Thursday, February 10, 2022

మేడ్చల్ మండల పూడూరు గ్రామ సర్పంచ్ బాబు యాదవ్ ( TRS) 5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబట్టారు...

మేడ్చల్ :  ఏ.సీ.బీ DSP  సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయంలో చేపట్టిన తనిఖీలో మేడ్చల్ మండల పూడూరు గ్రామ సర్పంచ్ బాబు యాదవ్ ( TRS)  5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబట్టారు...

మేడ్చల్ మండల పరిధి పూడూరు గ్రామ పంచాయతీ సర్వే నెం..312 లో శ్రీనివాస్  ఓ ఫామ్ హౌస్  అనుమతి కొరకు దరఖాస్తు చేసుకుండంగా ఆ దరఖాస్తు తిరస్కరించారు.... దాంతో శ్రీనివాస్ సర్పంచ్ బాబు యాదవ్ ను కలవగా అతను‌ అనుమతి కొరకు‌ 10 పది లక్షలు డిమాండ్ చేయగా ఇరువురు మద్య 9 లక్షల ఒప్పందం చేసుకొని ఈ రోజు షామీర్‌పేట్‌ ఊర్జితా లే అవౌట్ లో సర్పంచ్ బాబు ను శ్రీనివాస్ రమ్మని 5 లక్షల నగదు ఇస్తుండగా ముందస్తు సమాచారం తో ఏ.సి.భీ అధికారులు నగదు మారుతుండగా పట్టుకున్నారు.... అతని విచారించి ఏ.సి.బి న్యాయ స్దానం కు తరలిస్తామని  డి.యస్.పి సూర్య నారాయణ తెలిపారు...
బైట్ : సూర్య నారాయణ... ఏ.సి.పి...డి.యస్.పి 

Wednesday, February 9, 2022

ప్రధాని మోడీ పై టిఆర్ఎస్ పార్టీ ఎంపీల.... ప్రివిలేజ్ మోషన్.....!

*ప్రధాని మోడీ పై  టిఆర్ఎస్ పార్టీ ఎంపీల.... ప్రివిలేజ్ మోషన్.....!*

ఢిల్లీ : ప్రధాని మోదీపై టీఆర్ఎస్‌ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్‌ మోషన్‌ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు అంశంలో ప్రధాని వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు.రాజ్యసభ సెక్రటరీకి టీఆర్ఎస్‌ ఎంపీలు నోటీసులు అందజేశారు. తెలంగాణని ప్రధాని మోదీ అవమానించారని టీఆర్‌ఎస్‌ ఎంపీలు పేర్కొన్నారు. మొన్న పార్లమెంటులో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాలపై చేసిన వ్యాఖ్యలపై అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు రెండూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి.

కాగా.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అత్యంత సిగ్గుచేటైన రీతిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. పార్లమెంటులో మైకులు బంద్‌ చేసి, పెప్పర్‌ స్ర్పేలు కొట్టి విభజన బిల్లును ఆమోదించారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాము వ్యతిరేకించలేదని, కానీ.. ఏర్పాటు చేసే పద్ధతి అదేనా? అంటూ మోదీ నిలదీసిన విషయం తెలిసిందే.

link Media ప్రజల పక్షం🖋️ 

కోర్టు ధిక్కరణకు పాల్పడిన జిల్లా కలెక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరు.

https://twitter.com/SrinivasRTIA/status/1491367257225990147?t=hayEm3WyjLvg6gooIAGq7A&s=08... *Dear @TelanganaCMO @TelanganaCS @TelanganaGuv @kishanreddybjp @trsharish @MinisterKTR @VSrinivasGoud @puvvada_ajay @YadavTalasani @chmallareddyMLA @SabithaindraTRS @mahmoodalitrs @IKReddyAllola @PSRTRS కోర్టు ధిక్కరణకు పాల్పడిన జిల్లా కలెక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరు.... @శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్ట్* https://t.co/akdwnaOOSd          ----------------------------------------  *శ్రీనివాస్ సర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సర్ గారు వాదనలు వినకుండానే ఉత్తర్వులు ఇచ్చారు. అన్యాయం చేశాడు వృద్ధ మహిళకు... వృద్ధ మహిళ బతికుండగానే చనిపోయింది అని బంధువులు తమపేరున భూమిని రికార్డ్ లో నమోదు చేసుకున్నారు అవినీతి రెవిన్యూ అధికారుల సహాయంతో...Bplkm* *Note : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సారు ఇచ్చిన తప్పుడు ఉత్తర్వులు మీద ప్రజా సంకల్పం లీగల్ బృందం న్యాయ పోరాటం చేస్తుంది ప్రస్తుతం*

https://t.co/g6Rluc7deU https://t.co/MK6CAPeCGM

-----------------------------------------------------------

ధరణి పోర్టల్ పది లక్షల మంది రైతులను మానసికంగా హింసిస్తోంది ఇప్పటికే ఐదుగురు రైతులు మరణించారు.తెలివైన పాలకులైతే ధరణి నీ రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలి.ధరణి పోర్టల్ తీసుక వచ్చి రైతులకు కొత్త సమస్యలు సృష్టించి  సంవత్సరనర కాలం గడిచినా వాటిని పరిష్కరించ లేనప్పుడు నవ్వుల పాలు కావడానికన్నా రద్దు చేస్తే ఉత్తమం కాదా? మూర్కత్వానికు పరాకాష్ట సరి చేయలేని దరణినీ కొనసాగించడం అవసరాలకు తమ భూమిని అమ్ము కోలేక సమస్యను ఏ అధికారికి మొరపెట్టు కోవాలో తెలియక త్రిశంకు స్వర్గంలో రైతులున్నారు, భవిషత్ లో జరగబోవు ఎన్నికలలో ఈ ప్రభుత్వపు ఓటమికి ధరణి పోర్టల్ కూడా ఒక కారణం కాబోతుంది,ధరణి కారణంగా సొంత భూమి పై హక్కులు కొలి పోయిన రైతులకు రైతు బందు రావడం లేదు చిత్ర విచిత్రాల ధరణి అమ్మని భూమిని అమ్మినట్లు సొంత భూమి వారిది కానట్ల భూమి పైన ఏ హక్కు లేని వాడికి హక్కులు ఉన్నట్లు కొనని భూమిని కొన్నట్లు చూపిస్తుంది, ఇదేమి ధరణి ముఖ్య మంత్రి గారు సరి చేయలేక సోమేష్ కుమార్ గారు సొమ్మసిల్లి పోయారు మీరైనా దృష్టి పెట్టండి ధరణి నీ దారికి తేవడం మీతో కాదు అని ధరణి వచ్చిన మొదటి రోజునుండే తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ చెపుతుంది అదే నిజమైంది.
తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ధరణి కి వేతిరెకంగా పోరాటం చేయకుంటే లక్షల ప్లాట్లు రిజిస్ట్రేషన్ లకు నోచుకోక పోవు, మా పోరాటం వలన మీరు వ్యవసాయేతర ప్రాపర్టీ ల రిజిస్ట్రేషన్ ల విశయం లో దరణినీ వెనకకు తీసుకున్నారు
 కానీ వేవసాయ భూముల పై దరణినీ రుద్దారు ఇంకా శస బిసలు ఎందుకు మంకు పట్టు వీడి ధరణి నీ రద్దు చేసి రైతుల గోస తీర్చండి.లేదంటే జరగబోవు ఎన్నికలలో తగిన పలితం అనుభవించక తప్పదు 
ధరణి నీ తీసుక రావడానికి ముందు సరైన అధ్యయనం భూముల పై చేయక పోవడమే ఈ విపలానికి కారణం ఇందులో మీ సొంత ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు లేవు ప్రతి పక్షాలు ధరణి సమస్యలు తెర మీదికి తేవడం లో విఫలం కావడం వలన మీ మీ ధరణి డొల్లతనం బయట పడటం లేదు.

నారగోని ప్రవీణ్ కుమార్ ప్రెసిడెంట్
తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్

Tuesday, February 8, 2022

మా ప్లాట్లు ఎక్కడ..? మాకు న్యాయం చేయండి సారు..!

మా ప్లాట్లు ఎక్కడ..? మాకు న్యాయం చేయండి సారు..!

పైసా పైసా కూడబెట్టి ప్లాట్లు కొనుగోలు చేస్తే.. పదేళ్లు గడుస్తున్నా పొజీషన్ చూపడం లేదని రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ముట్టడించారు బాధితులు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు.

వివరాల్లోకి వెళ్తే.. భూత్పూర్ తహసీల్దార్ కార్యాలయం వెనుక బాగాన ఉన్న స్థలంలో.. ఫారెన్ సిటీ పేరిట 2007లో ఓ వెంచర్ ఏర్పాటైంది. అమీస్తా పూర్ గ్రామ పరిదిలోని 465, 467, 468, 469, 476, 478, 479 సర్వే నంబర్లలో 150 చదరపు గజాల చొప్పున.. దాదాపు ఆరు వందల పై చిలుకు ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయించారు రియల్టర్లు.

ఆ ప్లాట్ల విక్రయించి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. తమకు స్థలాలను చూపించ లేదని ఆరోపిస్తున్నారు. తమ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చూపించాలని మహబూబ్ నగర్ పట్టణంలోని సాయిబిల్డర్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ప్రస్తుతం స్థలం వివాదంలో ఉందని.. అక్కడ కాకుండా మరోచోట 100 గజాల చొప్పున ఇస్తానని రియల్ ఎస్టేట్ వ్యాపారి, భూత్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కెంద్యాల శ్రీనివాస్ హామి ఇచ్చారు. అయినప్పటికీ.. లబ్దిదారులు వారిపై నమ్మకం లేదని వాపోతున్నారు. గతంలోనూ పలు మార్లు హీమీలు ఇచ్చి విస్మరించారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటున్నారు

Monday, February 7, 2022

గురుకుల విద్యార్థుల పై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు.....!! (తెలంగాణ గురుకుల విద్యాలయాల పార్ట్ టైం అధ్యాపకుల న్యాయమైన హక్కులను పరిష్కారం చేయాలి... ప్రజా సంకల్పం)

*గురుకుల విద్యార్థుల పై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు.....!*

హైదరాబాద్ : ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందిన గురుకుల విద్యార్థులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో 190 మంది మెడికల్ సీట్లు పొందడం అభినందించదగ్గ విషయమని కేటీఆర్ పేర్కొన్నారు.గత ఆరేండ్లలో 512 మందికి పైగా విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందారు. ఈ సందర్భంగా ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఆ శాఖ బృందానికి కేటీఆర్ అభినందనలు తెలపుతూ ట్వీట్ చేశారు.

*link Media ప్రజల పక్షం🖋️*

-------------------------------------------

*తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారు  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో 190 మంది మెడికల్ సీట్లు పొందడానికి కారణం అయిన తెలంగాణ గురుకుల విద్యాలయాల పార్ట్ టైం అధ్యాపకుల న్యాయమైన హక్కులను పరిష్కారం చేయాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.... Bplkm*

   https://youtu.be/qQQyMMXJsdA

prajasankalpam1.blogspot.com

TS wins Manikonda land case, avoids paying Rs. 50,000 cr to Wakf Board

TS wins Manikonda land case, avoids paying Rs. 50,000 cr to Wakf Board

The Supreme Court further said that land dedicated for pious and religious purposes is not immune from its vesting with the state.

Saturday, February 5, 2022

లతా మంగేష్కర్ ఇక లేరు.. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన గాయని

లతా మంగేష్కర్ ఇక లేరు.. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన గాయని

Courtesy by : BBC తెలుగు మీడియా ట్విట్టర్ 
లతా మంగేష్కర్

లతా మంగేష్కర్. ఆమె పాట వినని భారతీయులు ఉండరు. ఆమె భారత జాతీయ సంపద. భారతీయ సంస్కృతికి ఒక ప్రతీక. సినీ సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాణి. ఎనిమిది దశాబ్దాల పాటు కొన్ని తరాలను తన గాన మాధుర్యంలో ఓలలాడించారు. అతి తక్కువే అయినా కొన్ని సినిమాల్లో నటించారు కూడా.

‘నైటింగేల్ ఆఫ్ బాలీవుడ్’ అని పిలుచుకునే లతా మంగేష్కర్.. 36 భాషల్లో దాదాపు 30 వేల పాటలు పాడారు. ఆమె పాటల రికార్డులు లక్షల్లో అమ్ముడయ్యాయి.

బాలీవుడ్ గాయనిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన లతాకు.. క్రికెట్ అన్నా, కార్లు అన్నా చాలా ఇష్టం. వేగాస్‌ కేసినోల్లో సరదాగా జూదమాడటమూ ఆమెకు ఇష్టమే.

సినిమా పాటల్లో అనేక భావోద్వేగాలను పలికించే లతా మంగేష్కర్, జీవితంలోనూ ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.

లతా మంగేష్కర్

ఎన్నడూ బడికి వెళ్లలేదు...

1929 సెప్టెంబరు 28న మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో జన్మించారు లతా మంగేష్కర్. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ హిందుస్తానీ సంగీతంలో దిట్ట. మరాఠీ రంగస్థల నటుడు కూడా. ఐదుగురు పిల్లల్లో ఆమే పెద్దది. ఆమె ఎప్పుడూ బడికి వెళ్లి చదువుకోలేదు. తమ ఇంట్లో పని మనిషి ఆమెకు మరాఠీ అక్షరమాల నేర్పించారు. స్థానిక పూజారి ఒకరు ఆమెకు సంస్కృతం నేర్పారు. బంధువులు, ట్యూషన్లు చెప్పే గురువులు ఇతర పాఠ్యాంశాలు బోధించారు.

లతా మంగేష్కర్‌కు తొలి సంగీత గురువు ఆమె తండ్రే. దీనానాథ్ శిష్యులకు సంగీతం నేర్పుతూ ఉంటే గమనిస్తూ ఉండేది చిన్నారి లత. ఒకసారి శిష్యులు తప్పుగా ఆలపిస్తున్న రాగాన్ని తాను సరి చేస్తుండగా తన తండ్రి గమనించారని లతా మంగేష్కర్ చెప్పే వారు.

అప్పుడే లతలోని సంగీత ప్రతిభను ఆయన గుర్తించారు. తొమ్మిదేళ్ల వయసులో తొలిసారి తండ్రితో కలిసి ప్రదర్శన ఇచ్చారు లతా మంగేష్కర్.

అయితే ఆమె తండ్రి ఆర్థికంగా దెబ్బతిని, తన నాటకాల కంపెనీని మూసేయటంతో కష్టాలు మొదలయ్యాయి. మహారాష్ట్రలోని సాంగ్లీలో వారి ఇంటిని వేలం వేయటంతో.. కుటుంబం పూనా (ఇప్పుడు పుణె) నగరానికి నివాసం మారింది.

లతా మంగేష్కర్

ఇష్టం లేని ‘నటన’...

లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ 1942లో మరణించారు. అప్పటికి లతా మంగేష్కర్ వయసు 13 ఏళ్లు. పెద్ద కుటుంబం. తీవ్రమైన ఆర్థిక కష్టాలు. లతా మంగేష్కర్‌కు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. పెద్ద కూతురుగా తల్లికి అండగా నిలుస్తూ కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత తీసుకున్నారు లతా మంగేష్కర్.

వారి కుటుంబం బొంబాయి (ఇప్పుడు ముంబై) నగరానికి వలసొచ్చింది. లత సంగీతం నేర్చుకుంటూనే మరొక వైపు సినిమాల్లో పాటలు పాడే అవకాశాల కోసం ప్రయత్నించారు.

అయితే.. 1940వ దశకం తొలి నాళ్లలో పాటలు ఎక్కువగా ఉండేవి కాదు. దీంతో సినిమాల్లో చిన్నచిన్న వేషాల్లో నటించటం మొదలు పెట్టారు.

కానీ సినిమాల్లో నటించడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. ఆమె మనసంతా పాట మీదనే ఉండేది. ఎనిమిది మరాఠీ, హిందీ సినిమాల్లో నటించారు.

---------------

https://twitter.com/bbcnewstelugu/status/1490181246340714497?t=j8JjvsvRs2M-HJUjoIDl1w&s=08