Tuesday, June 21, 2022
మూసీ ఒడ్డు పై ఇండ్లు కోల్పోయిన వారికి పట్టాలు
సమాజం ఎన్నటికీ మరువని ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్
ప్రొఫసర్ సారూ మిమ్మల్ని యాదిమరిచేట్టు చేస్తున్న దొర..... కానీ మీరు తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ వుంటారు 🎉🙏...... Bplkm🪶 prajasankalpam1.blogspot.com
Monday, June 20, 2022
విద్యాశాఖ లోని అవినీతి అధికారులు & ఉపాధ్యాయులు మీద యుద్ధం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ
Sunday, June 19, 2022
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కీలక నిర్ణయం
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కీలక నిర్ణయం
Courtesy by : తొలివెలుగు మీడియా website
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత ఐదు రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైకరిపై ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు రాత్రంతా నిరసన దీక్ష చేయాలని నిర్ణయించామని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.
2017 లోనూ తాము నిరసన చేసినా అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదని స్టూడెంట్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపస్ కు ఒకసారి వచ్చి తమ సమస్యలను పరిశీలించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ముఖ్యంగా తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించని కేసీఆర్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థులు నేరుగా సీఏం కేసీఆర్ గానీ మంత్రి కేటీఆర్ గానీ వచ్చి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే విద్యార్థుల కీలక నిర్ణయం తీసుకున్నారు. 24 గంటల నిరసన దీక్షకు పిలుపు నిచ్చారు. రాత్రంతా బయటే ఉండి నిరసనను తెలియజేయాలని నిర్ణయించారు.
తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా..... జస్టిస్ ఉజ్జల్ భూయాన్.....!
*తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా..... జస్టిస్ ఉజ్జల్ భూయాన్.....!*
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ సతీష్‌చంద్ర శర్మను బదిలీ చేసి ఆయన స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు పదోన్నతి ఇవ్వాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఆమేరకు ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్ సతీశ్‌చంద్రశర్మను దిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
link Media ప్రజల పక్షం 🖋️
పట్టువీడని విద్యార్ధులు.... బాసరలో 6 వ రోజు కొనసాగుతున్న నిరసన....!
*పట్టువీడని విద్యార్ధులు.... బాసరలో 6 వ రోజు కొనసాగుతున్న నిరసన....!*
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అటు విద్యార్థులు పట్టువీడటం లేదు... విద్యార్థులు ప్రతిపాదించిన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన పూర్తి స్థాయిలో రావడం లేదు.ఫలితంగా ఆరో రోజు కూడా బాసరలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది.
ఐఐటీ ప్రధాన ద్వారం వద్ద దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మెయిన్ గేటు వద్దకు ఎవర్నీ వెళ్లనీయకుండా పోలీసులు రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. గత ఆరు రోజులుగా బాసరలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 12 డిమాండ్లతో ఈనెల 14 నుంచి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. బాసర ట్రిపుల్ ఐటీకీ 2 కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మద్దతుగా ఇవాళ సాయత్రం నిజామాబాద్ నుంచి ఏబీవీపీ కార్యకర్తలు బాసర చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసుల ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని బాసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. మరో వైపు యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం స్వచ్ఛందంగా ఇంటికి వెళ్లే విద్యార్థులకు అనధికారికంగా అనుమతిస్తోంది. ఆరు సంవత్సరాల ట్రిపుల్ ఐటీ కోర్సులో పీయూసీ-1, పీయూసీ-2 చదువుతున్న విద్యార్థులను కుటుంబ సభ్యలకు సమాచారం ఇవ్వకుండా, వారు వెంటలేకుండా వెళ్లేందుకు అనుమతించకూడదనే నిబంధన ఉంది. కానీ, ఆరు రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో నిబంధనలను యాజమాన్యం అనధికారికంగా సడలించింది.
link Media ప్రజల పక్షం🖋️
తెలంగాణ లో విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న ప్రభుత్వం & ప్రతిపక్షాలు
*తెలంగాణా లో విద్యావ్యవస్థ నిర్లక్ష్యం అవుతుంటే ప్రతిపక్షాలు & అన్ని విద్యార్థి సంఘాలు & మేధావులు అనబడే మూర్కులు & మెయిన్ స్ట్రీమ్ మీడియా తమ బాధ్యతను నిర్వర్టిస్తలేవు..... ప్రయివేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు అనుకూలంగా వున్నారు వీరు అందరు.... ఎన్ని చట్టాలు / GO / కమిటీ లు వున్నా ప్రభుత్వాలు పట్టించుకుంటాలేవు...ఇది నిజం..... Bplkm🪶* *Copy to Group link Media*
NOTE : *తల్లితండ్రులు ప్రశ్నించేతత్వాన్ని అలవాటు చేసుకుంటాలేరు.విద్యాసంస్థల యాజమాన్యాలు బయపెడుతున్నాయి మీ పిల్లల భవిష్యత్ మా చేతిలో వుంది అని* prajasankalpam1.blogspot.com