Wednesday, December 21, 2022

అతను ఓ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి..ఈ పైత్యం ఇంకా ఎన్నాళ్ళు.?

*_ఓ శ్రీనివాసా...! ఏందీ పని.!!_*
_● ఈ ప్రదక్షిణలు ఏంటి.?_
_● ఆ కాళ్ళు మొక్కుట ఏంది?_
_● ఈ పైత్యం ఇంకా ఎన్నాళ్ళు.?_
_● ఎమ్మెల్యే టిక్కెట్ కోసమేనా.?_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్' కోసం ప్రత్యేకం)_*

[ *_"ఏసుక్రీస్తు" గురించి... హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యల👇 EXCLUSIVE వీడియో_*

*https://youtu.be/QXMDLRxo8Sc* ]

*_అతను ఓ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి. ఒకసారి స్వయం ప్రకటిత దేవత చుట్టూ ప్రదక్షిణలు. మరోసారి రెండు నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు సిఎం కాళ్ళు మొక్కటం. ఇప్పుడు ఏకంగా ఒక మత ఉత్సవ వేడుకల్లో వివాదాస్పద వ్యాఖ్యలు. ఇంతకీ అతను ఎవరు అనుకుంటున్నారా..? ఆయనకు లేని మొహమాటం మనకు ఎందుకు.? ఆయనే... గౌరవనీయులైన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు._*

*_వివాదాలను వాటేసుకొని..:_*
నిత్యం వివాదాల్లో ఉండాలని కోరుకుంటారో ఏమోగానీ.. ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీతో వార్తల్లో నిలుస్తుంటారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. ఈమధ్యే సీఎం కేసీఆర్ కాళ్లపై పడి ఈయన విమర్శల పాలయిన విషయం తెలిసిందే.

*_అసలేం జరిగింది.?:_*
భద్రాద్రిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అందరినీ నవ్వుతూ పలకరించారు. తర్వాత మైక్ అందుకున్న డీహెచ్.. క్రైస్తవంపై వీర లెవల్ లో స్పీచ్ ఇచ్చారు. ఇప్పుడా కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి.

*_హేమిటో... ఇది..:_*
దేశాభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమని చెప్పారు డీహెచ్. ఏసుక్రీస్తు దయవల్లే కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని తెలిపారు. అసలు.. క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందన్నారు. ‘‘ఏసు నామాన్ని అనునిత్యం స్మరిస్తూ.. ఆ దేవుణి సందేశాన్ని ప్రతి ఒక్క గుండెకు, గడపకు చేరేలా చెయ్యాలి. ఇంతకుముందు జరుపుకున్న క్రిస్మస్‌ లు వేరు. ఇప్పుడు జరుపుకుంటున్న క్రిస్మస్‌ లు వేరు. గత రెండున్నర సంవత్సరాల నుంచి ప్రపంచ మానవాళికి కరోనా ప్రశ్నార్థకంగా మారింది. దాని నుంచి మనం ఇవాళ పూర్తిగా విముక్తి అయ్యాం. అది మనం చేసిన సేవల వల్ల కాదు. ఏసుక్రీస్తు కృప, ఆయన యెుక్క దయ ప్రభావం’’ అని వ్యాఖ్యానించారు.

*_రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ..రచ్చ:_*
డీహెచ్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. నిజానికి డీహెచ్ కు వివాదాలు కొత్తేం కాదు. గతంలో ఖమ్మంలో వింత పూజలు చేసి వార్తల్లో నిలిచారు. దేవతగా ప్రకటించుకున్న టీఆర్‌ఎస్‌ ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇటీవల ప్రగతి భవన్ లో కేసీఆర్ కాళ్లపై పడ్డారు. నిమిషం వ్యవధిలోనే రెండు సార్లు కాళ్లు మొక్కారు. డీహెచ్ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతూనే ఉన్నాయి.

*_టికెట్ కోసమే ఈ పాట్లా..?:_*
ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని.. ప్రభుత్వ అధికారినని మర్చిపోయి.. బీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కొంతకాలంగా కొత్తగూడెంలో డీహెచ్‌ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసమే ఆయన ఇలా చేస్తున్నారనే విమర్శలున్నాయి.

No comments:

Post a Comment