిపారు. అసలు.. క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందన్నారు. ‘‘ఏసు నామాన్ని అనునిత్యం స్మరిస్తూ.. ఆ దేవుణి సందేశాన్ని ప్రతి ఒక్క గుండెకు, గడపకు చేరేలా చెయ్యాలి. ఇంతకుముందు జరుపుకున్న క్రిస్మస్‌ లు వేరు. ఇప్పుడు జరుపుకుంటున్న క్రిస్మస్‌ లు వేరు. గత రెండున్నర సంవత్సరాల నుంచి ప్రపంచ మానవాళికి కరోనా ప్రశ్నార్థకంగా మారింది. దాని నుంచి మనం ఇవాళ పూర్తిగా విముక్తి అయ్యాం. అది మనం చేసిన సేవల వల్ల కాదు. ఏసుక్రీస్తు కృప, ఆయన యెుక్క దయ ప్రభావం’’ అని వ్యాఖ్యానించారు.

*_రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ..రచ్చ:_*
డీహెచ్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. నిజానికి డీహెచ్ కు వివాదాలు కొత్తేం కాదు. గతంలో ఖమ్మంలో వింత పూజలు చేసి వార్తల్లో నిలిచారు. దేవతగా ప్రకటించుకున్న టీఆర్‌ఎస్‌ ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇటీవల ప్రగతి భవన్ లో కేసీఆర్ కాళ్లపై పడ్డారు. నిమిషం వ్యవధిలోనే రెండు సార్లు కాళ్లు మొక్కారు. డీహెచ్ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతూనే ఉన్నాయి.

*_టికెట్ కోసమే ఈ పాట్లా..?:_*
ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని.. ప్రభుత్వ అధికారినని మర్చిపోయి.. బీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కొంతకాలంగా కొత్తగూడెంలో డీహెచ్‌ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసమే ఆయన ఇలా చేస్తున్నారనే విమర్శలున్నాయి.

Tuesday, December 20, 2022

కరినగర్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి

We want traffic signals.

కరినగర్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలనీ 3 సంవత్సరాలుగా పోరాడుతున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. 2019 నుండి అప్పటి సీపీ కమలాసన్ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ ఐఏఎస్ గారు ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తాం సిగ్నల్స్ ఏర్పాటు చేస్తాం అని చెప్తూ వోచారు ఇప్పటి మేయర్ తదితరులు కూడా అదే మాట చెప్తున్నారు కానీ పని మాత్రం జరగడం లేదు. పైగా అనవసరంగా కూడలిలలో అడ్డం పొడవు పెద్ద పెద్ద సర్కిల్స్ ఏర్పాటు చేసి వాటిని మల్లి మల్లి చిన్నగా చేయడం ప్రజా దానం వృధా చేయడం దారుణం. ఇప్పుడు కూడా గీతాభవన్ చౌరస్థా 1 టౌన్ ముందు మల్లి సర్కిల్స్ చిన్నగా చేసే పని పెట్టుకున్నారు. ఆ పనిలో పని సిగ్నల్స్ ఏర్పాటు చేయవలసిందిగా బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి తోట శివ శంకర సాయినాథ రావు డిమాండ్ చేస్తూ బస్టాండ్ చౌరస్తా లో నిరసన చేపట్టడం జరిగింది అధికారులు పట్టించుకోని యెడల రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమం చేయవలసి ఉంటుంది అని హెచ్చరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో శివ శంకర సాయినాథ రావు తో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన కిరణ్ గారు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ( కరీనగర్ bjym అసెంబ్లీ ఇంచార్జీ) ధీరజ్, నీకేష్, సాయి కిరణ్, మని తేజ, సాయి చరణ్ తేజ్, రాజేష్ , సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

ఉప్పల్ లో మేయర్ విజయలక్ష్మి కీ నిరసన సెగ....!

*ఉప్పల్ లో మేయర్ విజయలక్ష్మి కీ నిరసన సెగ....!*

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఉప్పల్ నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. చిలుకానగర్‌ డివిజన్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో రసాభాస చోటుచేసుకుంది.మేయర్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్‌ బన్నాల గీత ప్రవీణ్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డిని పిలవకుండా ఎలా శంకుస్థాపనలు చేస్తారంటూ మేయర్‌ విజయలక్ష్మిని స్థానిక బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. మేయర్‌ ప్రోటోకాల్ పాటించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేయర్‌ విజయలక్ష్మి తీరుకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే అనుచరులు, మేయర్‌ వర్గం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు వర్గాలు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నాయి. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ నిధులతో చేస్తున్న కార్యక్రమాలకు ఎమ్మెల్యేను పిలవాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహించారు. ప్రోటోకాల్‌తో తనకు సంబంధం లేదని, అది అధికారుల పనంటూ శంకుస్థాపన చేయకుండానే మేయర్ వెనుదిరిగారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, December 19, 2022

ఎమ్మెల్యేల సమావేశంపై అధిష్టానం.... ఆరా

*ఎమ్మెల్యేల సమావేశంపై అధిష్టానం.... ఆరా*

హైదరాబాద్‌: ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో మేడ్చల్‌ జిల్లా ఎమ్మెల్యేలు నిర్వహించిన సమావేశంపై అధిష్ఠానం ఆరా తీసింది. సమావేశంలో చర్చించిన అంశాలు, వారు మీడియాతో మాట్లాడుతూ చేసిన విమర్శలను విశ్లేషించింది. వాస్తవంగా మైనంపల్లి ఇంట్లో విందుకే వారంతా హాజరయ్యారని, తర్వాత మల్కాజిగిరి ఎంపీ స్థానానికి భారాస అభ్యర్థిత్వం కోసం మద్దతు సమీకరించే క్రమంలో మైనంపల్లి సమావేశం నిర్వహించారని అధిష్ఠానం తెలుసుకుంది. ఈ భేటీకి మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతి కూడా కారణమనే అంచనాకు వచ్చింది. ఈ పరిణామాలపై చర్చించేందుకు త్వరలోనే మంత్రి, ఎమ్మెల్యేలకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ఆయన మేడ్చల్ కే మంత్రి కాదు....మల్లారెడ్డి పై 5 గురు ఎమ్మెల్యేల అసంతృప్తిగళం...!

*ఆయన మేడ్చల్ కే మంత్రి కాదు....మల్లారెడ్డి పై 5 గురు ఎమ్మెల్యేల అసంతృప్తిగళం...!*

హైదరాబాద్‌: మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్‌ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తగళం వినిపించారు. పదవులన్నింటినీ సొంత నియోజకవర్గం మేడ్చల్‌కే తీసుకెళ్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.దూలపల్లిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో ఐదుగురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప్పల్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వివేకానంద్‌ తదితరులు పాల్గొన్నారు.అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ తమ సమావేశానికి ప్రత్యేక కారణం లేదంటూనే మంత్రి మల్లారెడ్డి వైఖరిని తప్పుబట్టారు. నామినేటెడ్‌ పదవులన్నీ మేడ్చల్‌కే తీసుకెళ్తున్నారని.. తమ నియోజకవర్గాల కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడాలని సీఎం కేసీఆర్‌ పదేపదే చెప్పినా మంత్రి ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. వచ్చిన వాళ్లకే పదవులు వస్తున్నాయని.. ప్రొటోకాల్‌ కూడా పాటించడం లేదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అసహనం వ్యక్తం చేశారు. ఒక్కో వ్యక్తి మూడు నాలుగు పదవులు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. పదవులు వచ్చిన వాళ్లకే మళ్లీ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. '' పార్టీ కార్యకర్తలకు పదవులు రావాలనే మేం అడుగుతున్నాం. కొన్ని అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకే మేం మాట్లాడుతున్నాం. కొందరు మంత్రులు వాళ్ల వ్యక్తులకే నాలుగు పదవులు ఇప్పించుకుంటున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు మమ్మల్ని నిలదీస్తున్నారు. మంత్రుల వ్యక్తులకే పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు.'' అని అసహనం వ్యక్తం చేశారు. తమ సమస్యకు కారణమే మంత్రి మల్లారెడ్డి.. మళ్లీ ఆయన్ను ఎలా పిలుస్తామని అన్నారు. కొత్త వ్యక్తులకు పదవులు ఇస్తే అభినందిస్తామన్నారు. సమావేశం అంతర్గత విషయాలు బయటకు వెళ్లాయని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. మాపై పార్టీ వ్యతిరేక ముద్ర వేసేందుకు ఎవరో కుట్ర చేశారని ఆయన తెలిపారు. జిల్లా నాయకత్వం వైఫల్యాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు

*సుజీవన్ వావిలాల*🖋️

Saturday, December 17, 2022

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
మానవహక్కుల వేదిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తొమ్మిదవ సంయుక్త మహాసభలు శనివారం (17 డిసెంబర్ 2022న) నిజామాబాద్ పట్టణంలో ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే మహాసభలలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం, ఫాసిస్టు ప్రమాదాన్ని ఎదుర్కోవడం అనే అంశాల మీద చర్చ జరుగుతుంది. 
మహాసభల ప్రారంభ సదస్సులో ప్రజాస్వామ్యం మీద హిందుత్వ దాడి అనే అంశం మీద రచయిత, రాజకీయ వ్యాఖ్యాత, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత శాఖ మాజీ అధ్యక్షుడు ఆకార్ పటేల్ ప్రసంగించారు. సామాజిక ఐక్యత, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే దిశగా దేశం అడుగులు వేయడం 2014 లో మొదలయ్యిందని ఆయన అన్నారు. 
“ పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కంటే తలసరి స్థూల ఆర్థిక అభివృద్ధి విషయంలో మన దేశం తొలిసారి వెనుకబడింది. 2018 నుంచీ ఆరు శాతం పైనే నిరుద్యోగం తచ్చట్లాడుతూ ఉంది. శ్రామికులకు పని లభ్యత విషయానికి వచ్చేసరికి దక్షిణాసియాలోనే హీనమైన స్థితిలో ఉన్నాము” అని ఆకార్ పటేల్ అన్నారు.
 దేశంలో గణనీయమైన సంఖ్యలో నివసిస్తున్న ముస్లింలను రాజకీయాలలోకి రానీయకుండా తొక్కిపట్టడాన్ని ఆకార్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్నీ, అలాగే ఆ పార్టీ పార్లమెంటు సభ్యుల్లో,  శాసనసభ్యుల్లో కూడా ఒక్క ముస్లిం కూడా లేకపోవడాన్నీ ఆయన ఎత్తిచూపారు. ట్రిపుల్ తలాక్, గొడ్డు మాంసం వంటి సాంస్కృతిక, ఆచార, జీవన వ్యవహారాలలో వారిని నేరస్తులను చేసే ప్రయత్నాలను ఆయన విమర్శించారు. భారత రాజ్యాంగ విలువలను పక్కకు నెట్టి  హిందుత్వ రాజకీయాలు ప్రమాదకర మార్గాన్ని పట్టాయని అన్నారు.
ఆర్థిక, సామాజిక వ్యవస్థల గమనంలో వస్తున్నఈ మార్పులను గనుక పౌర సమాజం ప్రతిఘటించకపోతే అవి కొనసాగుతూనే ఉంటాయని ఆకార్ పటేల్  అభిప్రాయపడ్డారు.    
ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అధ్యాపకుడు ఆకాష్ పోయెం ‘విధ్వంసం అవుతున్న ఆదివాసీ సంస్కృతి’  అనే అంశం మీద ప్రసంగించారు. “ ఆదివాసీ ప్రాంతాలలో ఆర్ ఎస్ ఎస్ అడుగుపెట్టక ముందే హిందూ సంస్కరణ ఉద్యమాలు అక్కడ హైందవీకరణను మొదలుపెట్టాయని అన్నారు. కేంద్రంలో బీజీపీ అధికారంలోకి వచ్చాక వనవాసి కళ్యాణ్ ఆశ్రం వంటి సంఘాలు ఈ ప్రాంతాల్లో బలపడ్డాయని అన్నారు. ఆదివాసులను సహజ వనరులకు దూరం చేసే ప్రయత్నాలను ఆయన ప్రస్తావించారు. పారిశ్రామికీకరణ, గనుల తవ్వకం వంటి వినాశక యత్నాలకు వ్యతిరేకంగా ఆదివాసులు ఉద్యమిస్తున్నారని చెప్పారు. ఆదివాసుల సంస్కృతినీ, ఆచారాలనూ అర్థం చేసుకోకుండా ఆ ప్రాతాలలో బ్రాహ్మణీయ భావజాల వ్యాప్తిని, పెట్టుబడిదారుల వనరుల ఆక్రమణనూ  అడ్డుకోలేమని అభిప్రాయపడ్డారు.
సామాజిక కార్యకర్త, పరిశోధకురాలు ఉషా శ్రీలక్ష్మి  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన తర్వాత తలెత్తుతున్న భూసమస్యలను గురించి మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా భూయాజమాన్యానికి సంబంధించి విభజనకు ముందు ఉన్న అసమానతలు మరింత పెరిగాయని ఉషా  సీతాలక్ష్మి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతుబంధు, రైతుబీమా, భూమి రికార్డుల డిజిటీకరణ, హరితహారం వంటి పథకాల/ విధానాల పర్యవసానాలను ఆమె వివరించారు.
మానవహక్కుల వేదిక బాధ్యులు ఎస్. జీవన్ కుమార్,  గొర్రె పాటి. మాధవరావు, ఎ. చంద్రశేఖర్, ఎస్. తిరుపతయ్య,  జిల్లా అధ్యక్షులు గడ్డం గంగులు,  కార్యదర్శి పి .సరిత తదితరులు పాల్గొన్నారు. 
ఫోటో కాప్షన్ : మానవహక్కుల వేదిక తొమ్మిదవ మహాసభల సందర్భంగా ప్రసంగిస్తున్న రచయిత, రాజకీయ విశ్లేషకుడు ఆకార్ పటేల్.

Courtesy by : మానవ హక్కుల వేదిక (HRF)

Friday, December 16, 2022

ఉభయ రాష్ట్రాల మానవ హక్కుల వేదిక 9వ.మహాసభలు,

మిత్రులకు,
నమస్తే.
ఉభయ రాష్ట్రాల  మానవ హక్కుల వేదిక 9వ.మహాసభలు,
*డిసెంబర్ 17,18 వ* తేదీలలో నిజామాబాద్ లో జరుగుతాయి.
కార్యక్రమం:
*రెండు రాష్ట్రాల ఆఫీస్ bearers 16వతేదీన నే (శుక్ర వారం) నిజామాబాద్ చేరుకుంటారు. 
ఆ రోజు ఉభయ రాష్ట్రాల పూర్తి ఎక్జిక్యూటివ్ సమావేశం ఉంటుంది.
అందులో ఉభయ రాష్ట్రాల మూడు సంవత్సరాల నివేదికను ప్రధాన కార్య దర్షులు ప్రవేశ పెడతారు.దానిపైన చర్చ జరిగిన తర్వాత,ఫైనల్ చేసి ఆ రోజు రాత్రి DTP చేయించి 18 న.జరిగే రెండు రాష్ట్రాల ప్రాథమిక సభ్యులకు అంద చేస్తారు.
*రాబోయే టర్మ్ కు రెండు రాష్ట్రాలకు సంస్థ బాధ్యులు అంటే ఆఫీస్ bearers ను సూచించి,ప్రతిపాదన తయారు చేస్తారు.ఈ ప్రతిపాదనలను 18న.జరిగే సర్వ సభ్య సమావేశంలో చర్చకు పెట్టీ approval తీసుకోవడం జరుగుతుంది.

**17,శని వారం నాడు,ముగ్గురు వక్తల ఉపన్యాసాలు ఉంటాయి.సాయంత్రం అయిదు గంటలకు నగరం లో ఊరేగింపు,తరవాత బహిరంగసభ ఉంటుంది.
వివరాలు కరపత్రం లో ఉన్నాయి.

***18 వ తేదీ,ఆదివారం సర్వ సభ్య సమావేశం ఉంటుంది.
అందులో రెండు రాష్ట్రాల కార్యదర్శులు రాష్ట్ర నివేదికలు సమర్పిస్తారు.
రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కార్యదర్శులు నివేదికలు సమర్పిస్తారు.
కార్యక్రమాలపై కొంత చర్చ ఉంటుంది.
తరవాత రెండు రాష్ట్రాల కొత్త బాడీల ప్రతిపాదన,ఎన్నిక ఉంటుంది.

సభ్యులు 17న,మరియు 18న తప్పకుండా ఉండి సభల్లో పాల్గొనాలి.
మన సిటీ నుండి ఇద్దరు సమన్వయ కమిటీ సభ్యులు, రాష్ట్ర ఉపాధ్య క్షుడి తో పాటు అందరు సభ్యులు హాజరు కావలి.
సభ్యులు తమ పేర్లను తెలిపితే అక్కడ బస ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
సభ్యులు వారి పేర్లను ఈ గ్రూప్ లో ఈ రోజు సాయంత్రం అనగా 10 డిసెంబర్ సాయంత్రం 5 గంటల కల్లా తెలియ చేయాలి.  5 గంటల వరకు వచ్చిన పేర్లను రాష్ట్ర వర్గానికి ఇవ్వడం జరుగుతుంది. 

ఆ రోజు వరకు చలి పెరుగుతుంది.
బెడ్స్ ఉంటాయి కానీ కప్పుకోవడానికి చెద్దర్(దుప్పటి),టూత్ పేస్ట్ వగైరా వెంట తెచ్చుకోవాలి.

మహిళా సభ్యులకు ప్రత్యేక బస ఏర్పాటు ఉంటుంది.
అభినందనలతో,
V.బాలరాజు,
నగర కమిటీ ప్రధాన కార్యా దర్శి.
*సంజీవ్,
*Bilal
నగర కమిటీ సభ్యులు