Monday, March 14, 2022

రేపటి నుంచే 12-14 ఏళ్ల వారికి...,... టీకా

*రేపటి నుంచే 12-14 ఏళ్ల వారికి...,... టీకా*

*బయో-ఈ రూపొందించిన కోర్బెవాక్స్‌ టీకా ఇవ్వనున్నట్టు కేంద్రం వెల్లడి*

*60 ఏళ్లు దాటినవారంతా మూడో డోసు తీసుకోవడానికి అర్హులే*

*దేశంలో 12-14 ఏళ్లవారు 7.11 కోట్లు*

*5 కోట్ల డోసులు ఇచ్చిన బయో-ఈ*

*కార్యాచరణ సిద్ధం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ*

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ టీకాలు వేసే కార్యక్రమం బుధవారం (16వ తేదీ) నుంచి ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు.హైదరాబాద్‌కు చెందిన బయొలాజికల్‌-ఈ లిమిటెడ్‌ అభివృద్ధి చేసిన కోర్బెవాక్స్‌ టీకాను వారికి ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. అలాగే.. 60 ఏళ్లు దాటి, మధుమేహం, అధికరక్తపోటు వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి మాత్రమే ఇస్తున్న ముందు జాగ్రత్త (మూడో) డోసును ఇకపై 60 ఏళ్లు దాటినవారందరికీ ఇవ్వనున్నట్టు తెలిపారు. ''పిల్లలు సురక్షితంగా ఉంటే దేశం కూడా సురక్షితంగా ఉన్నట్టు. 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ టీకా కార్యక్రమాన్ని మార్చి 16 నుంచి ప్రారంభించబోతున్న విషయం తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అలాగే, 60 ఏళ్లు దాటినవారంతా ప్రికాషన్‌ డోసు వేసుకోవడానికి ఇక అర్హులే'' అని ఆయన ట్వీట్‌ చేశారు.

12-14 ఏళ్ల పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఉన్న కుటుంబాలు సత్వరమే వారికి టీకాలు వేయించాలని సూచించారు. శాస్త్రీయ సంస్థలతో విస్తృత చర్చలు జరిపిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం దేశంలో 12-14 ఏళ్లవారు (2008 నుంచి 2010 నడుమ జన్మించినవారు) 7.11 కోట్ల మంది ఉన్నారు. వీరికోసం బయొలాజికల్‌ ఈ సంస్థ ఇప్పటికే 5 కోట్ల డోసుల టీకాలను సరఫరా చేసినట్లు సమాచారం. కరోనా కేసులు గణనీయంగా తగ్గిపోయి దేశవ్యాప్తంగా పాఠశాలలన్నీ తెరుచుకుంటున్న నేపథ్యంలో కొవిడ్‌ను మరింత సమర్థంగా నియంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. రాష్ట్రంలో 12-14 ఏళ్ల పిల్లలు 17,23,000 మంది ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా బుధవారం నుంచి వారికి టీకాలు వేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు

link Media ప్రజల పక్షం🖋️ 

Sunday, March 13, 2022

బిజెపి గెలుపు లో మజ్లీస్ పాత్ర!....86 స్థానాల్లో మజ్లిస్‌కు గణనీయంగా ఓట్లు

*బిజెపి గెలుపు లో మజ్లీస్ పాత్ర!*

*86 స్థానాల్లో మజ్లిస్‌కు గణనీయంగా ఓట్లు*

*లక్నో ......*
యూపీ ఎన్నికల్లో బీజేపీ రెం డోసారి గెలవడంలో మజ్లిస్‌ పార్టీ పాత్ర ఉందా?ఆ పార్టీ వల్లే ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ ఆశలు గల్లంతయ్యాయా? యూపీలో మొత్తం 403 స్థానాలకుగాను బీజేపీ స్వయంగా 255 స్థానాల్లో, కూటమిగా 273 స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. సమాజ్‌వాది పార్టీ 111 సీట్లు, ఆర్‌ఎల్డీతో కలిసి 119 సీట్లే గెలిచింది. బీజేపీ కూటమి గెలిచిన సీట్లలో 86 మంది అభ్యర్థుల మెజారిటీ 2 వేల లోపే.

వీరిలో 49 మంది కేవలం 1000 ఓట్ల తేడాతో గెలవగా, 23 మంది 500 లోపు, ఏడుగురు 200లోపు ఓట్ల మెజారిటీ మాత్రమే సాధించారు. ఈ స్థానాల్లో పలు చోట్ల ఎంఐఎం అభ్యర్థులు బీజేపీకి వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లు పొందారు. అవన్నీ ముస్లింల ఓట్లేనని, ఎంఐఎం బరి లో లేకపోతే ఆ ఓట్లు ఎస్పీ అభ్యర్థులకే దక్కేవని, తద్వారా ఎస్పీ కూటమి గెలుపొందేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

link Media ప్రజల పక్షం🖋️ 

18,334 పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి 'ఉద్యోగ'ప్రతిపాదనలు పంపిన పోలీస్‌ శాఖ

*18,334 పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ రంగం..... సిద్ధం*

*18,334 పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి 'ఉద్యోగ'ప్రతిపాదనలు పంపిన పోలీస్‌ శాఖ*

*వారంలో గ్రీన్‌సిగ్నల్‌ లభించే అవకాశం*

*60%పైగా పోస్టులు 'లోకల్‌'లోనే భర్తీ*

*కోచింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు డీజీపీ ఆదేశం*

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన 18,334 పోస్టుల భర్తీకి పోలీస్‌ శాఖ రంగం సిద్ధం చేసింది.ఈ మేరకు నోటిఫికేషన్‌ అనుమతి నిమిత్తం ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం వారంలో గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే.. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే జరిగితే తాజా ఉద్యోగాల భర్తీలోనూ పోలీస్‌ శాఖనే ముందు నోటిఫికేషన్‌ ఇచ్చినట్లవుతుంది. ఇక ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలో తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్, సివిల్, ఆర్మ్‌డ్‌(ఏఆర్‌), కమ్యూనికేషన్‌ విభాగాల్లో భర్తీ ఉండనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 1,500కు పైగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ పోస్టులను పోలీస్‌ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. నూతన జిల్లాలు, రేంజ్‌లను దృష్టిలో పెట్టుకొని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక మిగిలినవన్నీ కానిస్టేబుల్‌ పోస్టులు కాగా, వాటిని ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌(ఏఆర్‌), టీఎస్‌ఎస్‌పీ, కమ్యూనికేషన్‌ విభాగాల్లో నియామకానికి ప్రతిపాదించినట్లు పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి.*ఇప్పటికే 28,000 పోస్టుల భర్తీ...*
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు పోలీస్‌ శాఖ దాదాపు 28,000 పోస్టులను భర్తీ చేసింది. సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్, స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌(టీఎస్‌ఎస్‌పీ), పోలీస్‌ కమ్యూనికేషన్, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ (పీటీవో) విభాగాల్లోని కానిస్టేబుల్, సబ్‌ ఇన్‌స్పెక్టర్ల భర్తీని మూడు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేశారు. తాజాగా 18,334 పోస్టుల్లో 80 శాతం కానిస్టేబుల్, 20 శాతం సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఉండనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, కొత్త సర్కిల్, పోలీస్‌స్టేషన్లకు మరింత మంది సిబ్బందిని కేటాయించేందుకు ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
*స్థానికంగానే అధికం...*
ప్రస్తుతం భర్తీ చేయాలనుకున్న పోలీస్‌ పోస్టులు 60 శాతానికి పైగా లోకల్‌ కేడర్‌లోనే భర్తీ కానున్నాయి. గతంలో పోలీస్‌ శాఖలో నాలుగు రేంజ్‌లు ఉండేవి. తాజాగా రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం.. 7 రేంజ్‌లు ఏర్పడ్డాయి. అలాగే రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏర్పడి.. కొత్త పోలీస్‌ స్టేషన్లు, సర్కిల్‌ ఆఫీస్‌ల ఏర్పాటుతో స్థానికంగా సిబ్బంది అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో సివిల్, ఏఆర్‌ (ఆర్మ్డ్‌ రిజర్వ్‌) కేటగిరీలో ఎక్కువ పోస్టులు భర్తీ చేయనున్నారు. స్పెషల్‌ పోలీస్, కమ్యూనికేషన్‌ విభాగంలోని కానిస్టేబుల్, ఎస్‌ఐ ర్యాంక్‌ పోస్టులు రాష్ట్రస్థాయి పోస్టులుగా ఉంటాయి. దీంతో ఈ పోస్టుల సంఖ్య తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, స్థానికత ఆధారంగా జరిగే మొట్టమొదటి నియామక ప్రక్రియ కూడా ఇదే కావడం గమనార్హం.
*జిల్లాల్లో కోచింగ్‌ సెంటర్లు...*
రాబోతున్న నోటిఫికేషన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రీ రిక్రూట్‌మెంట్‌ కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రవ్యాప్తంగా కమిషనర్లు, ఎస్పీలను డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశించారు. నిరుద్యోగ యువతను ప్రోత్సహించేలా ఈ సెంటర్లు ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ విభాగంతో సమన్వయం చేసుకొని ఈ కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు ఉండాలని డీజీపీ సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాలు, కమిషనరేట్లో ఉచిత ప్రీ రిక్రూట్‌మెంట్‌ కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటుచేయడం వేగవంతం చేశారు.

link Media ప్రజల పక్షం🖋️ 

టచ్ చేసి...... చూడు!

*టచ్ చేసి...... చూడు!*

హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ ఏరియాకు నీళ్లు, కరెంటు కట్‌ చేస్తామంటూ అసెంబ్లీలో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు.భారత సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించడం అత్యంత దుర్మార్గమని, ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యేనని మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ప్రసాద్‌ ల్యాబ్స్‌ లో పార్టీ నాయకులు రాజాసింగ్, డి.ప్రదీప్‌కుమార్‌ తదితరులతో కలిసి 'కశ్మీర్‌ ఫైల్స్‌'సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుtuభారత సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించడం అత్యంత దుర్మార్గమని, ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యేనని మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ప్రసాద్‌ ల్యాబ్స్‌ లో పార్టీ నాయకులు రాజాసింగ్, డి.ప్రదీప్‌కుమార్‌ తదితరులతో కలిసి 'కశ్మీర్‌ ఫైల్స్‌'సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ
*ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి....*
పాతబస్తీలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన కరెంట్‌ బిల్లులను వసూలు చేయడం చేతగాని దద్దమ్మ.. కంటోన్మెంట్‌కు కరెంటు, నీళ్లు కట్‌ చేస్తామని చెప్పడం సిగ్గు చేటు. దేశాన్ని విచ్ఛి న్నం చేసేలా మాట్లాడుతున్న కేసీఆర్‌ కుటుం బం ముమ్మాటికీ దేశద్రోహులే. కంటోన్మెం ట్‌లో కరెంట్‌ కట్‌ చేస్తారా? అసలు కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటి? కంటోన్మెంట్‌లో భూములు కబ్జాలు చేయాలి.

ఫాంహౌస్‌లు కట్టుకోవాలి. పన్నులు పెంచాలి. నిధులు మళ్లించాలి. పేద ప్రజల రక్తం తాగాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లున్నరు. కంటోన్మెంట్‌ లో సైనికులతో పాటు తెలంగాణ ప్రజలు కూడా నివాసం ఉంటారనే సోయి మర్చిపోయిండు. దేశంలో అన్ని ఉగ్రవాద సంస్థలకు నంబర్‌ వన్‌ టార్గెట్‌గా ఉన్న ప్రాంతమది. అక్కడే కరెంటు, నీళ్లు కట్‌ చేస్తరా? 'అని సంజయ్‌ ప్రశ్నించారు.

ఇలాగే దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ కుటుంబాన్ని ఉరికించి కొట్టడం ఖాయమని, వారు వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పా లని ఆయన డిమాండ్‌ చేశారు. జమ్మూ కశ్మీర్‌లో జరిగిన వాస్తవ విషయాలను 'కశ్మీర్‌ ఫైల్స్‌'లో కళ్లకు కట్టినట్లు చూపించిన నిర్మాతలను అభినందిస్తున్నామని అన్నారు.

link Media ప్రజల పక్షం🖋️

15 నుండి ఒక్క‌పూట బ‌డి..!

15 నుండి ఒక్క‌పూట బ‌డి..!

Courtesy by : తొలివెలుగు మీడియా website

ఎండాకాలం రానే వ‌చ్చేసింది. ఎప్పుడు పాఠ‌శాల‌లకు సెల‌వులు ప్ర‌క‌టిస్తారా అని చిన్న పిల్ల‌లు ఎదురు చూస్తూ రోజులు లెక్క‌పెట్టుకుంటారు. స్కూల్స్ మూసేసే స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో విద్యార్ధుల్లో ఆనందం హ‌ద్దులు దాటుతోంది.

ఈ నేప‌థ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులుంటాయి. కొన్ని ఉపాధ్యాయ సంఘాల వినతి నేపథ్యంలో గతంలో మాదిరిగానే ఒంటిపూట బడులు నడపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ క్రమంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ప్రతిపాదనలు పంపారు.

పదో తరగతి పరీక్షలు మే 20వ తేదీ వరకు జరగనున్నందున ఈ విద్యా సంవత్సరానికి అదే చివరి పనిదినం కానుంది. క‌రోనా నేప‌థ్యంలో పాఠ‌శాల‌లు లేట్ గా ప్రారంభం అయిన‌ప్ప‌టికీ.. స‌మానుకూలంగా విద్యార్ధుల‌కు సిల‌బ‌స్ పూర్తి చేసిన‌ట్టు స‌బితాఇంద్రారెడ్డి తెలిపారు.

Saturday, March 12, 2022

రాజీనామా యోచనలో సోనియా.... రాహుల్.... ప్రియాంక.....!

*రాజీనామా యోచనలో   సోనియా.... రాహుల్.... ప్రియాంక.....!*

కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల వెల్లడైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఘోర పరాభవం పొందిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో ఉండి కూడా పంజాబ్‌లో అధికారాన్ని దక్కించుకోలేకపోయింది.ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలో కూడా గెలవలేకపోయింది. అయితే కాంగ్రెస్‌ జీ23 నేతల భేటీ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ కాంగ్రెస్‌లోని తమ పదవులకు రాజీనామాలు ప్రకటించనున్నట్లు సమాచారం. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేయనున్నట్లు సమాచారం. సీడబ్ల్యూసీ భేటీలో రాజీనామాల విషయాన్ని వారు వెల్లడించే అవకాశం ఉంది.

కాగా 5 రాష్ట్రాల ఎన్నికల పరాజయాలపై చర్చించేందుకు ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశం కాబోతోంది. ఈ భేటీకి సోనియా గాంధీ అధ్యక్షత వహించనున్నారు. ఇప్పటికే ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా పంజాబ్‌లోనూ అధికారం పొగొట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇక మిగిలిన రెండు రాష్ట్రాలు రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు భవిష్యత్ వ్యూహంపై చర్చించేందుకు సీడబ్ల్యూసీ నేతలు భేటీ కానున్నారు. వర్చువల్ విధానంలో జరిగే సీడబ్ల్యూసీ భేటీలో సోనియా గాంధీ,రాహుల్ గాంధీతో పాటు దిగ్విజయ్ సింగ్, ఏకే ఆంటోనీ, ఇతర నేతలు కూడా పాల్గొంటారు. అలాగే సీడబ్ల్యూసీలో ఉన్న జీ23 నేతలు కూడా ఈ భేటీలో తమ అభిప్రాయాలు వెల్లడించబోతున్నారు.మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాజీనామాలు చేస్తారనే వార్తలను ఆ పార్టీ ఖండించింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత, అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు. రాజీనామా చేయడం పూర్తి అవాస్తవమని, ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Friday, March 11, 2022

తెలంగాణ నిరుద్యోగులు మరో సారి మోసపోవద్దు .

తెలంగాణ నిరుద్యోగులు మరో సారి మోసపోవద్దు .
ఉద్యోగ భర్తీ ప్రక్రియకు  Deadline లేకుండా కేవలం ఎన్నికల స్టంట్ గా తీస్కొచ్చి మరోసారి మోసం చేయడానికి సిద్ధం అయ్యారు పాలకులు.
ఎప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో చెప్పే దమ్ము ఉందా ...?
మెజారిటీ ప్రజల ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వం.ఆ ప్రజల కొరకు పని చేయడం దాని కర్తవ్యం.
ఆ ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు చేరడానికి కొంతమంది అధికారుల అవసరం ఉంటుంది.అలాంటిది 
#KCR అనే దొంగ నాయకుడు ఇన్ని సం.. ఇంత మంది అధికారులు లేకుండా,ప్రజల కోసం ఏం చేసినట్టు.
#ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప.
ఉదా:మంచి విద్యను అందించడం ప్రభుత్వం బాధ్యత.ఆ విద్యను చెప్పే టీచర్లను నియమించి,విద్యా వ్యవస్థను నడిపించాల్సిన పూర్తి బాధ్యత మనం ఎన్నుకున్న #ముఖ్యమంత్రిది కదా!
#ఎక్కడున్నారు ఉపాధ్యాయులు?
#గురువులేని విద్య గుడ్డి విద్య,గుడ్డిగా చదివి ఏం సాధిస్తారు మన బిడ్డలు.
నిన్నే అడిగేది #voter #ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇవ్వాల్సింది,వాడికి నచ్చినప్పుడు కాదు.ప్రజలకు అవసరం వచ్చినప్పుడు.ప్రజలకు అధికారుల అవసరం,రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి ఉంది కదా!
#ఉద్యోగాలు వాడు చేసే సహాయం కాదు.ఓట్లు వేసి మీ కృతజ్ఞత చూపించడానికి.
#అడుగు ఇన్ని సం. ప్రజల సమస్యలు తీర్చకుండా దాచిన డబ్బు ఎక్కడని?
 Courtesy by : https://twitter.com/RSPraveenSwaero/status/1502488860399640576?t=yfGRqzcir6TZoXxzKPZ2vQ&s=19